సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
కథలోపలి కథసంచిక: 1 నవంబర్ 2018

ఎపిఫనీ కథా విధానం

గుంటూరు లక్ష్మి నర్సయ్య

కథలో ప్రధాన పాత్రకు కలిగే అదాటు కనువిప్పుతో లేక అనుకోని జ్ఞానోదయంతో ముగించే నిర్మాణపద్దతికి సంబంధించి సొదుం జయరాం, చాసోల కథల్ని పరిశీలించాం. కథలోని పాత్రల స్వభావం  గురించీ, ప్రవర్తన గురించీ లేక సన్నివేశాలగురించీ కలిగే మెరుపు ఎరుకను నిర్మించే ఈ పద్ధతి మూలాలు James Joyce కథల్లో ఉన్నాయ్. Katherine Mansfield  మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది.

James Joyce తన కథల్లో తాను పాటించిన  ఈ టెక్నిక్ ని epiphany అని పిలిచాడు. దాన్ని గురించి తనే ఇలా చెప్పాడు. A moment of insight, discovery, or revelation by which a character’s life is greatly altered. This generally occurs near the end of the story. కథ  చివర ఇతరులెవరో మాట్లాడుకునే మాటల్ని విన్నప్పుడు ప్రధాన పాత్రకు కలిగే తటాలు కనువిప్పు, తక్షణ జ్ఞానోదయం  మొత్తం కథను తిరిగి నిర్మించటంలోనే ఈ కళా రహస్యం ఉంది. అందుకే దీన్ని A sudden spiritual manifestation in overheard fragments of conversation అని కూడా చెబుతాడు Joyce.
Joyce రాసిన కథల్లోAraby , The Dead అనే కథలు  గొప్ప కథలు. Araby లో ఒక టీనేజ్ బాలుడికి కథ  చివరిలో కలిగిన ఎరుక ఇతివృత్తం.
తన స్నేహితుడి అక్కను చూసి ఆకర్షితుడైన ఈ అబ్బాయ్ రోజూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె తనతో మాట్లాడిన ప్రతిసారీ మైమరుపుకు గురవుతాడు. ఒక రోజు ఆమె పలకరించి Araby అనే మార్కెట్ బజారు చాలా బాగుంటుందని చెబుతుంది. అతన్ని అక్కడకు వెళ్లి చూడమంటుంది. తను రాలేనని చెబుతుంది. ఇంట్లో అనుమతి పొంది ఆ అమ్మాయికి ఏదన్నా గిఫ్ట్ కొందామనే ఆలోచనతో ఈ అబ్బాయ్ araby వెళతాడు. అక్కడ ఒక షాప్ లోకి వెళతాడు. సేల్స్ గాళ్ తనను పట్టించుకోకుండా వేరే ఇద్దరు కుర్రవాళ్ళతో ఏవో కవ్వించే మాటలు మాట్లాడుతుంది .
ఆ సంభాషణ విన్న ఈ బాలుడు ఒక రకమైన ఉద్వేగానికి లోనౌతాడు. కోపం , అవమానం తో మండిపోయి ఎదో జ్ఞానోదయమైనట్లుగా వచ్చిన పని కూడా మరిచి ఇంటిదారి పడతాడు. ఆ కొత్త ఎరుకలో తాను అప్పటివరకూ ఇష్టపడుతున్న అమ్మాయి పట్ల  ఆకర్షణ కూడా మాయమౌతుంది. ఈ epiphany విధానాన్నే ‘చెదపురుగు ‘కథలో మరింత సృజనాత్మకంగా వాడాడు సొదుం జయరాం. కథ  ముగింపులో శేషమాంబ చెప్పిన మాటలు విని కథకుడు ఎంత దిగ్భ్రమ చెందుతాడో మనకు తెలిసిందే. అలాంటి దిగ్భ్రమ
పాఠకులకి కలిగించటంలోకూడా జయరాం సఫలీకృతుడయ్యాడు.
Katherine Mansfield రాసిన Miss Brill కథలో ఒక వృద్ధురాలికి కలిగిన అనుభవం ఇలాంటి దిగ్భ్రమకు చెందిందే. ఆదివారం పార్కులో జరిగే వేడుకలో పాల్గొనడానికి చక్కగా ముస్తాబై తనకున్న ఫర్కోట్ తొడుక్కుని వెళుతుంది. అక్కడి యువతీ యువకుల్నీ, సంగీతాన్నీ , దృశ్యాల్నీ  ఆనందిస్తుంది. ఆ సమయంలో తనపక్కనున్న ఇద్దరు ప్రేమికులు  తమ గోప్యతకు ఆమె అడ్డు వచ్చినట్లుగా మాట్లాడుకోవడం వింటుంది. ఆమెని, ఆమె తొడుక్కొచ్చిన కోటునీ ఏహ్యంగా చూస్తారు. ముసలిదానికంత అవసరమా అన్నట్లు మాట్లాడుకుంటారు.
Why does she come here at all– who wants her? Why doesn’t she keep her silly old mug at home ?
It’s her fur coat which is so funny,  It’s exactly like a fried whiting
Ah, be off with you
ఇలా సాగిన ప్రేమికుల సంభాషణ  వృద్ధురాలి మనఃస్తితిని పూర్తిగా మార్చుతుంది.
తనలాంటి వాళ్ళను యువత ఇలా చూస్తుందనే కొత్త స్పృహ ఆమెను అశాంతిపాలు చేస్తుంది. కలచి వేస్తుంది. ఇంటికెళ్లి మ్రాన్పడుతుంది. సరిగ్గా ఇదే స్థితిని’ వాయులీనం’
కథలో రాజ్యం ఎదుర్కొంటుంది. తనన్నా తన అభిరుచులన్నా తన భర్తకున్న చిన్న చూపు తన ఫిడేలును ఆయన అమ్మివేసినప్పుడు ఆమెకు అర్ధమౌతుంది. ఈ కథలో ముగింపు సంభాషణ ఉండదు. రాజ్యం తనలో తాను మాట్లాడుకోవడం ద్వారా తన మెరుపు ఎరుకను బయటపెడుతుంది.   చాసో గొప్ప గుప్తతతో కధను నడిపి ముగింపులో పాఠకుల మతి పోగొడతాడు.
ఇలా James Joyce  పరిచయం చేసిన ఎపిఫనీ ని మన కథకులు మరింత ప్రతిభావంతంగా వాడిన  ఉదాహరణలు చాలా వున్నాయ్.
*

గుంటూరు లక్ష్మి నర్సయ్య

View all posts
కథలో మన ప్రత్యేకత ఎక్కడ?!
క్రాస్ రోడ్స్…

2 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Padmapv says:
    February 25, 2019 at 10:44 am

    కృతజ్ఞతలు, తెలియని విషయం , గురించి, వివరణ.బాగాచెప్పారు. Sir!

    Reply
  • Padmapv says:
    March 30, 2019 at 11:28 am

    మీ, విశ్లేషణ బాగుంది, sir, వాయులీనం, నాకు బాగా నచ్చిన కధ. మిగతావి, ఇప్పుడే chadivanu. కృతజ్ఞతలు. మీకు !

    Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న మారబత్తుల

Jeffrey and Me

Swapna Peri

నాలుగు అంకాల జగన్నాటకం

ఉణుదుర్తి సుధాకర్

సుమంగళీ మాత

బొల్లోజు బాబా

ప్రాక్సీ

పెద్దన్న మారబత్తుల

పసుపుకొమ్ము నవ్వింది

ముక్కామల చక్రధర్

ఉక్కట్టు

ఎండపల్లి భారతి
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు