చోలీ కే పీఛె…..

      2001 నుంచి మూడేళ్ళు నేను ఢిల్లీలో పని చేశాను. అప్పట్లో కనాట్ సిర్కస్, పాలికా బజార్ ప్రాంతం లో రీగల్ సినెమా (పేరు అదేనా? లేక రాయల్ సినెమానా?) అని వొక హాలుండేది. అందులో నాకు గుర్తున్నంతవరకు యెక్కువగా సాఫ్ట్ పోర్న్ చిత్రాలు వచ్చేవి. అలా వొక శనివారం అటునుంచి వెళ్తూ వుంటే అందులో ఆడుతున్న చిత్రం “మదాం బవరి”. దర్శకుడు క్లాడ్ షాబ్రోల్. గుస్తావ్ ఫ్లాబేర్ నవల ఆధారంగా చాలా చిత్రాలు వచ్చాయి. హిందీలో కేతన్ మెహతా కూడా తీశాడు “మాయా మేంసాబ్” అని. అందులో ఎమ్మా పాత్ర దీపా సాహి చేసింది. సరే ఈ చిత్రానికి వస్తే క్లాడ్ షేబ్రోల్ చిత్రం కాబట్టి చూడటానికి వెళ్ళాను. జనం బాగానే వున్నారు. ఇంత మందికీ ఆ నవల మీద, ఆ దర్శకుడి మీద ఆసక్తేనా? కాదు. కథ కల్పించిన వీలును బట్టి అందులో వున్న “సీన్ల” కోసం వచ్చారు జనం. నవల చదివిన వారికి కథ తెలిసే వుంటుంది. ఎమ్మాను చార్ల్స్ బవరి మోహించి పెళ్ళి చేసుకోవటం, తర్వాత ఆమెను నిర్లక్ష్యం చేయటం. ఆ కారణంగా ఆమె వొంటరిగా గిలగిలలాడుతున్నప్పుడు ఆమె జీవితంలో వేర్వేరు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరుగా రావడం, ఆమె శరీరాన్ని తాకగలిగినా, ఆమె ఆత్మకు చేరువ కాలేకపోవటం, మోసాలు వగైరా. ఇక ఆ చిత్రం నాకు అసంతృప్తి కలిగించింది. బాలేదని కాదు, ప్రింటు బాలేదని. ఇప్పుడు ఇది వ్రాస్తూ వుంటే ఆలోచన వచ్చింది నెట్ లో వెతికి ఇప్పుడు మరలా చూడొచ్చు కదా అని.
     ఇది చూసి బయటికి వచ్చాక మిగతా ఆలోచనలతో పాటు వచ్చిన మరో ఆలోచన యేమిటంటే సినెమాలలో నగ్నత్వం లేదా అర్ధ నగ్నత్వం పట్ల మనం ఎలా స్పందిస్తున్నాము? వొకటి కుతూహల వశాత్తు, ఆ ఆకర్షణ కారణంగా చూసినా కూడా బాహాటంగా మెచ్చుకునే పరిస్థితి లేదు. మన దగ్గర ఈ ద్వంద్వ వైఖరి యెందుకున్నది? ఇది మనకు మొదటి నుంచీ లేదు. ఆంగ్లేయులు రాకపూర్వం నా ఉద్దేశం లో లేదు. మన పాత సాహిత్యాలు చూస్తే శృంగారం వున్నది. తర్వాత్తర్వాత వచ్చిన Victorian Morality మనం జీర్ణించుకోబట్టి వాటిని విమర్శిస్తున్నాము.
   ఇది ఒక ఎత్తైతే, ఇంకొకటి ఇలైట్ అని మనం చెప్పుకునే వర్గం కూడా భారతీయేతర చిత్రాలలో నగ్నత్వం వుంటే విమర్శించరు. కాని మన చిత్రాలలో వుంటే మాత్రం గగ్గోలు పెడతారు. ఇది రెండో రకం ద్వంద్వ వైఖరి. మన దగ్గర రాజ్ కపూర్ మొదటి నుంచీ మంచి చిత్రాలు తీస్తూ వస్తున్నాడు, మెచ్చుకోబడుతూ వున్నాడు. కానైతే అతని చిత్రాలలో క్షణం పాటు స్త్రీ పాత్ర వక్షాన్ని చిత్రీకరించినా గోల పెట్టేస్తారు. ఎందుకు? కేవలం నగ్నత్వం అంటే తప్పు, పాపం, కళ్ళు మూసుకోవాల్సిన విషయం అని మెదడు పనితీరులో సూపర్ ఇగో చాలా ఉత్సాహంగా ఉరకలేయబట్టి. అదే సమయంలో ఇడ్ మాత్రం ఓరకంట చూడాలని ఉవ్విళ్ళూరుతుంది. అతను చిత్రీకరించిన శృంగారం అందంగా చిత్రీకరించాడా లేక వెకిలిగా వుందా అని, సందర్భానికి నప్పిందా లేదా అనీ చర్చ వుండదు. రాజ్ కపూర్ మాత్రమేనా? మనోజ్ కుమార్ దాదాపు తన ప్రతి చిత్రంలోనూ భరత్ కుమార్ అనే పేరు పెట్టుకుని దేశభక్తుడుగా మన ముందుకొస్తాడు. నాయికను ముట్టుకోనన్నా ముట్టుకోడు. కాని ప్రతి చిత్రం లోనూ నాయికను ఎక్స్పోజ్ చేస్తాడు. దేశభక్తి కథనంలో ఇది మరుగున పడిపోతుంది.
   1980లలో నేను విజయవాడ నుంచి వచ్చే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివేవాడిని. ఆదివారం సంచికలో వొక పేజీ సినెమాల గురించి వుండేది. పి ఎస్ రావు అనే వొక పెద్దమనిషి సమీక్షలు వ్రాస్తూవుండేవారు. నాకు ఈ సినెమాల విషయంలో తొలి గురువు ఆయన. “రాం తేరీ గంగా మైలీ” చిత్రానికి సమీక్ష వ్రాస్తూ ఆయన మొదటి వాక్యమే ఇంచుమించుగా ఇలా వ్రాశారు: రాజకపూర్ చిత్రాలలో స్త్రీ వక్షాన్ని చూపించడం అనేది నారీకేళ పై పొరలాంటిది, లోపలంతా తియ్యని కొబ్బరీ, నీళ్ళూనూ. పైది చూసి లోపలున్నదాన్ని బేరీజువేయడంలో పొరపాటు జరగకూడదు. అప్పటి నా వయసుకి అది ఆశ్చర్యం కలిగించే విషయం. స్త్రీని అర్ధనగ్నంగా చూపడం తప్పే కదా లాంటి నమ్మకాలతో వున్నాను. సరే మూడు గంటల ఆయన చిత్రంలో ఇలాంటివి కొన్ని క్షణాల పాటే కదా, పట్టించుకోకుంటే సరి అనుకున్నాను.
   మళ్ళీ మదాం బవరి దగ్గరికొస్తే అది గుర్తొచ్చింది. నిజమే కదా. మనదగ్గర క్లాడ్ షేబ్రోల్ కి వొక నీతి, రాజ్ కపూర్ లాంటివాళ్ళకొక నీతి వున్నాయి.
   సినెమాలో నగ్నత్వం అనేది పెద్ద విషయమే. ఇది యెలాగూ మొదలు పెట్టాను కాబట్టి మరొక ఆసక్తికరమైన నా insight ని మీతో పంచుకుంటాను. వొక సారి నా మిత్రుడు మురళీకృష్ణ (నాతో కలిసి పనిచేశాడు) కలవడానికి వచ్చాడు. యేమిటి సంగతులు అని అడిగితే అప్పుడే చూసిన “బేండిట్ క్వీన్” గురించి చెప్పా. సీమా బిస్వాస్ నటన, శేఖర్ కపూర్ దర్శకత్వం చాలా బాగా వున్నాయి అని చెప్పా. ఆ సినెమాని మామూలుగా, యే ఉద్రేకానికీ లోను కాకుండా చూడటం కష్టమని నా అభిప్రాయం. ఫూలన్ దేవి జీవితంలో వొక కీలక ఘట్టం బందిపోట్లు ఆమెను అవమాన పరచడానికి పూర్తిగా వివస్త్ర చేసి వూరంతా తిప్పుతారు. చిత్రీకరణ లాంగ్ షాట్ లో వుంటుంది. కాని ఆమెకు ఎంత అవమానం కలిగి వుంటుందో అంతే అవమానం చూసేవాడికి కూడా కలుగుతుంది. ఆ పాత్రతో మమేకం చెందడం వల్ల. ఉద్రేకం, ఉద్వేగం కట్టలు తెంచుకుంటాయి. దీని గురించి చెబితే మురళి నవ్వాడు. యెందుకు ఆ నవ్వు అని అడిగా. నువ్వు చాలా అమాయకుడివి, ఆ సీన్ చూసిన వారిలో చాలా మంది ఎంజాయ్ చేసివుంటారు. నీలాగా చూసేవాళ్ళు తక్కువమందే వుంటారు అన్నాడు. కాసేపు నేను యేమీ మాట్లాడలేకపోయాను. నిజమే కదా అని తర్వాత అనిపించింది. అయితే ఇప్పుడు యేమిటి చెయ్యడం? సమాధానం నా దగ్గర కూడా లేదు. తెరమీద బలమైన కథ చెప్పాలనుకున్నప్పుడు ఇవన్నీ అవసరమవుతాయి. కాని ప్రేక్షకుడి పాత్ర కూడా వుంటుంది. ఆ పాత్రపై ఎవరికీ కంట్రోల్ వుండదు.
   ఇది పెద్ద సబ్జెక్ట్ అని చెప్పాను కదా, మిగతా ఆలోచనలు మరోసారి పంచుకుంటాను.
*
పరేశ్ దోశి

పరేశ్ దోశి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • పెద్ద subject పై, మీ విశ్లేషణ బాగరాశారు, సర్!👍👌!ధన్యవాదాలు, మీకు

 • chala Baga rasaru. oka samajam, daani Loni veru veru vargalu erparchukunna manasika parimitulu, taboos, morals manam chuse prati amshanni niyantristayi. Phoolan Devi ki jarigina avamananni andaroo oke rakangaa choodaru enta shekhar Kapoor long shot lo choopinchina – aite ram Teri ganga mail ki bandit queen ku teda undani Adi miulikmaindani meeroo oppukuntaranukuntaa

  • Thank you Swamy. I said that instead of discussing the aesthetics or otherwise we straight away shy away from nudity on screen. On other hand enjoy on sly. The purpose of showing nudity in said movies was different. I don’t find fault with either. Yes bandit queen didn’t titillate, but then some people find it so. 😢 That is why i dwelt on the issue of how an audience perceives.

  • కానీ స్వామీ ఆ సన్నివేశం చూపిస్తున్నప్పుడు నేపధ్య సంగీతంలో వినపడే విషాదం, గుండెల్ని పిండే సాకీ…. ఆ సన్నివేశంలో మనం నగ్నత్వం చూడం. కేవలం ఆమె అవమానాన్ని, అందులోని విషాదాన్ని మాత్రమే చూస్తాం. పూలన్ని రేప్ చేస్తున్న సన్నివేశం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అప్పుడు ఆమె ప్రియుడు రేపిస్టుని కాల్చి చంపటం చాలా ఊరటనిస్తుంది.

   • అది మనకి. కానీ వేరే విధంగా కూడా చూసేవాళ్ళు ఉంటారు అని నేను తెలుసుకున్నాను.
    అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఇప్పటికీ నడిరోడ్డులో ఆడవాళ్లను వివస్త్ర చేసి హింసిస్తుంటే వీడియోలు తీసి వాట్సాప్ లలో పంచుకుంటున్నారు. అది ఆమెకు double insult కాదా.
    పైకి ఒకలా లోపల మరోలా.

    నాకు ఆ చిత్రంలో రక్తం మరిగించేలానే అనిపించాయి. మిత్రుడు సూచించేదాకా మరోలా ఆలోచన కూడా రాలేదు.😢

 • బాండిట్ క్వీన్ ..సీన్.మామూలు మనిషికి, ఇంకొక మనిషికి గల తేడాను తెలుపుతుంది.

  ఈ వ్యాసంలో మనిషి ద్వంద్వ ప్రవృత్తిని గురించి మీ కోణం సరిగ్గా వుంది

  • Yes there were rape scenes. Apart from evokinh outrage, it does one more thing. A woman subjected to such assaults and insulted, humiliated by patading naked is likely to develop coldness towards sex. But later on she gets a lover and she is able to enjoy sex with him. These subtle issues are dealt with a deft hand. She is shown having sex with het lover in woman in top position. It indicates, she has moved on, taken control of her libido respectfully, and is a free soul now. If we see the scenes together, we can see her journey. In isolation, no.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు