రోమాంచము

అనువాదం: అవినేని భాస్కర్ 

రాత్రి మెలుకువ వచ్చినప్పుడల్లా సారిక నెంబర్‌కి ఫోన్ చెయ్యడం అలవాటుగా మారిపోయింది ఈ కథలో మఖ్యపాత్ర అయిన సింగపూర్ శ్రీనివాస రావు సింగమనేనికి. ఈ పేరు కథలో చీటికి మాటికి వస్తూ ఉంటుంది. అంత పొడవైన తేట తెలుగు పేరు అన్ని సార్లు చదవాలంటే తెలుగు పాఠకులకు విసుగు కలిగి కథ చదవడం మానేస్తారు కాబట్టి అనువాదకుడి స్వేచ్ఛని ఉపయోగించుకుని పేరుని సీనూ అని కత్తిరిస్తున్నాను. అనువాదకుడిగా మరో ప్రివిలేజ్ కూడా తీసుకున్నాను, పాఠకులు నన్ను మన్నింతురుగాక. అదేంటంటే ఈ మూల కథ అరవ పేర్లతో అరవ సాంప్రదాయంతో సాగినా కథలో ఉన్న యూనివెర్సాలిటీనీ దృష్టిలో పెట్టుకుని పాత్రల పేర్లనూ, ప్రాంతాల పేర్లనూ తెలుగీకరించాను.

మన సీనూ ఇప్పుడుకూడా రెస్ట్‌రూములో కూర్చుని మొబైల్లో మెసేజీలు చూసుకుంటూ ఉన్నాడు. మూడు రోజుల క్రితం ఆమెనుండి వచ్చినదే చివరి మెసేజ్. అది పంపి ఆఫ్‌లైన్ వెళ్ళింది. తర్వాత ఆన్‌లైన్ రానేలేదు.

“నాకు కరోనా పాజిటివ్ రా” ఇదే చివరి మెసేజ్.

“సారీ.. సారీ..” అంటూ బాత్‌రూంలో కూర్చుని మంత్రంలా సారిక పేరు జపిస్తున్నాడు సీనూ.

సీనూకి సారిక ఫోన్ నెంబర్ మాత్రమే తెలుసు. మరో రకమైన కాంటాక్ట్ డీటెయ్ల్స్ ఏవీ తెలియవు. ఆమె పేరు సారికవల్లి అని తెలుసు. బంధువులెవరు, అమ్మ నాన్నలెవరు, స్నేహితుల ఫోన్ నెంబర్ లాంటి వేరే ఎలాంటి  వివరాలూ తెలియదు.

పైన చెప్పింది పూర్తి సమాచారం అనుకోలేము. ఒక విషయాన్ని పద్ధతిగా చెప్పుకు పోయేప్పుడు ఇలాంటి అసంపూర్ణత సహజం. సారిక బ్రెస్ట్ సైజు, ఆమెకు నచ్చిన పేంటీ బ్రాండ్, ఆమె తొడమీద వేయించుకున్న టేటూ డీజైన్, ఆమె చంకలో ఉన్న ఎర్రని పులిపురి, యోనిలో ఉన్న చిన్నగాటు, ఇలా లెక్కలేనన్ని విశేషాల పెన్నిధిలాగా ఉన్నాడు సీను.

సారిక హేర్ రిమూవర్ వాడి, దానివల్ల వచ్చిన అలెర్జీకి ఏం క్రీము రాసుకుంటుంది అన్న వివరాలదాక సీనూకి అన్నీ తెలుసు. సారిక హేర్ రిమూవర్ వాడే రోజున సీనూ కూడా అదే బ్రాండ్ హేర్ రిమూవర్ వాడుతాడు. టైమ్ నోట్ చేసుకుని, సరిగ్గా అదే సమయానికి ఉన్న అన్ని సాంకేతికి సదుపాయాలను సమర్థవంతంగా వాడుకుని, ఇద్దరూ హెచ్‌డీ వీడియో కాల్ ఆన్ చేసుకుని, హేర్ రిమూవర్ వాడేవాళ్ళు. విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాల పుణ్యమా అంటూ రెండు దేహాలు ఒక ప్రాణంగా మమేకమైన తరుణం అది.

“ఏరా బంగారు కొండా? నువ్వు హాయిగా ట్రిమ్మర్ వాడొచ్చు కదా?” అని  సారిక ఎంతో అక్కరగా ప్రేమగా అడిగింది.

“లేదు బుజ్జి కన్నా. ఇది వాడితే నీకెంత మంట కలుగుతుందో ఆ మంటని, బాధని నేనూ అనుభవించాలి” అని జవాబిచ్చి తమ ప్రేమని కావ్యస్థాయిని దాటించి ఇంకా ఎత్తులో నిలిపిన సీనూ, ఇప్పటిదాకా ప్రపంచంలో ఖ్యాతికెక్కిన అన్ని అమర ప్రేమ గాధల్నీ హేర్ రిమూవర్ మాడ్చేసే రోమాలలాగా మాడ్చేశాడు.

అప్పుడు సారిక “అలా ఎందుకురా బంగారం? ఇప్పుడు చూడు నాకు పీర్యడ్స్ వస్తుంది” అని చెప్పగానే ఆమె వాక్యాన్ని ముగించనివ్వకుండా ఆపిన సీనూ, అప్పట్నుండి సారికకి పీర్యడ్స్ వచ్చినప్పుడెల్లా తనుకూడా పేడ్ పెట్టుకోసాగాడు. తాను పేడ్ పెట్టుకునే ఫోటోని సారికకి పంపించాడు. అది చూసిన సారిక ప్రపంచ ప్రఖ్యాత ప్రేమలన్నిటి పోలిమేరలనూ తమ ప్రేమ దాటినట్టు భావించి, కరిగిపోయి నిశ్చేష్టురాలై చాలాసేపు కటిక మార్బుల్ నేలపైన పడుకుండిపోయింది.

రక్తపు జిడ్డుకోసం కొంచం టొమేటో సాస్ అండర్వేర్లో పోసుకున్న సీనూ, పొత్తికడుపు నొప్పికొసం వంద గ్రాములు నానబెట్టిన బియ్యం, పిడికెడు ఉలవలు, నాలుగు స్పూన్లు ముగ్గు పిండి, నాలుగైదు చాక్పీస్ ముక్కలు తిని చివరిగా నిప్పాన్ వినిలెక్స్-5000 ఇంటీరియర్ పెయింట్ మూడు స్పూన్లు తాగి పడుకునేవాడు.

తప్పిపోయిన ఒక్క విషయం చెప్పబోతే దాని పాటికి అది పారాలు పారాలు లాక్కెళ్ళిపోతుంది. వాళ్ళ ప్ర్రేమ యొక్క ప్రత్యేకతనీ, పవిత్రతనీ చెప్పేందుకు ఇది సమయం కాదు. అదంతా వివరంగా చెప్పుకుని తిరిగి కథలోకి వచ్చేవరకు కాలం ఆగదు కదా? అప్పటికి కథ ముగింపుకి వచ్చినా రావచ్చు. అప్పుడు వర్తమానపు కథని ఫ్లాష్బ్యాక్లో చెప్పాల్సిని దుస్థితిలోకి నెట్టబడతాం. కాబట్టి నేపధ్య విశేషాలు పక్కనపెట్టి జరుగుతున్న కథకు అవసరమైన ప్రాధమిక అంశాలు మాత్రం చూద్దాం.

సీనూ సింగపూర్లో ఉద్యోగం చేస్తున్న భారతీయుడు. ముఖ్యంగా తెలుగువాడు. సారికవల్లి విజయవాడలో ఉంటుంది. ఇద్దరికీ అన్లైన్ ద్వారా పరిచయమయి క్లోజ్ అయ్యారు. వీళ్ళు ఎంత క్లోజ్ అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆదర్శ, అన్యోన్య దంపతులు తమ జీవిత కాలంలో మాట్లాడుకున్న దానికంటే వందరెట్లు ఎక్కువగా చాట్లోనూ, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌లోనూ మాట్లాడేసుకున్నారు.

మన సీనూ నిద్రచెడి, సారికని సంప్రదించడానికి మరేమైనా మార్గాలున్నాయా? లేదా ఇంకెవరినైనా సారిక గురించి కనుక్కోగలమా అని ఆలోచిస్తూ లేప్టాప్ కీబోర్డుమీద తాళం వేస్తూ ఉన్నాడు.

మూర్ఖుడిలా గూగూల్ లో “సారికవల్లి, విజయవాడ” అని వెతికాడు. సారికవల్లి విలాస్ హొటల్ ప్యూర్ వెజ్  టైమింగ్స్ అని ఒక లింక్ వచ్చింది. నా దేవి దర్శనం ఎప్పుడు దొరుకుతుందో అని ఆవేదన పడ్డాడు.

సారిక మొబైల్ నెంబర్‌ని గూగుల్లో పెట్టి వెతికాడు. ‘లిస్టా డే న్యూమరోస్ టేలిఫోనిక్స్’ అన్న శీర్షక ఉన్న వెబ్సైట్ వచ్చింది గానీ తన ఇష్ట దేవత ఆచూకీ లేదు. సారిక ఫేస్బుక్ ప్రోఫైల్‌కి వెళ్ళి చూశాడు. ప్రోఫైల్ పిక్చర్ లేదు. ఫేస్బుక్ వాళ్ళిచ్చిన టెంప్లేట్ ప్రోఫైల్ పిక్ నుండి తీసిపెట్టిన ఆడ కోతి ఫోటోలో సారిక ఏడుస్తున్నట్టు కనిపించింది.

వర్క్‌ప్లేస్, రిలేషన్‌షిప్ అంటూ చూపించటానికి ఏమీ డేటా లేదంటూ ఫేస్బుక్ నిక్కచ్చిగా చెప్పింది. ఫ్రెండ్స్ లిస్టులో ఆమెకి ఏమాత్రం సంబంధం లేని నలుగుర్ని చూపించింది. వాళ్ళు పుట్టినరోజు విషెస్‌కి కూడా జవాబు రాయకుండా ఫేస్బుక్ సర్వర్‌లో డేటా స్థితిలో గడ్డగట్టుకు పోయున్నారు. ఇలాంటి తలాతోకా లేని ప్రోఫైల్ ని చూసే కొన్ని నెలలక్రితం ‘హాయ్’ అని మెసేజ్ చేశాడు సీనూ.

జవాబు రాగానే, “మీరు చాలా సాఫ్టా?” అని బదులిచ్చాడు. ఆ తొలి మెసేజ్‌ని ఇప్పుడు సీనూనే చూడాలన్నా మూడు నెలలు ఆపకుండా మెసెంజర్‌లో పైకి స్క్రోల్ చేస్తూ కూర్చోవాలి.

మళ్ళీ గూగుల్‌కి వెళ్ళి “corona patients in andhra pradesh, sarikavalli “ అని టైప్ చేశాడు.

కరోనా డెత్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్, కరోనా వైరస్ ఆంధ్ర ప్రదేశ్ హైలైట్స్ అంటూ ఏవేవో కొన్ని వెబ్‌సైట్లు వచ్చాయి.

ఎలాగైనా సారికవల్లి ఆంధ్ర ప్రదేశ్ కరోనా ఆసుపత్రిలో పడుకుని ఉన్న ఫోటోని పట్టేసుకోవాలి అన్నంత తీవ్రంగా ఉన్నాయి సీనూ ప్రయత్నాలు.

“డైరెక్ట్‌లీ కనెక్ట్ విత్ కరోనా పేషంట్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్” అన్న లింకుని ఎలాగైనా కనుక్కువాలి అన్న ఆవేశం నిమిష నిమిషానికి పెరుగుతోంది సీనూ ముఖంలో.

“కరోనా పేషంట్ సారికవల్లి ఈజ్ వెయిటింగ్ ఫర్ వీడీయో చాట్ విత్ యూ” అని ఏదైనా ప్రకటన కూడా కంటపడే అవకాశం ఉందనుకున్నాడో ఏమో మరి, ఫేస్బుక్ వాడి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని  తారుమారు చేసి అలాంటొక ప్రకటనని రప్పించే ఘోర ప్రయత్నం చేస్తున్నాడు.

అలానే అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతని చేయి మంచానికి బయట వేలాడుతోంది. వేలాడుతున్న పిడికిట్లో అతని మొబైల్ కరోనా దెబ్బకి పోతుందా పోదా అని సందిగ్ధావస్తలో ఊగిసలాడే ప్రాణంలా ఉంది. తెల్లవారుజామున నిద్రలేచేవరకు మొబైల్  చేతినుండి జారిపోకుండా నిలిచే ఉంది. దీన్ని కావాలంటే మానవ పరిణామంలోని అభివృద్ధిగా మనం అనుకుందాం, కానీ అతను నిద్రలోనే ఒక్కసారి కింద పడి లేచి మళ్ళీ మంచం మీద పడుకున్నాకూడా మొబైల్ మాత్రం కింద పడకపోవడం మాత్రం తప్పకుండా పరిశోధించాల్సిన విషయమే కదా?

నిద్రలేవగానే మొబైల్లో సారికవల్లి ఏదైనా మెసేజ్ పంపించిందా అని చూశాడు. ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని మొబైల్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూశాడు.

“యువర్ అవైలబుల్ బేలన్స్ ఇన్ ద అకవుంట్ నెంబర్”  అని మొదలై సింగపూర్ డాలర్ 36.05 అని చెప్పే ఒక ఎస్.ఎం.ఎస్ మాత్రమే వచ్చింది.

తన గదినుండి బయటికొచ్చి కిచెన్ లోకి వెళ్ళి కెటిల్ లో బ్లాక్ టీ కాచాడు. ఆ ఫ్లాట్లో ఉన్న మిగిలిన వారి అలికిడి  కిచన్ లో లేదు.

కిచెన్ నుండి బయటకి చూశాడు. రోడ్డు కనిపించింది. ఒక కారు సింగపూర్ నుండి న్యూజిలాండ్ వెళ్ళిపోతుందా అన్నంత వేగంగా వెళ్తోంది.

మళ్ళీ తన గదికొచ్చాడు. మొబైల్ తీసి “కరోనా వాలింటీర్ గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్” అని వెతికాడు.

కొన్ని గ్రూపులు వచ్చాయి.

ఏదో నమ్మకం కలిగింది. ఉత్సాహంగా టీ తాగాడు.

ఆ గ్రూపులన్నిట్లో ఒక్కోటిగా జాయిన్ అయ్యాడు. టాయిలెట్ కి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి కొంతసేపు నిద్రపోయాడు.

నిద్రలేచాక బ్రెడ్ తీసుకుని జామ్ రాసుకుని తిన్నాడు. జ్యూస్ ప్యాకెట్ తీసి తాగాడు.

కొన్ని గ్రూపుల్లో తనని చేర్చుకున్నారు. ఆ గ్రూపుల్లో వాళ్లని కొందరిని పలకరించి, అందులో విజయవాడలో ఉన్న ఒకరిద్దరిని పట్టుకున్నాడు.

“నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆమె పేరు సారికవల్లి. ఆమెకు కరోనా వచ్చింది. విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంలో అడ్మిట్ అయింది. నాకు వివరాలేవీ తెలీడంలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయుంది. వేరే కాంటాక్ట్ నెంబర్లూ లేవు. మీరు కొంచం వివరాలు కనుక్కుని ఏదైనా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరా?”

ఈ మెసేజ్ నే కాపీ చేసి చాలామందికి పేస్ట్ చేశాడు. తర్వాత లేప్టాప్ పుచ్చుకుని ఆఫీసు పనులు చేసుకుంటున్నాడు.

ఇన్ బాక్స్ లో  “మిత్రమా చాలా కష్టపడి కనిపెట్టేశాను. ఇదిగో కాంటాక్ట్ నెంబర్” అని మెసేజ్ అలెర్ట్ వచ్చింది.

ఆ నెంబరుకు ఫోన్ చేసే ముందు భోంచేద్దాం అనిపించిందేమో. ఫోన్ తీసుకుని గ్రాబ్ఫుడ్ యాప్ ఓపెన్ చేశాడు. ఏదైనా కొత్త రెస్టారెంట్ యాడ్ అయిందా అని చూశాడు. లేదు. విసుగొచ్చి ఎప్పుడూ తినే తిండే ఆర్డర్ చేశాడు. రాకెట్ లాంచ్ చేసిన సైంటిస్టులు అది దాని ఆర్బిట్ చేరుకుని స్టేబుల్ పొజిషన్ లో స్థిరపడేవరకు ఒక్కో దశలోను ట్రాక్ చేసినట్టు భోజనం వచ్చేంతవరకు గ్రాబ్ఫుడ్ యాప్ లో భోజనం స్టేటస్ చూస్తూ ఉన్నాడు. భోజనం తెచ్చి పెట్టేసినట్టు కాలింగ్ బెల్ శబ్దం వచ్చింది. తలుపు తీస్తే ప్యాక్ ఉంది. భోంచేసి చెత్తకుండీలో ఖాళీ కవర్లు పడేసి, ఏసీ ఆన్ చేసి కొన్ని నిముషాలు కళ్ళు మూసుకున్నాడు.

మంచం మధ్యలో కూర్చుని మెసేజ్ ద్వారా దొరికిన ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. కొన్ని రింగుల తర్వాత అవతల వైపునుండి గరుకైన గొంతుతో “ఎవరండీ” అని వినిపించింది.

“సారికవల్లీ..” అని నీళ్ళు నమిలాడు.

“మీరు ఎవరండీ”

“నేను సింగపూర్ శ్రీనివాసరావ్ సింగమనేని. ఆమెకు…”

“నీ యబ్బా.. లంజా కొడకా. నువ్వు సింగపూరోడివే కదా?”

“అవును.. అయితే మర్యాదగా మాట్లోడండి బ్రో”

“నీకేంట్రా మర్యాద? ఊర కుక్కా.. వీడియోలో విప్పేసి పంగచాచి బొచ్చు గొరుక్కుంటున్నారు, నీకు మర్యాదేంట్రా? మెంటలా మీకు?”

“అసహ్యంగా మాట్లోడకండి బ్రో. ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోడం మీకు తెలీదు”

“ఒరే బోకు నా కొడకా, పెళ్ళి చేసుకుని దానితో బిడ్డను కన్నానురా. నాకు దాన్ని అర్థం చేసుకోవడం తెలీదంటావా? నేనూ నీలాగే దాని ముందు విప్పేసి బొచ్చు గొరుక్కోవాలా? అదేనా అర్థం చేసుకోవడం అంటే?”

“అది మాత్రమే కాదు. ఆమె పెయిన్ అర్థం చేసుకోవాలి బ్రో”

“ఏంటి టొమేటో సాస్ తీసి కేర్ఫ్రీలో కుమ్మరించుకుని చడ్డీలో పెట్టుకోవడమా? ఇంకో పని చెయ్యక పొయ్యావా? బెల్లం కోసుకుని ఉంటే సరిపోయేది కదా? ఆంధ్రాలో పుట్టినోడివే కదరా నువ్వు? ఇది ముట్టయినప్పుడు మాత్రమే పెట్టుకుంటావా? లేక అమ్మ, అక్కలు ముట్టయినప్పుడు కూడా పెట్టుకుంటావా?”

“అసహ్యంగా మాట్లాడకండి బ్రో. ఆమెకంటూ ఒక మనసు ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవడం కాదు కదా, గుర్తించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆమెకు ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు. అదీ మీరు ఆమెతో కాపురం చేస్తున్న లక్షణం.”

“ఆర్గాజమా? అవేవీ నాక్కూడా తెలీదు రా పంది నా కొడకా.. తిక్క మాటలు మాట్లాడి కన్ఫ్యుజ్ చెయ్యకు. ఏరా జాతి మాలిన కుక్కా అక్కడ సింగపూర్లో చైనావి ఉంటాయి కదా? ఎవతీ దొరకలేదా? వాళ్ళెవరి దగ్గరా నీ పప్పులు ఉడకలేదా? వాళ్ళు నీ నోట్లో ఉచ్చలు పోసారా? వాళ్ళ బొచ్చులు పీకొచ్చు కదా? ఇక్కడ బిడ్డను కన్న తల్లిని పట్టుకుని బిడ్డను సక్రమంగా చూసుకోనివ్వకుండా, బొచ్చు గొరిగే వీడియోలు పంపుతున్నావు కదరా పిచ్చి కుక్కా?”

“మీ కోపాన్ని అర్థం చేసుకోగలను బ్రో. బిడ్డను మీరు కూడా చూసుకోవచ్చు కదా?  మీరు కూడా కన్నారు కదా? ఇదంతా మీకు అర్థం కాదు. సారికకి కరోనా అని విన్నాను. తను ఎలా ఉంది ఇప్పుడు?”

“నా బిడ్డకు నేను ముడ్డి కడిగింది అంతా ఫోటో తీసి నీకు పంపించాలి. అలా లేదంటే మీరు వీడీయోలో గొరుక్కోవడాలను పట్టించుకోకుండా మూసుకుని పడుండాలా? కరోనా అని తెలిసింది కదా? పోటుగాడివి వచ్చి చూడలేకపోయావా?”

“పేండమిక్ బ్రో. అందువల్లే రాలేక పోయాను”

“ఇప్పుడు కదారా కరోనా…  ముండ నాకొడకా… జీల్లాలు దొబ్బేదానికి పుట్టినోడా… ఆరు నెలలుగా ఫోన్లో ఏం పీకుతున్నావు బే. అప్పుడు వచ్చి చూసి తీసుకెళ్ళుండచ్చ కదరా? ఇద్దరూ ఇలాంటి మెంటల్ కేసులు అని తెలిసి ఉంటే నీతో పంపించేసి ఉండేవాడిని కదరా..”

“…”

“మాట్లాడవేంట్రా? ఎవతిని నాకుతున్నవ్ రా అక్కడ?”

“సరే బ్రో. ఇవన్నీ మాట్లాడటానికి సమయం లేదు. ఎంతో కష్టపడి వాలంటీర్ గ్రూపుల ద్వారా మీ నెంబర్ కనుక్కున్నాను. దానికైనా గౌరవం ఇవ్వండి. సారీకి ఏమైంది? ప్లీజ్. అది మాత్రం చెప్పండి”

“అది చచ్చిపోయిందిరా… బిడ్దను, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా, గబ్బు నా కొడకా”

“ఓహ్ బ్రో… ఇది వినడానికా నేనింత కష్టపడి మీ నెంబరు పట్టుకున్నాను?” సీనూ కొంతసేపు బావురుమని ఏడ్చాడు.

సారికవల్లి మొగుడికి తాను కూడా ఇంత ఏడవలేదే అన్న గిల్ట్ ఫీలింగ్ మొదటిసారిగా కలిగింది. ఒకవేళ ఆ వీడియోలో బొచ్చు గొరుక్కునే ప్రక్రియలో ఏదైనా గొప్ప ప్రేమతత్వం దాగుందా? టొమేటో సాస్ పోసుకుని, పేడ్ పెట్టుకుని, పెయింట్ తాగడంలో ఏదో ఒక అతీత శక్తి ఉందా? ఆ శక్తి ప్రేమని బలపరుస్తుందా? అదేనా అచ్చమైన అన్కండిషనల్ ప్రేమంటే? ప్రేమ ప్రేమను తప్ప ఇంకేదీ ఆశించకపోవడం అంటే ఇదేనా? ప్రబంధాల్లో చెప్పకుండా వదిలేసిన నవవిధ  ప్రేమల్లో ఇదొకటా? లేదా ప్రేమ తనని తాను పెంపొందించుకుంటూ కొత్త రూపం దాల్చినపుడు అప్పటివరకు ఉన్న ప్రేమలన్నట్నీ తన కాళ్ళకింద వేసి తొక్కేసి ముందుకు సాగిపోతుందా? వీడు మాడర్న్ రోమియోనా? అంటూ మేధావిలాగా ఆలోచించడం అతనివల్ల కాకపోయినా, అప్పుడు అతని బుర్రలో జరిగే న్యూరాన్, కెమికల్ మార్పులు ఒక మేధావి బుర్రలో జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఒక మేధావి బుర్రలో ఐతే ఎలాంటి ఆలోచనలొస్తాయి అని ఊహించుకుని అందాజుగా ఒక నిర్ణయానికి వచ్చి రాయకతప్పదు.

ఏడుపు ఆపాక, వెక్కిళ్ళు తగ్గాక,

“బ్రో, చివరిగా ఒక హెల్ప్” అన్నాడు సీనూ.

“చెప్పండి బ్రో” అంటూ శాంతించాడు మొగుడు.

“వాట్సప్లో నా అడ్రస్ పంపిస్తాను. నా సారిక చివరిగా కరోనాలో చనిపోయినప్పుడు వేసుకున్న డ్రస్… అది బ్రా, పేంటీ కుడా అయండచ్చు. దానిని నాకు పక్కాగా పేక్ చేసి పంపించండి బ్రో. నా సారికని చంపిన అదే కరోనా వైరస్ తోనే నేనూ చచ్చిపోవాలి బ్రో.”

***

మూలకథ: మయిర్ కూచ్చెఱిదల్

రచయిత గురించి:

పాండిచ్చేరిలో పుట్టిన ఆర్.శ్రీనివాసన్, తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చదువుకున్నారు. అరాత్తు అన్న పేరుతో 2010 నుండి సోషల్ మీడియాలలో నేటితరం జీవితానికి అద్దం పట్టే విషయాలను తీసుకుని ప్రయోగాత్మకమైన మైక్రో కథలు, కవితలు రాయడం ధ్వారా గుర్తింపు పొందారు. ప్రముఖ అరవ రచయితలు చారునివేదితా, జయమోహన్, మనుష్య పుత్రన్‌ల మెప్పుపొందారు. ఇప్పటివరకు మూడు నవలలు, మూడు కథల సంపుటాలు, ఒక బాలల కథల సంపుటి, వాహనాలకు సంబంధించిన వ్యాస సంపుటి, ఒక కవితా సంపుటి ప్రచురించారు. క్లుప్తంగా, సటైరికల్‌గా రాయడం ఈయన శైలీ. ఇతని కథలన్ని ఆధునిక యువత జీవితవిధానాల చుట్టూనే తిరుగుతాయి.

కుముదం, వికటన్ వంటి జనరంజక పత్రికలకూ ఇంటర్నెట్ మేగజిన్‌లకూ రాస్తుంటారు. సొంతంగా ఒక ఐటి కంపనీ నడుపుతున్నారు.

కొన్ని తమిళ సినిమాలకు కథా చర్చల్లో భాగస్వామ్యం వహించారు. తమిళ టీవీ చానళ్ళ చర్చా కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు.

కథా సంపుటాలు:

తఱ్కలై కుఱుంగదైగళ్ (ఆత్మహత్య మైక్రో కథలు)

సైనైడ్ కుఱుంగదైగళ్ (సైనైడ్ మైక్రో కథలు)

బ్రేకప్ కుఱుంగదైగళ్ (ఆత్మహత్య మైక్రో కథలు)

నవలలు:

ఉయిర్-మెయ్ (1 & 2) (ప్రాణం-తనువు)

పొండాట్టి (పెళ్ళాం)

బాలలసాహిత్యం:

కాట్టుప్పళ్ళి – అడవిపల్లె

ఆళి టైమ్స్ – సాగర్ టైమ్స్

*

 

అరాత్తు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచికథ. ఎప్పటిలా మీ అనువాదం హాయిగా ఉంది. .చాలా మందికి share చేసాను కూడా. థాంక్యూ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు