శారదా శ్రీనివాసన్ వీడియో ఇంటర్వ్యూ – మూడో (ఆఖరి) భాగం

నవ్వుతుంటే జలపాతం జర జరా జారినట్టుందని కవులనగా చదివారు కదా!  ఇప్పుడు ప్రత్యక్షంగా విని పరవశించడానికి రండి.

కొంతమంది సౌందర్యం శరీరం మీదే కాదు, వాళ్ళ గొంతుల్లో కూడా ప్రతిధ్వనిస్తుంది.  వాళ్ళ స్వర పేటికలు తేనెలద్దిన పల్చటి పూల  రెక్కలు.

అదిగో అలాంటి అందాల మహారాణి శారదా శ్రీనివాసన్.

నాటకాలను చూడడంలోనే కాదు, వినడంలో కూడా ఎంత అనుభూతి ఉంటుందో ఆ తరం వాళ్ళని అడిగితే చెప్తారు.  ఆ రోజుల్లో రాత్రి 9.30 కి ఆకాశవాణి నుంచి లైవ్ నాటక ప్రసారాలు. ప్రి రికార్డింగ్ లేదు, ఎడిటింగులు లేవు, చిన్న అపశృతి పలికినా నాటకం సర్వ నాశనమై పోతుంది.

అలాంటి రోజుల్లో ఒక్క నండూరి విఠల్ గారితోనే వెయ్యికి పైగా నాటకాలు పలికారంటే ఆవిడ స్థాయిని మనం వూహించవచ్చు.  ఎన్నెన్ని జ్ఞాపకాలు.  చలం గారి “పురూరవ” విని పరవశించి పోయారని చెప్పాలా!?  పింగళి లక్ష్మీకాంతంగారు, స్థానం నరసింహారావు గారు, బందా కనకలింగేశ్వరరావుగారు, బాలాంద్రపు రజనీకాంతరావుగారు, కృష్ణశాస్త్రిగారు, ముని మాణిక్యంగారు, బాలమురళీ, ఓలేటి, బుచ్చిబాబు, దాశరధి సోదరులు,  గోపిచంద్, మరెంతమందో మహామహులు పట్టుబట్టి ఆవిడ చేతే తమ రచనలని పలికించేవారని చెబితే వోర్నాయనో అని అనిపించదూ!!

శ్రీకాంతశర్మగారు ఆవిడని దృష్టిలో పెట్టుకొని రాసిన “ఆమ్రపాలి” నాటకాన్ని, ఆవిడ 83వ యేట పలికారంటే, వూహించండి ఆవిడ స్వర మధుర విన్యాసాన్ని. ఆవిడకి అత్యంత ఇష్టమైన పాత్ర తిలక్ “సుప్త శిల”లోని అహల్య.  ఆవిడకి అజరామరమైన ఖ్యాతిని తెచ్చిన పాత్ర చలం “పురూరవ”లోని ఊర్వశి.  1959 నుంచి 1995 వరకు ఆకాశవాణిలో ఆవిడ ప్రమేయం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు.  ఆకాశవాణి కళాకారుడు, మిత్రుడు, ప్రియుడు, భర్త  శ్రీనివాసన్ గారు, వేణుగాన విద్వాంసుడు టి.ఆర్. మహాలింగంగారి అత్యంత ప్రియ శిష్యుడు.

నవ్వుతుంటే జలపాతం జర జరా జారినట్టుందని కవులనగా చదివారు కదా!  ఇప్పుడు ప్రత్యక్షంగా విని పరవశించడానికి రండి.

 

 

'ఛాయ' మోహన్ బాబు

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • సినీ నటి శారదకు అవార్డు వచ్చినందున ఊర్వశి శారద అయ్యారు; ఊర్వశి స్వరానికి ప్రాణం పోసిన ఈమె కూడా ఊర్వశి శారదే.

 • కృష్ణ మోహన్ బాబుగారికి అభినందనలు
  శారద శ్రీనివాసన్ గారి జలతారు జ్ఞాపకాలను జాగర్తగా దాచిపెట్టినందుకు
  వారన్నట్టు ఏ ప్రయత్నమూ లేకుండా స్వరాన్ని కాపాడుకున్న స్వర సామ్రాజ్ఞి వారు…ఈమధ్య రికార్డు చేసిన
  ఆమ్రపాలి నాటకం రిహార్సల్స్ లో వారు ఆర్టిస్టుల ఉచ్చారణ మోడ్యులేషన్ కరెక్ట్ చేసిన తీరు ఆవిడలోని ఏకాగ్రతకు లేదా ప్రొఫెషనలిజం కు అద్దం పడతాయి…
  రేడియో జ్ఞాపకాలను వారి ద్వారా మనకందించిన కృష్ణ మోహన్ బాబుగారికి అభినందనలు

 • ‘ఛాయ’ మోహన్ బాబు గారూ ..
  శారద గారు మీతో ప్రత్యక్షంగానూ , మాతో పరోక్షంగానూ పంచుకున్న ఆకాశవాణి అనుభవాలు అటు రేడియో శ్రోతలతో పాటూ ఇటు సాహిత్య అభిరుచిగల వారికి సైతం ఆనందం కలిగించాయి. మరిన్ని ఇంటర్వ్యూలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. రంగస్థలం, సాహిత్యం, సంగీతం, చలనచిత్రం, చిత్రలేఖనం వగైరా కళల కు అనుసంధానమైన అనుభవజ్ఞుల ను మా ముందుకు తెస్తారని ఆశ .

 • ఇంత మంచి విషయాలను తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు.

 • అద్భుతం . ఆవిడకు నాటకభాషలో మేము తరసు వాడే వోయస్ (గొంత్) కల్చర్ చాలా చెప్పుకో తగధి. ఇంటోనేషన్ కానీ మాడ్యూలేషన్ కానీ చాలా అరుదుగా కనిపిస్తుంది మన ఆధునిక నాటక రంగం లో. ఆవిడ చాలా గొప్పగా చెప్పారు. చాలా బావుంది మోహన్ కుమార్ గారూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు