క్యా…….అబ్!

“మెజారిటీ హక్కులకు యేమి భంగం వుండదు, మైనారిటీల హక్కులకే భంగం”

“క్యాబ్ వచ్చింది”

“బుక్ చేశావా?”

“దేశం మొత్తాన్ని బుక్ చేశారు”

“ఆ..?”

“దేశం అట్టుడికిపోతోంది, పిల్లలు నెత్తురొలుకుతూ చచ్చిపోతున్నారు… మాయమైపోతున్నారు…”

“వయిలెన్సుకు కారణమే స్టూడెంట్స్…”

“ఈశాన్య భారతమంతా మండిపోతోంది… అంతా స్టూడెంట్సేనా?”

“క్వశ్చన్ చేసేవాళ్ళని అరెస్ట్ చేసినట్టే, ప్రొటెస్ట్ చేసినవాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్…”

“నోట్లరద్దు, జియ్యస్టీ, కశ్మీరు, బాబ్రీమసీదు… యిప్పుడు పౌరసత్వ సవరణ బిల్లు… అన్నిటికీ యేదో వొక ట్రీట్మెంట్…”

“మరో ఛాన్స్ లేదు కదా?”

“పాకిస్తాన్ని మతతత్వదేశం అనే ఛాన్స్ మనకిక లేదు… మనమివ్వక్కర్లేదు…”

“పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలనుండి చొరబాటుదార్లు వచ్చేస్తున్నారు కదా?”

“అంటే చొరబాటుదారుల్ని నిరోధించడంలో ఫెయిల్ అయ్యామని అంగీకరిస్తున్నట్టేగా?”

“అదొదిలెయ్… మైనారిటీలకు ప్రాబ్లమేమీ లేదు, శరణార్ధులుగా వచ్చినవాళ్ళకి పౌరసత్వం యివ్వడానికే క్యాబ్…”

“క్యా…”

“ఆరు మైనారిటీ వర్గాలకు భారత పౌరసత్వం…”

“ఎవరెవరికి?”

“హిందువులకీ క్రైస్తవులకీ సిక్కులకీ జైనులకీ బౌద్దులకీ పార్సీలకీ…”

“ముస్లిమ్లకు మాత్రం పౌరసత్వం యివ్వలేదుగా?”

“ఆయా దేశాల్లో వాళ్ళు మైనారిటీలు కాదు, మెజారిటీలు కదా?”

“ముస్లిమ్లు శరణార్థులుగా వస్తే, పౌరసత్వం యిస్తారా? యివ్వరా?”

“మెజారిటీ హక్కులకు యేమి భంగం వుండదు, మైనారిటీల హక్కులకే భంగం”

“కదా?, మరి మనదేశంలో మెజారిటీ హక్కులకి యేమి భంగం కలిగిందని- హిందుత్వాన్ని కాపాడుకోవాలని యీ మూకదాడులూ కేసులూ అరెస్టులూ వుపాలూ జైళ్ళూ పౌరసత్వ సవరణ బిల్లులూ జాతీయ పౌర జాబితాలూ?”

“……………….!?!…………………..”

*

బమ్మిడి జగదీశ్వరరావు

22 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ దేశం లో బ్రతకలేక మతం ధర్మం మార్చుకొంటేనే కానీ బ్రతకనివ్వక చస్తూ బ్రతుకుతున్న శరణార్థులూ మతం మాత్రమే ముఖ్యం అనీ జాతీయ గీతం కన్నా , రాజ్యాంగం కన్నా షరియా ముఖ్యమని భావిస్తున్న ముస్లిం లూ ఒక్కటేనా , ఒకసారి ఫ్రాన్స్ , ఇటలీ , జర్మనీ బ్రిటన్ లో శరనార్థు లు గా వెల్లిన ముస్లిం లు చేస్తున్న మాబ్ లించింగ్ , స్త్రీ ల మీద అత్యా చారాలూ చూడండి

    • శరణార్థులు – అంటే అర్థం శరణు జోఛ్చిన వారని. శరణు జోఛ్చినాక మళ్లీ హిందూ ముస్లిం క్లాసిఫికేషన్ ఎంది ? కసబ్ ను శరణార్ధుడు అని రాస్తే మీరు లెవనెట్టే ప్రశ్న వెలిడ్ అవుతుంది గాని. ఎక్కడ కూడా శరణార్థులు ఏ దేశం లో కూడా organised criminal group గా ఎడ్పడలేదు.. ఒక ఆర్థిక వ్యవస్థల్లో అలా సమూహం ఏర్పడుతున్నప్పుడు క్రైమ్ కూడా ఆ సమాజానికి సంబంధీనట్లే ఏర్పడుతుంది. అమెరికాలో శ్రీలంక వాసి రాజరత్నం చేసిన స్కెన్దల్ అందరికి తెలిసిందే. మాబ్ లించింగ్ అన్నది పెద్ద పదం. అందుకు పార్టీల ప్రభుత్వాల మద్దతు కావాలి. మీరు డేటా క్లియర్ గా ఇవ్వాలి. We cant talk about impressions here.

  • శరణార్థులకు రాజ్యాంగం ప్రకారం పౌరహక్కులు వుండవన్న ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకపోవడం.

    జీవనోపాధి కోసం చొరబడేవారికి, మత విద్వేషంతో జరిపే జాతిహననం, హింసని తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవడం కొరకు వచ్చేవారికి వుండే ప్రాథమిక వ్యత్యాసం కూడా తెలియనితనం.

    ఇదే చట్టాన్ని కాంగ్రెస్, మమతక్క, కమ్యూనిస్టు మార్క్సిస్టులు గతంలో కావాలని గట్టిగా కోరిన సందర్భాలని ఎంతో పెద్దమనస్సుతో మరచిపోయే కప్పదాటు ధోరణి.

    నాలుగు లక్షలమంది కష్మీరీ హిందువులు జాతిహననానికి గురై స్వదేశంలోనే కాందిశీకులుగా గుడారాల్లో గత 27 ఏళ్లుగా బ్రతుకుతున్నా తెలుగులో ఒక్క పదం కూడా వ్రాయలేని సెక్యులర్, మానవవాద, సమసమాజ నిర్మాతల రచనా ినిబద్ధత.

    వెరసి మన వ్రాతలన్నీ రియాక్షనరీ మాత్రమే, ప్రొయాక్షనరీ కాదని నిర్ధారణ

    ‘ఈ బిల్ ప్రో మైనారిటీ’ అని హరీస్ సాల్వే అనే ప్రఖ్యాత న్యాయవాది ప్రణయ్ రాయ్ కి యిచ్చిన ఇంటర్వ్యూలో NDTV లో వివరించాడు. ఆసక్తి వుంటే మహామానవతావాదులు విని తెలుసుకోవచ్చు.

    https://www.ndtv.com/video/shows/ndtv-special-ndtv-24×7/harish-salve-on-citizenship-bill-534837

    అలాగే, సమసమాజ చరిత్రలోనే వేగుచుక్కలైన చైనా, రష్యాలు ప్రపంచంలోని ఒక్క శరణార్థిని కూడా ఎందుకు తీసుకోలేదో ఆ భావజాల పూత నిలువుగా పూసుకున్నవారు వివరిస్తే సంతోషం.

    అదేవిధంగా రెడ్ స్టార్ ఓవర్ చైనా, మావో మా నిజమైన నాయకుడు అని నినదించే ఎడమ, ఎడమాతి ఎడమ, ఎఱ్ఱ, ఎఱ్ఱాతి ఎఱ్ఱ మేధావులు, అదే చైనాలో UIGHER ప్రాంతంలోని ముస్లిములకుి పందిమాసం తినడం ఎందుకు నేర్పుతున్నారో, పరివర్తనా కేంద్రాలు పెట్టి అమానుషంగా ఎందుకు వారిని హింసిస్తున్నారో, ఆ చర్యలను శాంతి మతం అధికారికంగా కలిగిన సౌదీ అరేబియా ఎందుకు సమర్థించిందో మాకు జ్ఞానోదయం కలిగించగలరు.

    వ్యంగ్యం లక్ష్యం కేవలం వ్యంగ్యం మాత్రమే. మన రాగద్వేష ప్రకోపాలను సంతృప్తి పరచుకునేందుకై అయితే గత 70 ఏళ్లుగా వున్నట్లుగానే ఏకపక్ష, తప్పుదోవ పట్టించేవిధంగానే వుంటుంది మన సృజన.

    జామా మసీద్ షాహీ ఇమామ్ ఈ బిల్లు భారతీయ ముస్లింలకు సంబంధించింది కాదని ఎందుకు చెప్పారో కూడా తెలుసుకోవాలని వుంది.

    • ఇందులో facts తప్పుల తడక ఉంది. శరణార్ధులకి హక్కులు ఉండవు అంటే – రాజ్యాంగానికి ఎవన్న సంబంధం ఉందా ? రాజ్యాంగం దేశ ప్రజలు వాళ్ళ గురించి రాసుకుంటారు. వేరే ఎవ్వరి గురించో ఎందుకీ రాసుకోవాలి ? అది పాలసీ మేటర్. రాజ్యాంగం లో లేదు కాబట్టి , కుదరదు అనడం లో అర్థం లేదు.

      4 లక్షల కాశ్మీరీలు అనే ఫిగర్ రాంగ్. ఇప్పటి వరకున్న ఆఫీషియల్ ఫిగర్స్ 1 లక్ష ..అది కూడా ముఖ్యానంగా పండిట్స్. మాట్లాడలేదు అది తల్లు అని ఒప్పేడుకుందాం ప్రస్తుతానికి. అది కాకుండా మీ కిట్టీలో ఇంకా వేరే అస్త్రాలు ఎవన్న ఉన్నాయా ? జీవితాంతం ఇదొక్కటే బాణం వేస్తే ఎట్లా ? We can giv u hundreds and thousands of atrocities on muslims and dalits. మీ ప్రాకారం మెజారిటీ అనుగుణంగా వెళదాం. ఈ విషయం లో సరేనా ? కాశ్మీరీ పండిట్స్ సమస్య టెర్రరిస్ట్ సమస్య. టెర్రరిస్టులు పండిట్స్ కోసమే జీవితాంతం కష్టపడలేదు. వాళ్ళు చేసిన ఎన్నో దూరగాతాల్లో ఇదొకటి. ఇక లాశ్మీరీ పండిట్స్ మాత్రమే ఎలా టార్గెట్ అయ్యారు, ఏంటి అని విపరీతమైన చర్చలోకి వెళ్లే ముందు రోడ్డు పై అడక్కు తినే కషిమీరి ముస్లిములు లాలశాల్లో ఉన్నారు. మీరు ఇంతవరకు ఒక్క అడుక్కుతూనే కాశ్మీరీ పండిట్ ను చూసారా ? మన దేశం లో ప్రతిసమస్య ఒకే బరువు ఉండదు. ప్రియాంక రెడ్డి మాన భంగానికి ఫ్యూలన్ దేవి మాన భంగానికి తేడా ఉంది.

      మీరు ప్రభుత్వానికి ప్రో గా నిలిచే మేధావుల పీకు చెప్పడం ఎందుకు..డైరెక్ట్ గా మోడీ ఒకే అన్నాడు..ఈకేం ఇబ్బంది అనోచ్ఛుగా ? గురుస్వామి, సాల్వే లాంటి వాళ్ళ సర్టిఫికెట్ ఎందుకు ?

      • The Hindus of the Kashmir Valley, were forced to flee the Kashmir valley as a result of being targeted by JKLF and Islamist insurgents during late 1989 and early 1990.[4][5] Of the approximately 300,000 to 600,000 Hindus living in the Kashmir Valley in 1990 only 2,000–3,000 remain there in 2016.[6][7][8][9][10][11]t, and migrant labor from Azad Kashmir in the …https://en.wikipedia.org/wiki/Exodus_of_Kashmiri_Hindus

      • మీరు కూడా డైరెక్ట్ గా మోడీ చెప్పాడు కాబట్టి ఒప్పుకోం అనవచ్చు కదా, కష్మీరీ పండిట్లు, అడుక్కుతినడం, ప్రియాంకారెడ్డి ఈ సర్టిఫికెట్లెందుకు? చేసిన వ్యాఖ్యలో స్పష్టత కనబడడంలేదు. ఇక్కడ సమస్య ఏంటి? CAA ప్రోమైనారిటీనా, లేక యాంటీ మైనారిటీనా అన్నది. దానికి సాల్వే చెప్పిన వివరణ సరిపోలేదా? కష్మీరీ పండిట్లు అడుక్కుతినేవారయితేనే వారి జాతిహననాన్ని ఖండించాలా? లేక తరిమివేసిన తరువాత 20 గుడారాల్లో బ్రతికింది కనిపించలేదా? తెలియదా? సరిగ్గా సమాచారం చదువుకుని చర్చకు రావాలి. అది మోడీ చేసినా, జైల్లో వున్న సాయిబాబా చేసినా వాస్తవాలని బట్టి చర్చించాలి. ఉత్త రెటోరిక్ వల్ల స్థలకాలాలు వృథా అవుతాయి.

      • how could you declare that facts are wrong Mr. Victor? When you say something like you are lieing to others, why do you forget that you also have to show what are the real statistics?

        Is it not your responsibility to make your statement authentic and truthfull? You also knew that simple rhetoric that “4 లక్షల కాశ్మీరీలు అనే ఫిగర్ రాంగ్. ఇప్పటి వరకున్న ఆఫీషియల్ ఫిగర్స్ 1 లక్ష ..అది కూడా ముఖ్యానంగా పండిట్స్. మాట్లాడలేదు”.

        Do you have documentary evidence to produce?

      • ఇందులో మోడీ చెప్పింది కాబట్టి ఒప్పుకోకూడదు అన్నది ఎక్కడ ధ్వనించింది సార్ మీకు ? ఇన్ ఫేక్ట్ – మోడీ ఇంత వరకు చెప్తే నమ్మదిగా ఎదుంది ఒకటి చెప్పండి – ముద్ర లోన్స్ గురించా, డీమానెటైజేష్న గురించా, జీ ఎస్ టీ గురించా, ఆర్థిక వ్యవస్థ గురించా, సైనికుల పెన్షన్ గురించా , అయోధ్య గురించా , ఎంప్లాయ్ మెంట్ గురించా, బేంక్ లోన్స్ గురించా, రఫేల్ గురించా , అదాని గురించా, ఆసారం బాపు గురించా, జడ్జీల ఇయామకం గురించా, ఫెడరలిజం గురించా…దేని గురించి ?! plain and simple reading of the Act says – u msut give a different treatment to Muslims ( question is not of immigrants or whatever) దీనికి ఏం బ్రహ్మ విద్య కావాలి అర్థం చేసుకోడానికి ? హార్వార్డ్ రిటర్న్ సుబ్రమన్య స్వామి కావాలా దీనికి ? మీరే చెత్ప్తున్నారు కదా పండిట్స్ కు గుడారాలు కల్పించారు అని…గుజరాత్ లో గుడారాలు కూడా కల్పించకుణ్డా – గుడారాల్లో పిల్లలు పుట్తిస్తారు అన్న మోడీ చరిత్ర మర్చిపోయినారా ? సమస్యకు ప్రభుత్వ/రాజ్య మద్దతు ఉన్నవి వేరు, లేనివి వేరు – మీకు ఈ విషయం పూలన్ దేవి విషయం లో స్పృషించను కూడా లేదు కాబట్టి అది చర్చించను ఇక్కడ ఇక.

  • చురుక్ మంది.చాలమంది అభిమానులకు కాలుతుంది.

    • ఓ రెండేళ్ల క్రితం సారంగలో ఇదే రచయిత వ్రాసిన ‘‘మాస్టారూ, పేకేసుకుందామా’ చదివి కొందరికి గుచ్చుకుని, తగలబడినట్లే ఇది చదివి కూడా మరి కొందరిికి చురుక్ మని కాలినట్లుంది.

      • నిజమే,ఎప్పుడు ఎవరికి కాలుతుందో ఎవరు చెప్పగలరు.మొత్తానికి బజరా అందరికి చురకలెట్టి కాల్చే పనిపెట్టుకున్నాడు.అందుకు అతన్ని అభినదించే తీరాలి.ఆ చురకలు కీలెరిగి వాతపెట్టినట్టు ఒక్కోసారి సరిగ్గా సరిపోతాయి.ఇప్పటి చురకమాదిరి.ఒక్కోసారి పక్కకి పోతాయి.అలాంటప్పుడు ఎత్తి చూపించటం తప్పుకాదు.
        మంట ఎవరికి ఎంతుందన్నదే ప్రశ్న

      • ఇక్కడ విషయం వ్యక్తిగతంగా ఎవరికెంత మండింది అన్న కొలబద్దలు కాదు, లేదా బజరా గారి రచనా నైపుణ్యం లేదా కళాత్మక ప్రతిిభ కాదు. రూపం గొప్పగా వుండి, సారం మాత్రం జ్ఞానంతో, లేదా రాగద్వేష మిడిమిడి జ్ఞానంతో వున్నప్పటికీ రూపాన్ని చూసి భ్రమసే, లేదా రూపమే సర్వస్యం అనుకునే అల్పసంతోషుల వలన సత్యాన్వేషణ జరగదు. వ్యంగ్యం లక్ష్యం వ్యంగ్యం మాత్రమే, కాసేపే సాహిత్య ప్రతిభ ఆస్వాదనే అయితే కొందరికి ఆనందంగానే వుండవచ్చు. మనకి గుచ్చుకుని తగలబడినప్పుడు బజరాగారు తప్పుదోవ పట్టారు అని ఓ పది పదిహేనుమంది దండెత్తి వచ్చి మార్క్సిస్టు మూలసూత్రాలతో సహా సమర్థించుకోవడం, అదే వ్యాసంలో తమ అనుభవాలని చెప్పి తమ భావజాలం గలవారే జరిగిన అన్యాయాలని ఏకరువు పెడితే మహామౌనం వహించడం, వేరొకరి గురించి అదే రకమైన అజ్ఞానంతో వ్రాసినప్పుడు చంకలు గుద్దుకుని కీలెరిగి వాతపెట్టినట్లు సంతోషించడం అనేవి ద్వంద్వ ప్రమాణాలు. వ్యంగ్యం వ్యంగ్యం కోసమే అయితే విషయం ప్రక్కదోవ పడుతుంది. పైన వ్యంగ్యము, విషయము కలిపి ఈ సృజన ఎంత తెలియనితనమో వ్యాఖ్యానించాను. మనకేమైనా ఆసక్తి వుంటే వాటికి సమాధానం చెప్పవచ్చు. లేదూ, మా గురించి వ్రాసినవి ప్రక్కకు పోతాయి, ఎదుటివారి గురించి వ్రాసినవి మాత్రమే గుచ్చుకుంటాయి అనుకుని స్వీయ ఆత్మ సంతృప్తి పడితే ఇక్కడే ఆగిపోవచ్చు.

  • నా చిన్నప్పుడు ఒక సామెత విన్నాను.రామాయణమంతావిని రాముడికి సీతేమవుతుందని అడిగినట్టు అని.దేశమంతా గగ్గోలు పెడుతున్నా తిరిగి అమాయకంగా అడిగే ప్రశ్నలకేమి జవాబు చెపుతారు ఎవరైనా. నిజానికి అవి ప్రశ్నలేకావు.ముచ్చట్లు.

    మార్క్సిస్టులెవరైనా మార్క్సిస్టు మూలసూత్రాల ఆధారంగానే మాట్లాడతారు.కనుక మార్క్సిస్టులుఎవరైనా పొరపాటుగా మాట్లాడినా దానిని ఎత్తి చూపుతారు మరొకరు.దానికి బజరా కూడా అతీతుడుకాదు.మార్క్సిస్టులకు తన పర భేదం ఉండదు ఉండకూడదు.ఉంటే వాళ్ళు మార్క్సిస్టులే కారు. మార్క్సిజం శాస్త్రీయమైనది.అది సైన్స్.
    మాకు మనిషి ప్రధానం.మతం కాదు.ఎందుకంటే
    మనిషి ప్రధానంగా మాట్లాడేది మానవత్వం.
    మతం ప్రధానంగా మాట్లడేది మతతత్వం.అది ఏ మతమైనా కావచ్చు.

    • How Marxism is scientific? It was failed in Russia! It has changed shape to become power in China – if you had any doubt, see that somebody asking is it communism/marxism and chairman answering “A cat a cat if it can catch s rat whether it is black or white! ”

      But, the person who raised the doubt is not an outsider and the answer is just an eye wash rhetoric but not correct answer.

      If you are confident enough to answer the questions about marxism I had some questions about your statement of “Marxism is scientific! ” – can I ask my questions?

      • మార్క్సిజం సైంటిఫిక్ అవునా కాదా అని ఒకరు చెప్పాల్సినపనిలేదు.మీరు చదువుకుంటే మీకేతెలుస్తుంది..మీరు నన్ను ప్రశ్నలు వేయాల్సిన పనిలేదు,నేను చెప్పాల్సిన పని అంతకన్నాలేదు.మార్క్సిజం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది.చెపుతుంది.మీరు చేయాల్సిందల్లా దానిని చదువుకోవడమే.

        ఒకరిద్దరు విద్యార్ధులు లెఖ్ఖ తప్పు చేస్తే ఆతప్పు ఆవిద్యార్ధులదవుతుంది లెఖ్ఖయిచ్చినవాడిది తప్పుకాదు.

        పిల్లి పిల్లే అనేదినిజమే.కాని పాపం అది బల్లిని పట్టుకొని ఎలుకనుకుంది.
        ఎలుకలు పందికొక్కులను పట్టుకోవడానికి గండుపిల్లి రావాల్సి ఉంది.వస్తుంది.(అది ఇవాళ రేపా అని అని తొందరవద్దు.దానికింకా సమయం చాలావుంది.)

    • You need not to advise me go and read it. The questions I am going to ask were on basic concepts of Marxism. Once you made a public statements like “Marxism is scientific”, you must become a position to answer the question how it is scientific, and you can not abscond from the responsibility of answering the questions.

      Hindu propagandists also argue like this – go and read Vedas, every thing is there. Do you support that silly argument?

      How do you learn about Marxism? Have you started believing Marxism without questioning it in a fine moment of revelation?

      If you really think Marxism is scientific, and you are confident about your expertise you would never deny the chance to answer the questions from even blind haters of Marxism!

      How do you propagate Marxism, Which you claim as scientific? Is it right to advise somebody who want to learn from you by ssying:go to some place, get some books, read and believe it!

      What kind of educating is this?

      • ఏ అంశమైనా చదువుకోవడం ద్వారనే కూలంకుషంగా తెలుసుకోగలం.ప్రశ్న జవాబు అనే కాకుండా అనేక అనుబంధప్రశ్నలకు,అనుమానాలకు సందేహాలకు అక్కడ సమాధానం దొరుకుతుంది.మీకు సమాధానాలు చెప్పడానికి మార్క్సే అక్కడ సిద్ధంగావున్నాడు.నేను చెప్పడమెందుకు.

        ఏ విషయం గురించైన తెలుసుకోవాలనుకున్నప్పుడు నేరుగా తెలుసుకోవడమే మంచిది.ఇతరులద్వారా తెలుసుకోవడం వలన వాళ్ల వాళ్ల ప్రభావాలకు లోనయ్యే అవకాశముంటుందని జిడ్డు క్రిష్ణమూర్తిగారు చెప్పినట్టు ఏక్కడో చదివాను.అదే మంచి పద్దతనీ నేను నమ్ముతున్నాను.

        నేను మార్క్సిజం ముఖ్యంగా “పెట్టుబడి” గ్రంధం చదవడం ద్వారానే తెలుసుకున్నాను.చదివిన చదువుతో పాటు నా అనుభవాలు అది సత్యమేనని చెప్పాయి.కనుక నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.మార్క్సిజం శాస్త్రీయమే అని.

        వేదాలను గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అవి చదువుకోవడమే ఉత్తమమని భావిస్తాను.ఎవరో చెప్పినదానిపైన ఆధారపడడమెందుకు.

        మార్క్సిజం ను గుడ్డిగా ద్వేషించే వారి గురించి నేను పట్టించుకోను.అది వారి సమస్య. నమ్మడం నమ్మకపోవడం వాళ్ల యిష్టం.వాళ్ళు నమ్మకపోవడం వలన నాకేమి నష్టం లేదు. మార్క్సిజానికి అంతకన్నాలేదు.వుంటే గింటే వాళ్లకే వుంటుంది నష్టం.
        నేను మార్సిజాన్ని ప్రచారం చేయాలని కూడా అనుకోవడంలేదు.ఆ అవసరం దానికి లేదు. ఎంత ప్రచారం చేసినా ఎవరికి అవసరం లేని సరుకుచెల్లుబాటుకాదు.
        అవసరమున్నవారే వెతుక్కుంటారు.

    • Mr. Reddi,
      Your recent comment, which you wrote after removing my comment which challenges you – really shows how much frightened you are!

      If I am frightened I would not persuade you to answer my questions.

      You are again talking silly, “మీకు తెలుసు కోవాలన్న జిజ్ఞాస లేదు.కెలకాలన్న కోరికతప్ప.” – what do you mean by this statement?

      I told you already that I have enough knowledge in marxist ideology to challenge you to prove how it is scientific, and still you are parroting about “jijnaasa”, and “kelakatam” – how could you think like that?

      Yes, I am not your friend, but a strong enemy of you and your ideology! So, what makes you to abscond from the chance of winning an enemy in the discussion?

      Your ideology itself revolves around war, artillery, ferocity, struggle,dialog with opponents and there isythe central concept of “with only fight taking arms with capitalists and after winning them we will create class less society”, and now you are talking like a Gandhian satyagrahi!

      How silly you are by saying “మీలాంటి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చుకుని నా సమయాన్ని నేను వృధాచేసుకోలేను,” – how you will get revolution? Just reading das capital like a Christian reads bible and parroting like “ఎలుకలు పందికొక్కులను పట్టుకోవడానికి గండుపిల్లి రావాల్సి ఉంది.వస్తుంది.(అది ఇవాళ రేపా అని అని తొందరవద్దు.దానికింకా సమయం చాలావుంది.)” is enough? Then what is the meaning of “viplava kasryakramam/marxist revolutionary broadcasting” ,which both Karl Marx and V. I. Lenin suggested to leople like you!

      Why you cover up your fear by saying “మాగురించి,మార్క్సిజం గురించి మాకేభయమూ లేదు. బహుశ మీలోపలే ఏదో భయమున్నట్టుంది.అది చూసుకోండి.” – if I had such fear, I would not come here again and again and challenge you.

      I already gave you two options :accept my challenge or accept Marxism is not scientific – how do you think that it is cowardly act?

      Including the writer of this post you are all cowards.OK,I do not loss anything by coming here any number of times, because I am fighting for getting respect for Hinduism and it is my duty to challenge anybody who insults my religion. I did well here by successfully troubling you. Just know how much strong Hindus are and how they fight with people like you. I and you also fully knew that definitely I only win if you continue discussion!

      COME WITH ME, OR YOU WILL DIE – TERMINATOR!

  • ఈ బిల్లుని సమర్ధించిన ఒకాయన గురించి చెప్పాలి.
    ఆయన 1986 లో రాజీవ్ కేబినెట్ లో మంత్రి.
    అసదుద్దిన్ ఒవైసీ కన్నా ఎక్కువ న్యాయశాస్త్ర పరిజ్ఞానం, షరియా చట్టాలూ తెలిసిన న్యాయవాది.
    1986 లో రాజీవ్ గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా కేబినెట్ లో కొనసాగి ఉంటే (రాజకీయప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే) హమీద్ అన్సారీకి బదులు ఉపరాష్ట్రపతి ఐనా అయ్యేవాడూ, లేదా 2004-2014 మద్య చాలా ప్రాధాన్యత ఉన్న శాఖలతో మంత్రి ఐనా అయ్యేవాడు.

    1991-95 మద్యలో తాంత్రికవేత్త చంద్రస్వామి బాదితుడు.

    సెక్యులర్ భావాలు లేవు అనుకుంటారేమో, 1985-2005 ల మద్య కాంగ్రెస్, ములాయం, మాయావతి ల పార్టీల్లో ఉన్నాడు (రాజకీయాలకోసం పిరాయింపు చేసడు అనుకొనేముందు తొలిసారి 1986 లో కేంద్ర మంత్రిపదవి వదులుకున్న నేపద్యం చూడండి).

    ఆయన పేరు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.

    ప్రస్తుతం ఆయన కేరళా గవర్నర్.

    ఈమద్య ఒక సదస్సులో ఈ చట్టం పై ఆయన కొన్ని సందేహాలు తీరుస్తూ ఉంటే లిబర్ మేధావీ, చరిత్రకారుడూ, అసహనాన్ని వ్యతిరేకించే సమూహ ప్రతినిధీ ఐన, ఇర్ఫాన్్హబీబ్ ఆయనని పక్కకి నెట్టినంత పని చేసాడు.

    ఒకవేళ గవర్నరుగారి సమాధానాలు తప్పులతడక ఐతే ఆవిషయం చెప్పే హక్కు ఇర్ఫాన్ హబీబ్ గారికి ఉంటుంది. ఐనా సమాధానమే చెప్పకుండా అడ్డుకున్నాడంటే, తాము ప్రజల్లో వ్యాపింపజేస్తున్న “భయం గొలిపే ప్రశ్నలకు” సమాధానం రావటం ఆయనకు ఇష్టం లేదనుకోవాలి. ఆ సమాధానాలు తప్పు అని నిరూపించలేని నిస్సహాయ ఫ్రస్టేషన్ లో మాత్రమే అలా చేస్తారు.

    తమ అభిప్రాయంతో ఏకీభవించని వక్తలను గోలచేసి, లాగెయ్యాలంటే పదోక్లాసు ఫెయిలైన కార్యకర్తలే కావాలి, తప్ప విజ్ఞులు అలా చెయ్యలేరు అనే నా నమ్మకాన్ని ఇర్ఫాన్ గారు పటాపంచలు చేసారు. ఎందుకంటే ఆయన జవహర్లాల్ నెహ్రూ విశ్వవియలయంలో చరిత్ర ప్రొఫెసర్.
    ఆయన నిష్పక్షపాత ధోరణికి వేగలేక కేకే మొహమ్మద్ చరిత్ర విభాగం వదిలి పురావస్తు విభాగం లో పైచదువులు చదివాడు.

    ఒక మాజీ ప్రొఫెసర్, ఒక గవర్నన్రుతో ఇలా ప్రవర్తించినా కిమ్మనకుండా ఉండాలంటే, ఏసంలో లెఫ్ట్ లిబరల్ మేధావులకూ, సెక్యులర్ క్రూసేడర్లకూ, రాజ్యాంగ నిపుణులకు ఎంతో సహనం, నిష్పక్షపాతధోరణి, భావప్రకటనాస్వేచ్చపట్ల అంకితభావం ఉండాలి.

    • Another comment was removed! That means you cannot take uoymy challenge.

      Cowards, Cowards all. Both Victor and Reddi had no clarity about what they trumpet/parrot and have no confidence to answer those who question their integrity!

      What you will achieve is making the exit of your favourite Marxism faster.

      We Hindus are very happy to see the cowardliness among you. It is you, are losing the chance of winning by this cowardly absconding – thanks to both of you and many thanks to saaranga!

      I WILL BE BACK – TERMINATOR

      • మీకు తెలుసు కోవాలన్న జిజ్ఞాస లేదు.కెలకాలన్న కోరికతప్ప.
        మీలాంటి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చుకుని నా సమయాన్ని నేను వృధాచేసుకోలేను,మీరెంత రెచ్చగొట్టినా.
        పిరికి వాళ్లు మాత్రమే ఎదుటివాళ్లను దోషులుగా చూపాలని ఆరాటపడతారు.
        మాగురించి,మార్క్సిజం గురించి మాకేభయమూ లేదు. బహుశ మీలోపలే ఏదో భయమున్నట్టుంది.అది చూసుకోండి.
        గుడ్ బై

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు