పొలంబడి

స్కేల్ తీసుకొని
పెన్నుతో నోట్సుల  నాలుగు పక్కల
లైన్లు కొట్టి,
హెడ్డింగులను అండర్ లైన్ చేసినట్టు
పొలంలో నాయిన
అంతే అందంగా వొరాలు చెక్కి,
బురద పెడతాడు.
….రోజు స్కూల్లో
మన హ్యాండ్ రైటింగులకు
గుడ్, వెరీ గుడ్ పడ్డట్టు
అడ్డదిడ్డంగా పెరిగిన చేనంత కలుపు తీసి,
సాల్లకు బాలు దువ్విన అమ్మకు
ఒక ప్రోత్సాహక బహుమతి ఉంటే బాగుండు.
పొలమే కాదు! బడి కూడా
ఒక వ్యవసాయక్షేత్రం
కొందరు నల్లింకుగా, కొందరు ఎర్రింకుగా
మరి కొందరు పచ్చింకుగా
ఎందరో జీవితాలను తీర్చిదిద్దుతుంది.
మట్టిలానే పాఠశాలలో
అక్షరాల వాసనేస్తది.
షార్ట్ బ్రేక్, లంచ్ బ్రేక్
లాంగ్ బ్రేక్ అని
కాలాన్ని విభజించినట్టే,
సేండ్లకాడ

పొద్దస్తమానం పనిచేసే రైతులకోసం

ఒక్క టైం టేబుల్ ఉంటే బాగుండు.
*

తలారి సతీష్ కుమార్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కవితలో తపన కనిపిస్తుంది. పాటశాలలో చదువు, పొలంలో వ్యవసాయం సమన్వత్వమ్ చాలా బాగుంది.

    , నవీ ముంబాయి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు