అక్కడ పదచిత్రాలు మెరుస్తున్నాయ్!

అఫ్సర్ చిత్రాల ప్రదర్శన డిసెంబర్ 30 దాకా వుంటుంది. ఇవాళే వెళ్ళి చూసి రండి!

ఫ్సర్ నలభయ్యేళ్ళ కవితా ప్రస్తానం చూడ్డానికి సాలార్ జంగ్ మ్యూజియానికి వెళ్దామని మా ముగ్గురు స్నేహితులం అనుకోగానే , మెట్రో ఎక్కి బయలు దేరామా? మెట్రో వేగాన్ని తక్కువగా అంచనా వేయడం వల్ల, అరగంటలో అందరికంటే ముందు చేరి పోయాం.

నిజానికి నేను కల్పనని చూసి చాలా రోజులైందని వెళ్ళాను

అక్కడ దర్శకులు నర్శింగరావు గారు కనపడ్డారు. ఎదురుగా ఉన్న పెద్ద హాల్లో ఎవరికో సూచనలిచ్చి పని చేయిస్తున్నారు.

అదసలు వేరే హాల్ , అక్కడ ఇంకేదో పని జరుగుతోందని అనుకున్నాం కాసేపు.

ఎందుకో అటువేపెళ్ళి చూస్తే.. ప్రతి చోటా అఫ్సర్ కవిత్వం గోడల నిండా అందంగా అమరి ఆ హాలంతా ప్రవహిస్తూ.. రంగు రంగులుగా

తెల్లని గోడల మీద క్రమ శిక్షణ తో ప్రతి ఫ్రేమూ…

పొద్దున్నే ఒక కల కోసం

ఆకు పచ్చని ఆకాశం

స్వాప్నికుడి నిఘంటువు

కన్నీటి లోపల..

అన్నీ మళ్ళీ మళ్ళీ చదివిన కవితలే

నచ్చిన కవితలని పుస్తకం  ముందేసుకు చదవడం కాక, గోడ దగ్గర నిలబడి మంచి వర్ణ చిత్రాన్ని చూసినట్టు అపురూపంగా పైకి చదువుకోవడం (అవును పైకే)  గొప్ప గా అనిపించింది

కవి ప్రయాణాన్ని ఛాయా చిత్ర ప్రదర్శన గా ఏర్పాటు చేయడం ఇదే ప్రప్రథమం .

ఈ గౌరవం అఫ్సర్ కే దక్కింది

నాలుగు తెలిసున్న  మొహాలు కనపడతాయి పలకరిద్దాం అని వెళ్తే నలభై కనపడ్డాయి.

సభ ప్రారంభానికి ముందు అందరూ కల్సి ఆ బొమ్మల పండగ చూస్తుంటే, అదేదో దసరాకో సంక్రాంతి కో బొమ్మల కొలువుకు చుట్టాలంతా కల్సి కబుర్లు చెప్పుకున్నట్టే అనిపించింది. తన మార్కు నవ్వుతో కల్పనా, కొండేపూడి నిర్మల గారూ, బొమ్మ దేవర నాగకుమారి గారూ, స్నేహితులు శ్రుతా, స్వర్ణా, ఝాన్సీ, ఇంకా మరి కొందరం  కల్సి తిరుగుతూ ఛాయా చిత్రాలన్నీ ఆసక్తి గా చాలా సేపు చూశాము

అసలు ఈ ప్రదర్శన కోసం నరసింగ రావు గారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. చింతకాని, ఖమ్మం, హైద్రాబాదు ఇలా అన్ని చోట్ల తిరిగి , అక్కడ ఉన్న ఫొటోలన్నీ సేకరించి, వాటిలో మంచివి, తగినవి ఎంపిక చేసి వాటికి అందంగా, కళాత్మకంగా ఫ్రేమింగ్ చేసి, మధ్యాహ్నం నుంచే సాలార్జంగ్ మ్యూజియం కి పోయి అక్కడుండి పనులన్నీ పర్యవేక్షించి, అడుగడుగునా ఆయన శ్రమ, ఆసక్తి, కవి మీద అభిమానం, కళ మీద అభిమానం ప్రస్ఫుటంగా కనపడేలా ఎంతగా  తీర్చి దిద్దారంటే సభ ప్రారంభమైనా చాలా మంది ఆ చిత్రాలు చూస్తూ తిరుగుతూనే ఉన్నారు

ఎంపిక చేసిన ఛాయా చిత్రాలన్నీ,ఖమ్మం, ఆస్టిన్,మాడిసన్, ఆస్టిన్, ఫిలడెల్ఫియా ఈ నగరాలూ, కవిత్వం, టీచింగ్, ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ప్రయాణాలూ, వివిధ ప్రాంతాల్లో ఉపన్యాసాలూ.. ఇలా వేటినీ  మిస్ కాకుండా ఏరి కూర్చి మాల కట్టారు

అవన్నీ చూస్తుండగా గొప్ప సందేహం! ఇవన్నీ ఏం చేస్తారు ప్రదర్శన తర్వాత? ఇంత చక్కగా ఏర్చి కూర్చి కట్టిన పటాలన్నిటినీ?

తీసుకు పోతున్నాం కొత్త ఇంటినిండా పెట్టుకుంటామని కల్పన చెప్పాక కుదుట పడింది బుర్ర . కొత్త ఇంటి గోడలకు సరి కొత్త అలంకారాలు !!

మున్ముందు ఇలా మరెంతమందో కవులకు ఇలా ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు జరుగుతుందేమో కానీ తెలుగు కవుల్లో ఈ గౌరవం దక్కింది అఫ్సర్ కే! అందరి బంధువూ, అజాత శత్రువు ని ఆ  మాత్రం గౌరవించుకోక పోతే ఎట్లా?

*

సుజాత వేల్పూరి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అజాత శత్రువు, sweet smile afsarji, కి,జయహో!💐పదిలంగా దాచుకోవడానికి, అందులో ఒక్క pic దొరికిన, బాగుణ్ణు, మాకు!

  • ఇది ఒక ఆటే కదా!నీ చుట్టూ బొంగరం లా తిరగ డానికి👌👌..!Afsarji..💐జయహో మీకు!మీరు,మీ కవిత్వం, శాశ్వతంగా నిలిచి పోతారు, మా గుండెల్లో..!

  • మున్ముందు ఇలా మరెంతమందో కవులకు ఇలా ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు జరుగుతుందేమో కానీ తెలుగు కవుల్లో ఈ గౌరవం దక్కింది అఫ్సర్ కే!

    అవును. నిజం. ఈ కార్యక్రమం వివరాలు చదివినప్పుడు కవికి, వారి కృషి కి తగిన సన్మానం అనిపించింది. కొత్త తరహాలో.

    అందరి బంధువూ, అజాత శత్రువు ని ఆ మాత్రం గౌరవించుకోక పోతే ఎట్లా?

    ఇది కూడా నిజమే. 40 ఏళ్లుగా రాస్తూ కూడా ఎవరికీ శత్రువు కాకుండా జీవించడం ఎలానో మీరు చెప్పాలి అఫ్సర్ గారు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు