वह तारें तोड़ लाकर
आसमाँ के चादर में काढ़ लेती है
चाँद बनकर वह
उसे चाँदिनी बनाता है
वह मोतियाँ चुन -चुन लाकर
हौले से उसकी अंजुरी भर देती है
वह माला बन
उसे सालंकृत करता है
वह लहरों को लाद लाकर
नदी बन बहती है
वह समंदर बन उसे अपने आगोश में ले लेता है
वह बादलों को बटोरकर
बरसाती बूंदों की गठरी बाँधती है
वह बारिश बन
उस पर बरस जाता है
वह स्नेह बन
बाती भिगोती है
वह उसे
दिया बनाकर जलाता है
वह कली सा छिटककर
फूल बन खिलती है
वह खुशबू बन
उसे गले लगा लेता है
वह जुगनुओं को एकत्र कर
रातों को सजाती है
वह सपना बन
उस के अंतस में उतर जाता है
वह हर्फों को
अल्फ़ाज़ बनाकर
जुमले पिरोती है
वह उसे मेरी शे ‘ र कहकर
सलाम-दुआ करता है
वह आशिक है
यह माशूका
दोनों
एक – दूसरे के होकर
एक – दूसरे में एक हो जाते हैं।
तेलुगु मूल – पद्मावती राम भक्त
ఐక్యం
ఆమె చుక్కలు కోసుకొచ్చి
ఆకాశపు దుప్పటికి అద్దుతుంది
అతడు చందమామై
ఆమెను వెన్నెలను చేస్తాడు
ఆమె ముత్యాలను ఏరుకొచ్చి
మృదువుగా దోసిట్లో పోస్తుంది
అతడు మాలై
ఆమెను అలంకరిస్తాడు
ఆమె అలలను మోసుకొచ్చి
నదిలా ప్రవహిస్తుంది
అతడు సముద్రమై
ఆమెను కలిపేసుకుంటాడు
ఆమె మబ్బులను సేకరించి
చినుకులను కట్టకడుతుంది
అతడు వానై
ఆమెపై కురిసిపోతాడు
ఆమె చమురై
వత్తిని తడుపుతుంది
అతడు ఆమెను
దీపాన్ని చేసి వెలిగిస్తాడు
ఆమె మొగ్గ తొడిగి
పూవ్వై విరుస్తుంది
అతడు ఆమెను
పరిమళమై కౌగిలించుకుంటాడు
ఆమె మిణుగురులను పోగేసి
రాత్రులను అలంకరిస్తుంది
అతడు ఆమెలోకి
స్వప్నమై నడచిపోతాడు
ఆమె అక్షరాలను
పదాలుగా పేర్చి
వాక్యాలను కూరుస్తుంది
అతడు ఆమెను
కవితంటూ పలకరిస్తాడు
ఆమె ప్రకృతి
అతడు పురుషుడు
వారిరువుతూ
ఒకరికి ఒకరై
ఒకరిలో మరొకరు ఐక్యమౌతారు
-పద్మావతి రాంభక్త








Add comment