గోడలకు అంటుకున్న
చీకటీ
కదులుతుంది
మాటల్లాగ.
మాయ మెట్లు
కదలనియ్యక
పాదాలనాపుతాయి.
కన్నుల నిండుగా
తీరని కోరికోలే
నీడనై
నీడలను
చూస్తూ,
ఒక మెరుపు నిండుతుంది
కన్నుల లోపల
లోలోపల.
తలుపు
తెరుచుకుంటుంది.
లోపలికి
వెళ్ళి
తలుపు దగ్గర
ఆపుతాను.
నేనుని.
*








Add comment