ఒక కదలిక కదిలి చూడు

ప్పటి నీ మౌనాన్ని
అప్పుడేవరో శిలాజాల్లోంచి
బయటికి తీసి
నిప్పెడతాడు”నీ అప్పటి మౌనం నా ఇప్పటి విధ్వంసం”
అని శివాలెత్తుతాడుఇప్పటి నీ వ్యక్తిత్వం వాడి కంట్లో
కాగడాలా మండాలి
నువ్వొదిలిన వెలుతురు జాడల్లోనే
నిన్ను వాడు చరిత్రగా చదువుకోవాలినిశ్శబ్దనిషాలోంచి
ముసురుకున్న మాయల్లోంచి
బయటపడి
ఒక్క కేక
కడలి ఆగి కదిలేటట్టు వేసి చూడు

నీలో మూగరోదనలన్నీ కరిగిపారిపోయేటట్టు
ఒక్కటంటే ఒక్క దెబ్బ తుడుంమ్మీద
మేఘఘర్జన నీ ముందు సెల్యూట్ చేసేట్టు

మౌనంగా ఉండడమంటే
మరణించినట్టుకాదు
అసలు పుట్టుకే లేనట్టు
పుడమికి నీవు తెలియనట్టు
నీ తల్లిగర్భం నిను ప్రాణిగా
స్వీకరించనట్టు

పుట్టిన పసిగుడ్డు
మొదటి ఆక్రందనలాంటి
ఒక్క శబ్దం ఎక్కడో నీలోనే..వెదుకు..

నిండు చూలాలి ప్రసవవేదనలాంటిది తప్పదునీకు
శబ్దజననం నిన్ను నీవు చీల్చుకోకపోతే పుట్టదు

నీరు నీలో
నిప్పునీలో
మంచునీలో
జలచక్రం నీలో
నీకు నీవే ఓ స్వజగత్తువి
జగతి నీ జవసత్వాల్లోంచి పొంగి పొర్లేటట్టు
ఒక కదలిక కదిలి చూడు

మనిషిగా నీవు స్థిరపడిపోయేటట్టు..

*

మహమూద్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మౌనంగా ఉండటమంటే మరణించినట్టు కాదు……

    చాలా బాగుంది సర్

  • చాలా అందమైన కవిత.
    మహమూద్ భాయ్ రాసే ప్రతి కవితలో మానవీయత ఉట్టిపడుతుంది. తొలుత శీర్షిక చూసి గమ్మత్తుగా ఉంది అనుకున్నాను. అలా రాయొచ్చా అనుకున్నాను.
    కానీ, రాత రాయడం, గీత గీయడం… లా రెండింటిలోనూ వ్యత్యాసం ఉంది.
    శీర్షిక పోయెటిక్ గా భలే ఉంది.
    కవిత కూడా అద్భుతంగా ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు