So, here we are …ఎక్కడ మొదలయ్యామో అక్కడే ఉన్నాం మనం. Back to square one. Back to that one question. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇది origins కు సంబంధించిన ప్రశ్నయేమో అని నీకు అనుమానం. ఈ రాత్రికి, ఈ పూటకి ఎక్కడకి వెళ్ళాలి ఎక్కడ ‘ఉండాలి’ అనే ప్రశ్న నేరుగా కాకపోయినా పరోక్షంగా అది origins కు లింక్ అయ్యి ఉన్నది అని నీకు అనిపిస్తుంది. ἀρχή or arche – ఎప్పటినుంచి ‘మొదలు’ అయ్యిందో తెలియని ఈ వెదుకులాటకీ దానికీ ఏమన్నా సంబంధం ఉందా? ఈ వెదుకులాటకి మొదలు … does it not speak of something lost? నీకు తెలియదు. ఏం కోల్పోయావు నువ్వు? నీకు తెలియదు. ఏం కోల్పోయావో నీకు కనుక తెలియకపోతే can you still call it as something lost? ఇది అంతా నామ్నీకరణ కు సంబంధించిన సమస్య అని కూడా అనిపించింది నీకు. ఇదంతా ontology కి రిలేటెడ్ – జ్ఞానానికి సంబంధించిన ఫ్రేంవర్క్ లో ఇమిడి ఉన్న ప్రశ్నగానూ తోచింది. (can there be anything beyond the framework of ‘knowledge?) మరింతగా ఆలోచించడానికి నీకు మనస్కరించలేదు ఎందుకంటే నీలో అలసట. drowsiness. ‘నేను అలసిపోయాను, అది స్పష్టం. దేనివల్ల అలసిపోయానో అది నాకు తెలియదు. తెలిసీ ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆ అలసట అలాగే ఉంటుంది’ అని Pessoa అంటున్నాడు నీలో. ‘Because, at certain stage, people have to be tired.’ అని కూడా అంటున్నాడు కానీ నీకు ఆ వాక్యం పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ముఖ్యంగా ఈ రాత్రికి, ఈ పూటకి …
Fernando Pessoa ని నువ్వు పోస్ట్ పీజీ డిప్లొమా లో ఉన్నప్పుడు కలిసావు. అతనిని కలసినప్పటి ఇంపాక్ట్ – ఇప్పటికీ నీకు గుర్తు. ఆ heteronyms … you still remember how the voices of those heteronyms echoed in the empty halls of your being … నీ గురించి రాస్తున్నట్టు అనిపించి నిన్ను రాస్తున్నట్టు అనిపించి నిన్నే రాసినట్టు అనిపించి సమయ కాలాల కు అతీతంగా ఎలా ఇద్దరు ఒకేలా ఉండవచ్చు అని నువ్వు ఆశ్చర్యపోయావు. అతను దాదాపు 70 heteronyms తనే అయిన 70 heteronyms ఒకదానికి మరొకటి పొంతన లేని తనే అయిన 70 heteronyms ‘సృష్టించాడని’ ఎక్కడో చదివి నువ్వు స్థాణువయ్యావు. ఒకే భౌతిక శరీరం – 70 ‘నేనులు’! ఒకే భౌతిక శరీరం అనేక నేనులు మరెన్నో అర నేనులు (semi – heteronyms)! Is it a medical condition? నువ్వు అనుకున్నావు. నీకు అప్పటికి తెలిసింది ఏదైతే ఉందో, knowledge ఉందో దాని పరిధిలో అతనిని place చేయడానికి కుదరలేదు. కానీ, నిజంగా అది ఒక మెడికల్ కండిషన్ నా? ట్రీట్ చేయదగ్గ condition నా? First of all, how it ‘became’ a condition that required treatment? Who and when at what point of time in history turned that into a problem, an issue that needs to be treated within an institution?
నిన్ను అపోలో హాస్పిటల్ కి నీ స్నేహితుడు తీసుకు వెళ్లడం గుర్తు. నీ తల్లి నీ మానసిక స్థితిని చూసి, నీ – cold – stone cold behaviourని చూసి ఆందోళనతో నీ స్నేహితుడితో నిన్ను ఎలాగయినా డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళమని ప్రాధేయ పడటం ఇప్పటికీ గుర్తు. ఎలా ఉండేవాడివి నువ్వు అప్పుడు? నువ్వు ఇప్పుడు గుర్తు తెచ్చుకోగలవా? నీ తల్లి నీలో ఏమి గమనించి అంతగా ఆందోళన చెందింది? పోస్ట్ పీజీ డిప్లొమా చేస్తున్నావు నువ్వు అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ లో. That is fine, super fine … కానీ what did she notice? what difference did she notice which you did not? నీకైతే ఎటువంటి మేజర్ మార్పూ అనిపించలేదు అప్పుడు. నువ్వేమి అనుకున్నావంటే ఎన్నో ఏళ్లుగా నువ్వు అలాగే ఉన్నావు, బహుశా ఆరో ఏడో తరగతి నుంచి కానీ ఇప్పుడు మాత్రమే నీ తల్లి నిన్ను గమనించింది అని. You were just the same all these years, it is only ‘now’ – when you are away from home and visit her once a month – that she noticed you. Noticed that you are different. Indifferent to everything indeed! ‘Close proximity makes one blind perhaps’ నువ్వు నీ నోట్బుక్ లో రాసుకున్నావు అపోలో నుంచి నీ గదికి వచ్చిన రాత్రి. ‘I am normal. It is this world and these people that are abnormal’ ఆ రాత్రి నువ్వు ఇది కూడా రాసుకుని అండర్లైన్ చేసుకున్నావు! ఆ మందులు వేసుకుని పది గంటలు పడుకున్న తరువాత కూడా నీకు అస్సలు నిద్ర లేనట్టు, ఫ్రెష్ నెస్ లేక drowsy గా అలసటగా నువ్వు పనికి వెళ్లడం అయోమయంగా hazy గా ఆ దినం గడవటం ఇప్పటికీ నీకు గుర్తు. ఏం మందులు అవి? డాక్టర్ ఇచ్చినవి? నువ్వు వేసుకున్నవీ?
ఆ రోజు ఉదయం నీ గదిలో నువ్వు లేవగానే క్షణకాలం నీకు నువ్వు ఎక్కడున్నావో తెలియలేదు. మంచం వెనుకగా ఉన్న కిటికీలోంచి ఉదయపు వెలుతురు కర్టెన్ తొలిగిన సన్నటి గ్యాప్ లోంచి పల్చగా లోపలకి పడుతుంది. నీ తలంతా దిమ్ముగా ఉంది. మత్తులాగా. రాత్రి నువ్వు తొమ్మిది కాక మునుపే పడుకున్నావు. ఏడవుతుంది ఇప్పుడు. దాదాపు పది గంటలు. అన్ని గంటలు పడుకున్నాక కూడా ఇంకా drowsy గా. కళ్ళు ఇంకా బరువుగా. Your mind refuses to think. దుప్పటి పక్కకి జరిపి దిండుని మంచం ఆనించిన గోడకు వేసుకుని కొద్దిగా లేచి కూర్చున్నావు. ఏవో పక్షులు అరిచే అరుపులు. బయటనా? నీ లోపలా? ఆ శబ్దాలు కూడా ఏవో మందపాటి తెరల్లోంచి వస్తున్నట్టు. 9 కల్లా కాలేజీ లో ఉండాలి. ఎనిమిదింటికి యూనివర్సిటీ కి దగ్గర్లో ఉన్న డైరీ ఫార్మ్ వద్ద డైరెక్ట్ బస్ మిస్ అయితే మళ్ళీ మూడు బస్సులు మారాలి అక్కడికి చేరడానికి. నువ్వు లేచి రెండు అడుగులు వేస్తే నీకు నువ్వే చాలా బరువుగా అనిపించావు. (as if a sponge soaked / being drowned’ నువ్వు అనుకున్నావు though you don’t like that word play) నీ మంచం కాళ్ళ వైపు ఉండే రైటింగ్ టేబుల్ ని ఆసరాగా పట్టుకుని క్షణం ఆగావు తలుపు తెరిచే ముందు. క్షణం దాటితే తలుపు తెరిచే వాడివే, తలుపు చివర్లలో పడి అది చితికి నుజ్జు నుజ్జు అయ్యేదే!
నువ్వు కుర్చీని వెనక్కి లాగి పక్కకు తిప్పి దానిలో కూర్చున్నావు. ఎలా వచ్చింది అది నీ గదిలోకి? That little frog? దాని వీపంతా బ్రౌనిష్ అండ్ గ్రీనిష్ టెక్షర్ – నీ చేతివేలిలో సగం పొడవూ బహుశా మూడు సెంటీమీటర్ల వెడల్పూ ఉంటుంది. ఎట్లా వచ్చింది అది లోపలికి? నీ గదికి ఎదురుగా పదిహేను అడుగుల ఆవలగా లాన్. almost squarish … నలువైపులా వరసకు పది గదులు ఉండే ఆ హాస్టల్ లో ప్రతి రెండు / మూడు రూమ్ లకు ముందు ఒక అశోకా చెట్టు. ఆ తరువాత లాన్. అయితే సరిగ్గా నీ గది ముందు ఒక అశోకా చెట్టుతో పాటు, కొంచెం అవలగా లాన్ లో ఒక పనస చెట్టు కూడా ఉండేది. నువ్వు నీ గది ముందు కూర్చుని చూస్తే (తరచూ సాయంత్రాలలో, చీకటి పడే వేళల్లో) ఎదురు గదుల వరసకు వెనుకగా దూరంగా ఏదో మహా వృక్షం (ఏమి చెట్టు అది?). చీకటి పడుతుండగా – కాంతివంతమైన ఆకాశం క్రమేణా డిమ్ గా మారుతో, సంధ్యాస్తమయపు నారింజ లోంచి బ్లుఇష్ బ్లాక్ లోకి పరావర్తనం చెందుతున్నప్పుడు, ఒకటే పక్షుల కలకలం. అలజడి. (బయటా లేక నీ లోపలా?). శీతాకాలంలో ఆ పచ్చని గడ్డి తడిచిపోయేది మంచుకి. విపరీతమైన చలి వేసేది. అంత చలిలోనూ గది ముందు కుర్చీలో కూర్చుని ఎదురు గా ఉన్న పిల్లర్ కి కాళ్ళు ఆనించి చూపు సాగేంత మేరా ఆ చీకట్లో ముద్దలు ముద్దలుగా కనిపించేవాటిని చూస్తూ కూర్చునే వాడివి నువ్వు. తలుపు తెరిచే ఉండేది. క్రితం రాత్రి ఆసుపత్రి నుంచి వచ్చాక స్నానం చేసి కూర్చుంటే నిన్ను ఆసుపత్రికి తీసుకు వెళ్లిన స్నేహితుడు రమ్ పట్టుకు వచ్చాడు (Old Monk). మీరిద్దరూ చాలా సేపు బయటనే కూర్చుని ఉన్నారు …talking … just talking … but is it just talking? Are you sure? కాదు. అతను ఏదో అడుగుతున్నాడు. Trying to dig out some information … ఎందుకు నువ్విలా అనాసక్తిగా, ఏ విషయం పట్లా ప్రతిస్పందన అనేది లేకుండా గడ్డ కట్టినట్టుగా తయారయ్యావో తెలుసుకునేందుకు … (to be more specific – not being able to react and respond the way people expect you to react and respond) … అతనికి నీ పట్ల పెద్ద ఆసక్తి ఏమీ లేదు. స్నేహితుడు అని నువ్వు పైన రాసావు కానీ అదీ కాదు. బహుశా అమ్మ చెప్పి ఉండవచ్చు అతనికి నీతో మాట్లాడి చూడమని. కారణాలు కనుక్కోమని. నువ్వు ఎందుకిలా ఉన్నావో ఎందుకు ఇలా అయ్యావో చూచాయగానైనా నువ్వు చెబితే అతని ద్వారా తను తెలుసుకుందామని. (తెలుసుకుని ఏం చేద్దామని? ఏం చేయగలదు తను కానీ మరొకరు కానీ?) బహుశా అప్పుడు, ఆ సమయంలో లోపలికి వచ్చి ఉండవచ్చు ఇది. పచ్చటి గడ్డిలోంచి చీకట్లోంచి నీ గదిలోకి. నీ చీకట్లలోకి. రాత్రి పడుకునే ముందు, టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నావు నువ్వు కానీ తలుపు గడియ వేసావో లేదో కూడా జ్ఞాపకం లేదు. గుర్తుకు ఉన్నదల్లా దుస్తులన్నీ విప్పి శిల్పంలా నువ్వు చాలాసేపు నీ గదిలో నిలబడి ఉండటం. ఆ తరువాత నీకు ఏమీ గుర్తుకు లేదు ….
ఇప్పుడు నీకు ఆ గది గుర్తుకు వస్తుంది, పడుకునేందుకు ఇంత చోటు కోసం నువ్వు తిరుగుతున్నప్పుడు! A కి కాల్ చేసావు. అతను ఒక్కడే ఉంటాడు. బాచిలర్. రాత్రుళ్ళు లేట్ గా పడుకుంటాడని నీకు తెలుసు. రాత్రుళ్ళు లేట్ గా పడుకోవడం అతనికి అలవాటు అని కాదు కానీ అతని పని చేసే దినపత్రికలో తరచూ అతనికి ఈవెనింగ్ షిఫ్ట్స్ వేస్తారు కాబట్టి. ఆతనికే తరచుగా ఎందుకంటే అతను కొంత మెతక కాబట్టి. అతను no అని చెప్పలేడు కాబట్టి. ఆ రాత్రి నీకు అతని పేరు తప్ప మరొకరి పేరు తట్టలేదు కాబట్టి. ఆ రాత్రి నీకు మరో దారి లేదు కాబట్టి. నువ్వు అలసిపోయి ఉన్నావు కాబట్టి. అన్నిటికంటే ముఖ్యంగా నీకు నీ శరీరం ఏమాత్రం సహకరించక, లోపల ఏదో చెక్కులు చెక్కులుగా త్రవ్వుకుపోతున్నట్టు అనిపించింది కాబట్టి. ‘ఇప్పుడే వచ్చాను ఆఫీసు నుంచి’ నీకు అతను ఫోన్ లో చెబుతాడు ‘రెండు పెగ్గులు బ్రాందీ మాత్రమే ఉంది. సరిపోదు. వీలైతే నువ్వు వచ్చేటప్పుడు ఎక్కడైనా పట్టుకు రా. సిగెరెట్స్ కూడా పెద్దగా లేవు’ … So, here we are … తిరిగి ఈ రోడ్లపై. కళ్ళల్లో కోసుపోతున్న గాలితో here we are … just like that frog stuck in that room, … stuck in a place that is not its own … out of its place and knowing not where to go …
***
‘Rooms are like people, they have an identity of their own. వాటికి మాత్రమే ఉండే ఒక పర్టికులర్ రంగు రుచీ వాసనా, వెలుతురూ నీడలూ వాటి శరీరాల్లో. నిజానికి గదులు … they are just like us …. they are born, grow, have their share of joys and sorrows, loves and separations, eventually get old and die. Every room tells us a story. Every room beams its autobiography. Its otobiography. Its thanatography … only if you know to how to see … how to read … You can find the architecture of selves – in those rooms. The secrets of the soul as they say … they scream out loud to be heard … paradox, isn’t it?
secrets screaming out aloud to be heard …
‘they scream – in the wind / in the rain / in days of hunger / in the days of lust / at those odd hours / when one feels / a strong inner urge to mutilate oneself / or rather kill oneself / out of pain / out in the rain / in the wind / at night / where a dab of your scent / your memory / turns to a hanging rope / and it carries the perfume of your body / of a room with book shelves / of endless books / untranslated … / of rain / of pain …/ when one feels / wind in the rain …’
ఆ రాత్రి గురించి నువ్వు రాసుకుంటున్నప్పుడు నీకు ఇది నీ పాత డైరీలో దొరికింది. నువ్వు నవ్వుకున్నావు. చైల్డిష్ అని కూడా నువ్వు అనుకున్నావు కానీ అప్పటి ఆ వాక్యాలలో ఉన్నది ఏదో ఇంకా ఇప్పటికీ నిన్ను వీడలేదు. నువ్వు తరచూ గదులని శరీరాలతో పోల్చేవాడివి. గదులకు ఉన్నట్టే మనుషులకి అరలు ఉన్నట్టు అవి నీకు అర్థం అయ్యీ కాని అనేక భాషల పుస్తకాలతో నిండి ఉన్నట్టూ అనువాదం కాని అపరిచిత లిపిలో మనుషులు నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తారనీ అనువదింపబడీ అర్థం కాకుండా మిగిలి పోతారనీ ఇట్లాగా ఏవో notes … తరచూ అవి ఇంగ్లీష్ లో ఉండేవి. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు (వెనక్కు తిరిగి అప్పటి స్థల కాలాల అదే, ఆవే అర్థాలతో వాటిని తిరిగి చూసుకోవడం సాధ్యం కాదని నీకు తెలుసు, అయినప్పటికీ …) ఆ పాలిపోయిన కాగితాలలో ఒక రకమైన madness … ఆ భాష … what were you trying to convey? What were you at least trying to say and to whom? Anyway, పెళుసుగా మారిన ఆ కాగితాలలో ఏదో fragmented whole – నీలో నువ్వు గింజుకుంటున్నావు. చాలా. దేనినుంచో విడుదల అయ్యేందుకు. నీలో నువ్వు గింజుకుని విలవిల లాడుతున్నావు. shrinking సెల్ అని మునుపటి అధ్యాయంలో నువ్వు రాసావు కానీ నిజానికి అది కాదు. కాలం గడుస్తున్న కొద్దీ నిన్ను చుట్టుకున్న రూపం లేని దిగులూ వేదన ఏదో … మరింతగా నిన్ను బిగించి నీకు ఊపిరాడనివ్వకుండా చేసి క్రష్ చేసేది ఏదో … ఆ అనిశ్చితి … ఆ తపన … ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది … మరెక్కడో … ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లలేక, అదెక్కడో మరి అది ఏమిటో తెలియక నీలో గింజులాట. ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్లలేక నిస్సహాయత. ఆ నిస్సహాయతలోంచి హింస. Wounds … పండ్ల కత్తిని తీసుకుని నీ శరీరం నీది కాదన్నట్టుగా నువ్వు నెమ్మదిగా ఒక రాత్రి నీ ఛాతిపై ఏడు చోట్ల పొడవుగా కోసుకుని ఎటువంటి భావం లేకుండా ఆ కోతలని చూసుకున్నట్టు. ఎలా అంటే ప్రతి కోతా నీ ‘జీవిత’ పుస్తకంలోని ఒక అధ్యాయం అన్నట్టుగా … ఎలా అంటే ప్రతి నెత్తురు బొట్టూ ఆ అధ్యాయాల సారాంశంలాగ. A summary … అది సరే కానీ, నీకు గదులు అంటే ఎందుకు అంత అబ్సెషన్?
***
పైన నువ్వు అడిగావు ‘గదులు అంటే ఎందుకు నీకు అంత అబ్సెషన్?’ అని. ఎవరిని అడిగావు ఆ ప్రశ్న నువ్వు? నీకు నువ్వే నీలో అనుకున్నావా? లేక ఆ ప్రశ్న మరెవరినైనా ఉద్దేశించి – నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నట్టుగా – అన్నావా? Isn’t it communication itself like that? Addressing oneself on pretence of talking to the Other? Or addressing Other, on the pretence of talking to oneself? Isn’t that you address the Other in yourself first? ఒకవేళ ఇది ఒక సంబోధన (addressing) అయితే, దాని స్వభావం ఏమై ఉంటుంది? దాని చిరునామా ఏమై ఉంటుంది? చిరునామా ఉంటే, అది అక్కడికి చేరుకుంటుందా? What is the nature of that addressing? What is its address? Will it reach ‘home’, an address that it is intended for? నువ్వో ఉత్తరం వ్రాస్తావు. దానిపైన చిరునామా. చేరుతుందో లేదో నీకు తెలియదు. చేరుతుందని నువ్వు ఆశిస్తావు కానీ చేరుతుందో లేదో చేరినా అది నువ్వు ఉద్దేశించిన వాళ్ళ చేతుల్లో పడుతుందో లేదో లేక ఒకవేళ పడినా అది నువ్వు ఉద్దేశించిన అర్థాలతో అర్థం అవుతుందో లేదో … ఎటువంటి హామీపత్రం లేదు దానికి. అనేక సాధ్యాసాధ్యాలు. నువ్వు చెప్పలేవు ఏది వాస్తవంలో వాస్తవంగా రూపు దిద్దుకుంటుందో! నువ్వు రాసిన ఉత్తరం నువ్వు నిర్ధేశించిన చిరునామాకి కి చేరి, నువ్వు రాసిన వాళ్ళు కాక మరొకరు దానిని చదివి వేరొక అర్థం తీసుకుంటే అది తన గమ్యాన్ని చేరుకున్నట్టా కాదా? నీకు తెలియదు. నువ్వు ఒక ఉత్తరం రాసి చిరునామాని mention చేసి పోస్ట్ చేస్తావు. తరువాత ఏం జరుగుతుందో, తన ‘గమ్యాన్ని’ అది చేరుతుందో లేదో, ఒకవేళ చేరితే చదివిన వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారో నీకు అనవసరం. నువ్వు నీలోని మరొకరికి ఇంకొకరిని ఉద్ధేశించి ఇది వ్రాస్తావు, ముఖ్యంగా గదుల గురించి! అలా అని అన్ని గదులు కాదు … ఆ ఒక్క గది గురించి రాసి వదిలి వేస్తావు. ఈత రాని నువ్వు రాత్రి నదిలోకి – అడుగులో అడుగు వేస్తూ – జారవిడుచుకున్నట్టు. ఇదంతా సరే కానీ, గదులు అంటే, ముఖ్యంగా ఆ గది అంటే, ఎందుకు నీకు అంత అబ్సెషన్?
***
నీకు వచ్చిన విచిత్రమైన కల ఒకటి నిన్ను తరచూ వెంటాడేది. నిజానికి దానిని ఆధారం చేసుకుని నువ్వొక నోవెల్ల వంటిది వ్రాద్దామని అనుకున్నావు. (ఎందుకు రాయలేదో నీకు తెలియదు). నువ్వొక లిటరరీ మీటింగ్ లో ఒక అపరిచితుడిని కలిసావు. ఇద్దరి మధ్యా మొదలయ్యిన చాలా కాజువల్ టాక్ ( సాహిత్యం మీదా ముఖ్యంగా నువ్వు అప్పట్లో వ్రాసే వాటి మీదా) క్రమేణా సీరియస్ గా మారి అతను అంటే నీకు మరింత కుతూహలం కలిగేలా చేసాయి. కలలో అతను చెప్పిన పేరు ఇప్పుడు నీకు గుర్తుకు లేదు. ఆ పరిచయం లో నీతో అతను అనేక పుస్తకాల గురించి – నువ్వు ఎన్నడూ వినని – వాటిలోని స్టోరీలైన్ గురించీ మాట్లాడాడు. నీకు పజ్ల్లింగ్ గా అనిపించింది. ప్రపంచ సాహిత్యం బాగా చదువుకున్నా అనుకునే నీకు ఎన్నడూ ఆ పుస్తకాల పేర్లు కూడా విని ఉండకపోవడం కొంచెం అవమానంగా కూడా తోచింది. ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో నువ్వు అతనిని మొదటి పరిచయంలో అడగగా అతను సమాధానం దాట వేసినట్టు గుర్తు. ఆ తరువాత నీకు అతను కలిసిన అనేక సందర్భాలలో అతను ఆ పుస్తకాలని తనకు ఒక అమ్మాయి పరిచయం చేసిందనీ, ఆ పుస్తకాలు తన లైబ్రరీ లో ఉన్నాయనీ చెప్పాడు. అతను చెప్పే ఆ పుస్తకాల కథలూ పోయెమ్స్ వాటి థీమ్స్ చూసి నువ్వు దిగ్భ్రాంతి చెంది పలుమార్లు ఆ లైబ్రరీ కి నిన్ను తీసువెళ్లమని బ్రతిమిలాడగా ఎంతో ప్రయత్నం తర్వాత అతని దానికి ఒప్పుకుని, నువ్వు ఎవరితోనూ చెప్పవని మాట తీసుకుని నిన్ను ఒక రోజు రాత్రి ఒక ప్రదేశానికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు అక్కడికి వెడితే అదొక శ్మశాన వాటిక. ఆందోళనతో ఉన్న నిన్ను అతను స్వాగతించి, ఒక సమాధి తెరిచి (తలుపు ఉన్నాయి దానికి!) లోపలి తీసుకు వెడితే అక్కడ అనేక లాంతరుల వెలుగులో లెక్కించలేనన్ని పుస్తకాల అరలూ, పుస్తకాలు. A Cemetery of Books, ఈ టైటిల్ తో ఏదైనా పుస్తకం ఉందా అని నువ్వు నవ్వావు అతను నీకు ఆ అమ్మాయిని పరిచయం చేస్తుండగా. She is stunningly beautiful. ముగ్గురూ కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు అతను ఆ అమ్మాయికి నీ రైటింగ్స్ గురించి చెబుతూ నవ్వాడు పెద్దగా. ఎందుకు నవ్వాడో నీకు ఇప్పుడు గుర్తుకు లేదు. బహుశా, he was making fun of your writings … ఏమో కానీ అతను నీ రాతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె తల ఊపుతూ ‘నాకు తెలుసు. అతను వ్రాయక ముందే నేను వాటిని చదివిఉన్నాను’ అని తను చెప్పడం మాత్రం గుర్తు. ఆ తరువాత – ఆ అరల్లోని అనేకానేక పుస్తకాలని అబ్బురంతో చూస్తున్న నీకు Please go ahead and have a look at those books. We will be back very soon’ అని చెబితే ఆ పుస్తకాల టైటిల్స్ లో మునిగిపోయిన నువ్వు తల ఊపావు కానీ అట్లా చూస్తూ చూస్తూ ఎంత సమయం గడిచిపోయిందో నువ్వు గమనించనే లేదు. ఎప్పటికో తేరుకుని చూస్తే అక్కడ ఎవరూ లేరు. లాంతరుల కాంతి నెమ్మదిగా మందగిస్తుంది.అనేక గదులున్న ఆ లైబ్రరి లో – one room opens to another room, endless rooms – ఒక గది నుంచి మరొక గదిలోకి తిరిగి ఎక్కడి నుంచి మొదలయ్యావో తెలియక తలుపు ఎక్కడ ఉందో అర్థం కాక భీతితో కంగారుతో గది నుంచి గదికి పరిగెడుతూ అతని పేరుని పెద్దగా అరుస్తూ పిలుస్తూ తిరుగుతున్నావు కానీ లోపలికి వచ్చిన ఆ మొదటి గది కనిపించనే లేదు. నీ అరుపులు ప్రతిధ్వనించి నీకే పెద్దగా వినిపిస్తున్నాయి. లాంతరుల కాంతి తగ్గిపోతుంది. చుట్టూ చీకటి కమ్ముకుంటుంది. ఆ పుస్తకాలన్నీ ముద్దలు ముద్దలుగా కరిగి నల్లగా కారి నేలపై చేరి మట్టం పెరిగి క్రమేణా నీ పాదాల నుంచి మొదలయ్యి మోకాళ్ళను దాటి ఛాతికి చేరి గొంతుని అందుకుని పైకి పైపైకి నీ నాసికా రంధ్రాలలోంచీ నీ నోట్లోకీ నిండి నువ్విక రక్షించమని అరవలేక రెండు చేతులు పైకెత్తి కొట్టుకులాడుతుంటే నీకు మెలుకువ వచ్చింది: ఒళ్ళంతా చమటలు పట్టి, గుండె పెద్దగా కొట్టుకుంటూ. You were shivering. చాలాసేపు నువ్వు నార్మల్ కాలేక పోయావు. ఆ కలకి అర్థం ఏమిటో నీకు అర్థం కాలేదు. ఆ రాత్రంతా నిద్ర పోలేదు మరిక నువ్వు. ఇప్పడు A గదిలోకి అడుగుపెడుతుంటే ఆ గదిలోని మాగిన వాసన ఏదో నీకు నేలమాళిగ లోని ఆ గ్రంథాలయాన్ని జ్ఞప్తికి తెస్తుంది. దానిలో కూడా ఇటువంటి వాసనే. నానిన పుస్తకాల నాని ఎండిన కాగితాల వాసన. Some very undefined smell of books or rooms filled with old books penetrates the core of your being … బహుశా Pessoa ఇటువంటి పుస్తకాల నిండిన ఒక గదిలోనే గంటల కొద్దీ రాసుకుని ఉంటాడు – ఆ అనేక ‘నేనులు ‘ ఒకచోట గుమికూడి, అర్గ్యూ చేసుకుని, అరిచీ కొట్టుకునీ మాట్లాడుకునీ. ఆ శరీరం అంతమందిని తీసుకోలేక ఆ గదిలోనే క్రమేణా తారువంటి ఆలోచనలలో మునిగిపోయి చచ్చిపోయి ఉండవచ్చు. We will never know అది ‘సహజ’ మరణమా లేక ఆత్మహత్యనా అన్నది. ఎవరు ఎట్లా చచ్చిపోతారో ఎవరికీ తెలుసు? గొప్ప పెయింటర్ అవుదామని మొదలయ్యి ఎంతో passionate గా పెయింటింగ్ లైఫ్ ని ప్రారంభించి చివరికి చికెన్ షాప్ లకి కోడి బొమ్మలూ ఆ షాప్ పేర్ల హోర్డింగ్స్ వేసే దగ్గర అంతం అయ్యి – day in and day out … day to day living లో shatter అయ్యి, ఇంట్లో వేధించే భార్యని భరించలేక, చవకైన రంగులతో పెయింటింగ్స్ వంటివి ఏవో వేసిన బార్ లోనే తాగి తాగి మునిగి చివరికి ఎక్కడో చచ్చిపోయి … ఎవరు ఎక్కడ చచ్చిపోతారో ఎవరికీ తెలుసు?
***
మొన్న ఈ కవిత రాసాను అని A నీకు ఒక కాగితాన్ని ఇస్తాడు. నువ్వు అతనికి తెచ్చినవి ఇచ్చి దుస్తులు చిందర వందరగా పడవేసి ఉన్న ఒకే ఒక కుర్చీలో కూర్చుందామని అనుకుని మనస్సు మార్చుకుని కింద నేలపై ఒక లుంగీ బనియానూ ఏవో పుస్తకాలు చెల్లా చెదురుగా పడి ఉన్న చివికిపోయిన పత్తి పరుపు పైనుంచి వాటిని ఒక పక్క జరిపి గోడకు ఆనుకుని కూర్చుంటావు. ఎలా ఉన్నావు అతను అడుగుతాడు తెచ్చినవి తీసి రెండు గ్లాసుల్లో డ్రింక్ పోస్తూ (ఆ గ్లాసులు కడిగి ఎన్నాళ్ళు అయ్యిందో నీకు తెలియదు). మరో మూలగా ఉన్న కుండలోంచి చెంబులో నీళ్లు తెచ్చి అతనూ నీ పక్కగా కూర్చుంటూ ఏమిటి విశేషాలు అంటాడు. మునుపటి కంటే అతను సన్నబడ్డాడు. అంత ఆరోగ్యంగా కనిపించడం లేదు. సరైన నిద్ర లేకనా? లేక తిండి లేకనా? or is it lack of sex? లేక అవి అన్నీనా? దాదాపు ఆరు అడుగుల అతని శరీరం చాలా సన్నబడి మూడు గుండీలు తొలగిన గళ్ళ చొక్కాలోంచి ఎముకల పోగులాగా కనపడుతోంది. అతను గ్లాసు తీసుకుని చదువుతున్న పుస్తకాన్ని బోర్లించి గోడకు ఆనుకుని అడుగుతాడు నిన్ను. ఎలా ఉన్నావు. ఏం రాస్తున్నావు. పోయెమ్ ఎట్లా ఉంది అని. డిప్రెస్సివ్ టోన్ ఉన్న కవిత అది. మృత్యువు అనే పదం పలు మార్లు వచ్చింది ఆ కవితలో. చివరికి కాంతిని కూడా మృత్యువుతో లింక్ చేసిన పోయెమ్ అది ‘మృత్యు శీతల కాంతి’ అంటూ. అదే టోన్. మరొకరిని అడుగుతున్నట్టు తనని తాను అడ్రెస్ చేసుకునే టోన్. ‘ఉన్నావా / నువ్వు ఉన్నావా ఇక్కడ / నీకు ప్రియమైన వాళ్ళ నిరాదరణలో / నీకు జన్మనివ్వని / నీకు పాలు తాపని / చివరి దాకా ఎదురు చూసీ చూసీ / చివరి చూపు మిగలని / అనేక తల్లులుగా చీలిపోయిన / ఒక తల్లి విషాదంలో / కంటి చివర నిలిచి / కన్నుని వీడలేని / తల్లి పాల వంటి కన్నీటి చుక్కలో / ఉన్నావా / నువ్వు ఉన్నావా / ఆ మృత్యు శీతల కాంతిలో / నీడలో’ అని అడిగి మిగిలినదల్లా ‘నీ కోసమే నువ్వు నిర్మించుకున్న ఒక కబేళా /’ అని చెప్పి ‘నీకు నువ్వే ఒక తలారివీ / ఆ ఉరితాడువీ’ అని కూడా అంటున్నాడు –
అటువంటి imagery నీకు puzzling అనిపించేది. అసౌకర్యంగా. ఎందుకో విడమర్చి చెప్పమంటే నువ్వు వివరణ ఇవ్వలేవు. How one feels, how one translates those feelings into which language, the nature of such translation and images … నువ్వు చెప్పలేవు. చలిగా ఉంది గదిలో. అదే సమయంలో ఉక్కగా కూడా అనిపిస్తుంది నీకు. పైన పంకా చిన్నగా తిరుగుతుంది. ఆగీ ఆగీ దాని చప్పుడు, గిర్ గిర్ మని. ఆ చిన్న గదికి ఒకటే కిటికీ. మూసి ఉంది అది. ఏం చదివావు నువ్వు ఈ మధ్య అని A అడుగుతాడు మధ్యలో నిన్ను కానీ నువ్వు సమాధానం చెప్పవు. నువ్వు అక్కడ లేవు. ఎక్కడ ‘ఉన్నావో’ ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నావో నీకు అలవాటైన digging ఎనాలిసిస్ తో కనుక్కునే ఓపిక లేదు ఇప్పుడు. లోపల ఏదో discomfort. ఎందుకు నువ్వు అందరిలా ఉండలేవు? ఎందుకు ఈ తపన? ఈ వెదుకులాట? ఈ అస్థిమిత state of being? This feeling of out of place? ఇదేనా కారణం నువ్వు ఎవరితోనూ ఉండలేకపోడానికి? ఎవరినీ నీ లోపలికి రానివ్వకపోడానికి? ఎంత దగ్గరగా వచ్చిన వాళ్ళనైనా నువ్వు నీ లోపలి సరిహద్దులకు ఆవలాగా పెట్టడానికి? వాళ్ళ గాయాలని ఏవో నువ్వు తీసుకుని తిరిగి నీదైన దిగులునేదో వాళ్లకు ఇవ్వడానికి? ఒక పాటర్న్ ఏదో emerge అవుతుందా నీ జీవితపు సంఘటనలలో? Are you living in loops? Living the same narrative with minor deviations again and again? చలిగా ఉంది గదిలో అదే సమయంలో ఉక్కగా. లేచి వెళ్లి కిటికీ తలుపు తెరుస్తావు. ఒంటి గంట గాలి నీ ముఖాన్ని తాకుతుంది. అర్థరాత్రి వాసన. ఒక peculiar smell. నీకు పరిచితమైన స్మెల్. వేరే గది. వేరే రాత్రి. కానీ అదే వాసన. క్షణకాలం లో నువ్వు తిరిగి ఆ రాత్రిలోకీ ఆ సమయాలలోకీ వెళ్ళిపోయినట్టు. అదే రాత్రిలో అదే గదిలో నుల్చుని ఉన్నట్టు. You were stoned that day. బకార్డి తాగుతున్నావు నువ్వు ఆ రోజు. ఆ రోజు నుంచి మధ్యాహ్నం నుంచి. ఇటువంటి చలికాలమే అది. గాలి వీచినప్పుడల్లా రాలే చిన్ని చిన్ని పసుపు ఆకులు నీ కాళ్ళ ముందు. నేలపై రాలి, గాలి వీచినప్పుడల్లా అవి లీలగా దొర్లి ఆ మధ్యాహ్నపు కాంతిలో మెరుస్తో. వాటి పక్కగా కదిలే కొమ్మల నీడలు … strange … so strange … నువ్వు వాటిని స్పష్టంగా చూడగలుగుతున్నావు. వినగలుగుతున్నావు కానీ అక్కడ అప్పుడు నీ ఎదురుగా ఏ చెట్టూ లేదు. చెట్టు లేక రాలే ఆకులు! చెట్టు లేకనే వినిపించే ఆకులు రాలు శబ్దాలు! చెట్టులేని ఆ కొమ్మల నీడలు … నువ్వు చూసేవీ వినేవీ … అవి నీలో ఉన్నాయా లేక బయట ఉన్నాయా? By the way, why were you stoned that day? Whether you have a cold heart, stone cold heart or not … గదులు అంటే ముఖ్యంగా ఆ గది అంతే ఎందుకు నీకు అంత అబ్సెషన్?
***
నీకు ఎందుకు ప్రతీదానికి కారణాలు కావాలి? నీకు ఎదురుగా ఒళ్ళో చేతులు పెట్టుకుని ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఉన్న తనని నువ్వు అడుగుతావు. తను వెంటనే ఏమీ బదులు ఇవ్వదు నీకు. అటు పూర్తిగా గుండ్రమూ ఇటు పూర్తిగా ఓవల్ కాని ముఖం. అది ఏ నెల నో నీకు గుర్తుకు లేదు. గుర్తు ఉన్నా నువ్వు ఆ మెమరీ ని నమ్మలేవు. Memory is manipulative అని నువ్వు రాసుకున్నావు ఎప్పుడో. You are just a memory, nothing else అని కూడా. సాయంత్రం అయిదున్నర అవుతుంది. చలికాలం. (ఇటువంటి చలికాలమేనా అది? మృత్యు శీతల రాత్రి అని A రాసి ఉండవలసింది). వెలుతురు మందగిస్తున్న ఆకాశం. ఆ కాంతిలో తన ముఖంలో కళ్ళల్లో పెయిన్. (‘ఉండ చేసి విసిరి కొట్టిన కాగితం’ అని తరువాత ఎన్నడో ఒక metaphor రాసావు నువ్వు, నొప్పితో చిన్నబోయిన ఆ ముఖం గురించి. It is very difficult for me తాను చెబుతుంది నీకు. ‘చాలా బాధగా ఉంది. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. I feel very lonely these days. నువ్వు మునుపటిలా ఉండటం లేదు. నువ్వు నన్ను avoid అవాయిడ్ చేస్తున్నావు. ఎందుకో చెప్పు. నాదేమైనా తప్పు ఉందా?’ అని తను అడుగుతుంది నిన్ను. నువ్వు నిర్వికారంగా కూర్చున్నావు. నువ్వు ఎలా విడమర్చి చెప్పగలవు? ఎవరికైనా? నీకే స్పష్టత లేని దాని గురించి? దిన దినం లోపల ఏదో చిక్కబడి మంచుముక్కలా మారుతున్న నీ బీయింగ్ గురించి? ఆ స్థబ్ధత గురించి? ఎలా చెప్పగలవు నువ్వు భాష దొరకని దాని గురించి? ‘ఇదేమీ నీ తప్పు కాదు. ఏదో అవుతుంది నాకు. ‘నేను’ లేకుండా పోతున్నాను. ఏదీ టచ్ చేయడం లేదు. ఇందులో నీ పాత్ర ఏమీ లేదు. ఇదంతా నా వల్లనే. నేనే ఎక్కడా ఎవరితోనూ ఉండలేకపోతున్నాను. పారిపోతున్నాను. నిజంగా నేనిలా ఉండటంలో నీ ప్రమేయం ఏమీ లేదు. Inadvertently I may be hurting you … మునుపటిలా లేకుండా’ అని నువ్వు చెబుదామని అనుకున్నావు. చెప్పావా? తెలియదు. తెలియదా? లేక గుర్తు లేదా? Memory is not only manipulative but selective … ఈ వాక్యం నువ్వు ఎక్కడైనా రాసుకున్నావా? నీకు గుర్తుకు లేదు. ఆ కాలపు గుర్తుల్లాగా మిగిలి ఉన్న రెండు డైరీలలో ఎక్కడా ఈ వాక్యం నీకు తట్టలేదు.
చీకటి పడుతుంది. కాంటీన్ పైన ఉన్న ఒకే ఒక బల్బ్ డిమ్ గా వెలుగుతుంది. చల్లగా పల్చటి గాలి. దూరంగా చిన్నగా చెట్లు ఊగుతున్నాయి. వాటిలోంచి ఆగకుండా పక్షుల అరుపులు. కింద నుంచి ఎవరివో మాటలు. నీకు పైగా కొంగల గుంపు ఒకటి ఆకాశంలో సాగిపోతుంది. నువ్వు తల దించుకుని కూర్చుంటే చాలా సేపటి తర్వాత ఆమె నీ చేతిని పట్టుకుని అడుగుతుంది ‘ఉండలేవా నాతో’ అని. ఆ చేయి ఎంతో చల్లగా ఉంది. ఆ క్షణంలో నువ్వు అక్కడ తన సమక్షంలోనూ మరెక్కడో ఒక సరస్సులో నీట మునిగి ఏకకాలంలో ఉన్నావు. రెండు స్థల కాలాలలో ఒకేసారి … దాదాపు చనిపోయావు నువ్వు ఆ సరస్సున మునిగి. నీట మునిగిన క్షణం you were stunned by the beauty under the water. నీటి కింది లోకాలు నువ్వు అప్పుడు అనుకున్నావు. అప్పటికి నీకు ఇంకా ఊపిరి అందకపోవడం తెలియలేదు. For a moment that world under the cold water enchanted you. సమ్మోహితుడివై ఊపిరి పీల్చడం మరచి నువ్వు ఆ నీళ్ళల్లో. ఆ నీళ్ల రంగుల్లో. ఏ చేయీ లేక లోపలికి జారిపోతూ తెరిచిన కళ్ళల్లోకి ఆ నీళ్ల మహా సౌందర్యం. వివశితుడివి అయ్యావు ఆ కొన్ని క్షణాలు. చాలా భద్రతగా కూడా అనిపించింది నీకు ఆ కొన్ని క్షణాలు … చల్లగా … ఆ నీళ్ళకీ ఇప్పుడు తను పుచ్చుకున్న చేయిదీ ఒకే చల్లదనం … తేలికైన, చల్లనైన తన చేయి బరువు నీ జీవితం కంటే ఎక్కువగా తోచింది ఆ క్షణాన. బ్రతికి ఉన్న చల్లదనం కాదు అది. అలా అని మృతశరీరపు చల్లదనమూ కాదు. రెండిటికీ మధ్య సరిహద్దు సీమలో – in the space between living and the dead – half dead and half living లాంటి చల్లదనం! తన చేయి చల్లగా ఉన్నదా లేక నిన్ను తాకి ఆ చేయి ఆ శరీరం అలా చల్లగా మారిందా? ‘Your hand full of hours, you came to me – and I said: Your hair is not brown. / So you lifted it lightly on to the scales of grief; / it weighed more than I…’*
ఒళ్ళో చేతులు పెట్టుకుని కూర్చున్న శిల్పం ఒకటి నీలో మెదులుతుంది. తన ఎత్తూ ఒడ్డూ వెడల్పూ తన వంకీల శిరోజాల ముఖమూ ఉన్న ఒక మంచు శిల్పం! ఓరగా లేపిన ముఖంలో exact features … అవే కనుబొమ్మలు, అదే కొనదేరిన ముక్కు, ఆవే చిన్న పెదాలు. కళ్ళ కిందుగా కొద్దిగా పైకి ఉబ్బి అక్కడ నుంచి slopes లాగా కిందకి చెంపలు … అంతా అచ్చు గుద్దినట్లుగా అవే పోలికలు, కాకపోతే కళ్ళ స్థానంలో – కళ్ళను ఎవరో పెరికి వేసినట్టు – రెండు నల్లని గుంతలు. ‘Statue of a woman in Love’ అని అనుకున్నావు నువ్వు ఆనాడు ఆ కాంటీన్ మెట్లు దిగి వస్తూ ఇద్దరూ చెరో దారిలోకి విడిపోతున్నప్పుడు. నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు కానీ, వెళ్తూ వెళ్తూ తను వెనక్కి తిరిగి నిన్ను చూసిందా? ఒకవేళ చూసి ఉంటే ఏమి కనిపించి ఉంటుంది తనకి? your back or మనిషిగా మారి నడుచుకుంటూ వెళ్తోన్న ముద్దగా మొదలయ్యి ఆపై పల్చగా పిగిలిపోయే ఒక నీడనా? ఏమి కనిపించి ఉంటుంది తనకు?
***
నువ్వు నిజానికి ఈ పుస్తకాన్ని నీడలతో మొదలు పెడదామని అనుకున్నావు. నీడలపై ఒక పేరాగ్రాఫ్ తో. నీడలు in general కాదు. నీలోని నీడలతో మొదలు పెడదామని అనుకుని మరచిపోయావు లేదా మరేదో తట్టి దానితో కంటిన్యూ అయ్యావు. నీ జీవితంలాగే! అది ఎలా మొదలయ్యిందో నీకు తెలియదు. ఎటు ఏ మలుపులతో సాగిందో కూడా నీకు తెలియదు. choice లేని ఒక predetermined narrative ని ‘నువ్వు’ జీవిస్తున్నట్టు పలుమార్లు నీకు తోచింది. కాదు కాదు, you strongly felt it. దానిని మార్చడానికి నీ చేతుల్లో ఏమీ లేదు. నువ్వు చేయగలిగింది కూడా ఏమీ లేదు. A movie is shot and is being played out exactly as it was shot. There is nothing you can do about it. కథా కథనం అన్ని పాత్రలూ పాత్రల మధ్య సంబంధాలూ ఆదీ అంతం … అన్నీ ముందే నిశ్చయమైపోయాయి అని నువ్వు అనుకుంటావు కానీ ఒకోసారి వాంతికి వచ్చినట్టు కూడా అవుతుంది నీకు అటువంటి పోలికలతో. కానీ,, మరో దారి లేదు. ఆ pregiven narrative లేకుండా నువ్వు ఏమీ వ్యక్తపరచలేవు. అర్థం కూడా చేసుకోలేవు. బహుశా అర్థానికి కూడా అర్థం లేదు. No choice. No way out. ఈ కథ కూడా అదే. నీడలతో మొదలు పెడదామనుకుని మరో దానితో ‘మొదలు’ అయ్యిన ఈ narrative కూడా అదే. …to understand this – ‘You smile at me from the depth, I weep at you from the / scale that stays light.’* అంటే ఏమిటి అనీ, ఇంకా ‘ I weep: Your hair is not brown, they offer brine from / the sea and you give them curls … / You whisper: They’re filling the world with me now, / in your heart I’m a hollow way still!’ * అనీ!
A గోడకు సగం ఒరిగి కళ్ళు మూసుకుని ఉన్నాడు. జుత్తులో అక్కడక్కడా తెల్లని వెండ్రుకలు. ఆ గదిలో ఒక మూలగా ఉన్న బల్లపై చిన్న స్టవ్ దాని కింద పాత్రలు కొన్ని. మహా అంటే అయిదు. అవి కూడా పాతవి. సొట్టలు పడి. ఒకదానికి అడుగున మసి కూడా ఉంది. A ని నువ్వు ఆరేళ్ళ క్రితం మొదటి సారి కలిసినప్పుడు ఇలా ఉండేవాడు కాదు అతను. ఆరోగ్యంతో మెరుస్తో ఉండేవాడు. నవ్వితే కుడివైపు బుగ్గ లో చిన్న సొట్ట పడేది. జీవితంతో కళకళలాడుతూ ఉండేవాడు. చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉండేది. కవిత్వం పుస్తకాలు ఎక్కువ. రష్యన్ అనువాద కథలు పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదివేవాడు. రెవల్యూషనరీ ఒక కోణంలో. ఎగిసే నిప్పులాగా ఉండేవాడు. ‘ఏదో ఒకటి చేయాలి’. ‘నువ్వే సమాజం’ (ఇది జిడ్డు కృష్ణమూర్తి phrase అనుకుంటాను). ‘Only a true revolutionary knows the meaning of love’. ‘And love is responsibility towards the other’. ఆరేళ్ళ క్రితం నువ్వు అతనిని కలిసిన సందర్భాలలో ఈ వాక్యాలు అతని సంభాషణలో తరచూ వచ్చేవి. ఆ తరువాత నువ్వు అతనిని లేదా అతను నిన్నూ రెగ్యులర్ గా కలవడం ఎందుకు ఆగిపోయిందో నీకు తెలియదు. Perhaps your life took a different turn (you have no choice) and perhaps he was drowned in his world. ‘Drowned – మునిగిపోయి. నువ్వు వ్యక్తం చేసే వాటిలో ఈ పదం తరచుగా ఎందుకు వస్తుంది అని నువ్వు చాలాసార్లు ఆలోచించావు. ఎందుకు ఇదే పదం పదే పదే వస్తుంది అని. Death by water అనే ఫ్రేజ్ కూడా లోతుగా నీలో నాటుకుపోయింది. ఆ ఫ్రేజ్… death by water … drowned … why those two?
మూడు సార్లు నువ్వు దాదాపు చనిపోయావు. నీళ్ళల్లో పడి. జలపాతం వద్ద ఒకసారి. మరొకసారి బావిలో. మూడోసారి ఆ సరస్సులో. అప్పుడే చచ్చిపోయే వాడివి. ఆ మూడు సార్లూ ఆఖరి క్షణంలో ఎవరిదో ఒక చేయి నిన్ను అంది పుచ్చుకుని పైకి లాగింది. మరీ ముఖ్యంగా, ఆ సరస్సులో నువ్వు మునిగిపోతూ నిన్ను రక్షించేందుకు దూకి నిన్ను పుచ్చుకుని ఒడ్డుకు లాగేందుకు ప్రయత్నించిన మరొకరిని నువ్వు ప్రాణ భయంతో గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కుపోతున్నప్పుడు, తాను కూడా నీతో మునిగి చనిపోతానని తెలిసి కూడా ఒక చేయి నిన్ను పైకి తోసింది. కాపాడింది. ఒడ్డుకు చేర్చింది. ఆ నీళ్ళల్లో నీ కళ్ళజోడు పడిపోయింది. కళ్ళల్లో నీళ్లు నిండి నీకు ఏదీ సరిగ్గా స్పష్టంగా కనిపించలేదు. ఒడ్డు అంచున నీళ్లలోని రాయి పై కూర్చుని నువ్వు నీ ముఖం తుడుచుకుంటూ చూస్తే ఈతకు వెళ్లగా ఈత రాక అక్కడే కూర్చుని ఉన్న ముగ్గురు నీ వైపే చూస్తున్నారు. ఏం పేర్లు వాళ్ళవి? ఇప్పుడు నీకు గుర్తు లేదు. కళ్లద్దాలు పెట్టుకుని నల్లగా అదోలా ఉండే నీ జూనియర్ – ఏం పేరు అతనిది? పేర్లు ఎందుకు గుర్తు ఉండవు నీకు? లీలగా అతని రూపం నీకు ఇప్పటికీ గుర్తు ఉంది. ఫాంట్ ను మోకాళ్ళ దాకా మడిచి ఒక ఒదులు చొక్కాతో ఒడ్డున నీళ్ళల్లో కాళ్ళాడిస్తూ తిరిగే నీ జూనియర్ … ఏం పేరో గుర్తులేదు నీ నాలిక మీద ఉన్నట్టే ఉండి. అతను మాత్రమే నీవైపు కంగారుగా పరిగెత్తుకు వచ్చాడు. నిన్ను ఒడ్డుకు లాగిన నీ సీనియర్ జయశ్రీ నీ పక్కనే కూలబడి ఉంది దమ్ము తీసుకుంటూ. తనకి తోడుగా వెంటనే నీళ్ళలోకి దిగి తననూ నిన్నూ బయటకు లాగిన హానీ బాబు తో మలయాళం లో ఏదో చెబుతుంది. పరిగెత్తుకు వచ్చాడు నీ జూనియర్ నీ వద్దకు … ఇప్పుడు పేరు తడుతుంది నీకు. శ్రీహరి అతని పేరు. అంటున్నాడు అతను, నీకు ఈత వచ్చు అనుకున్నాను. చేతులు కొట్టుకుంటుంటే మమ్మల్ని భయపెట్టడానికి జోక్ చేస్తున్నావనుకున్నాను. ఈత రాకుండా లోపలి ఎందుకు పోయావు అని అతను ఆడుతున్నాడు. నీకేం తెలుసు? ఈత రాకుండా లోపలి పోకూడదని?! అదొక ఆట అనుకున్నావు. నీకు కొద్ది దూరంలో మరొక రాయిపై కూర్చున్న ఇంకొకరిని చేరుకుందామని అనుకున్నావు. అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగానే నడిచావు కానీ క్రమేణా పెరుగుతున్న నీళ్ల కింది నేల ఒకేసారి అంతం అవుతుందనీ నిట్ట నిలువునా నువ్వు నీళ్ళల్లో మునిగిపోతావనీ ఎలా తెలుసు? ఈ దరి నుంచి ఆ దరికి – ఒడ్డున దాటి కొంచెం ముందుకు నీళ్ళల్లో ఉన్న రాయి నుంచి ఇంకొంచెం దూరంగా ఉన్న రాయి వద్దకు – అడుగులో అడుగు వేస్తూ వెళ్దామనే అనుకున్నావు కానీ కింద నేల మాయం అవ్వొచ్చు అని నీకు తెలియలేదు, అలా అని నీకు ఎవరూ చెప్పనూలేదు! What to do? You are glad that a hand was there every time you were about to drown and die … glad that నువ్వు చనిపోతున్నావు అని అనుకున్న ప్రతీసారీ ఒక చేయి నిన్ను తాకింది. గట్టిగా ఒడిసిపట్టుకుంది. పైకి లాగింది. అన్నం పెట్టింది, నీళ్లు తాపించింది. When you were drunk and stoned, వాంతులు చేసుకున్నప్పుడు నిన్ను తుడిచి నీ పక్కనే గంటల తరబడి మెలకువతో నిన్ను కనిపెట్టుకుని ఉంది. జ్వరతీవ్రతతో ఉంటావో పోతావో తెలియని డెలీరియంలో నువ్వు మూలుగుతూ లుంగలు చుట్టుకుపోతున్నప్పుడు అది నిన్ను గట్టిగా పట్టుకుని నిన్ను ఈ లోకంలోనే నిలిపి ఉంచింది. అందుకే నువ్వు ఇప్పటికీ బ్రతికి ఉన్నావు. ఇది రాస్తున్నావు. కానీ, కృతజ్ఞత ఏది నీలో?
***
So here we are: back to square one. Back to that one question. Origins. The narrative of origins! జీవితంలోని ఘటనలకి ఏమైనా సీక్వెన్స్ ఉందా? లేదా ఇండిపెండెంట్ ఈవెంట్స్ కి నువ్వే ఇక సీక్వెన్స్ ని ఆపాదిస్తున్నావా? ఏ ఘటనకు ఆ ఘటనగా విడిపోయి ఉన్న నీ జీవితాన్ని ‘నువ్వు’ లింక్ చేసి వాటికి beginning middle and end ఇచ్చి ఒక కధనంగా మారుస్తున్నావా? అటువంటి కథనం లేకపోతే నువ్వు నీ జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? అసలు అర్థం చేసుకోగలవా ఆ narrative sequence లేకుండా? Is meaning dependent on that narrative sequence? Does meaning emerge out of that narrative sequence? ఏం purpose ఉంది నీ జీవితానికి? ఒక purpose ఉండాలా? లేక purpose ఉండాలి అని నీకు నూరిపోసిన ఆ వాచకాలే నీ జీవితాన్ని మింగేసాయా? నిన్ను నీకు కాకుండా చేసాయా? All that is being put into to you through your senses from the moment you are born … is it a form of coding that creates an algorithm called ‘self’ – a ‘self’ that functions on memory? Are you just an automaton? నీకు తెలియదు. May be నువ్వు అదే అయ్యి ఉండవచ్చు. An automaton. Nothing else. ఇది తెలుసుకోవడం కూడా నీకు ఇప్పటి ఈ క్షణంలో ఈ తపనని అర్థం చేసుకోడానికి ఉపయోగపడదు. కాబట్టి, so here we are: back to square one. ఈ గదిలో. ఇంకా అదే longing తో. Fair and square! ఇక్కడికైతే వచ్చావు కానీ ఉండబుద్ధి కాదు. ఉన్నచోట కాక మరెక్కడో నీ జీవితం. La vie est ailleurs. Arthur Rimbaud అంటున్నాడు Une Saison en Enfer లో true life is elsewhere లేదా real life is elsewhere అని. (true కి real కి తేడా ఏమిటి? రెండు విధాలుగా ఆ phrase అనువాదం చేయబడ్డది. నీకు తెలుసు ఇది అనువాదానికి సంబంధించిన సమస్య అని. కానీ you are helpless). ఎక్కడ ఆ elsewhere? నీకు తెలిస్తే ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రి ఈ గదిలో ఉండవు నువ్వు! Apt టైటిల్ ఆ వాక్యం ఉన్న ప్రోస్ పోయెమ్ కి అని నువ్వు చదివిన తొలినాళ్లలో అనుకున్నవు. నిజానికి ఈ పుస్తకం పేరు కూడా మొదట అదే పెడదామని అనుకున్నావు. Une Saison en Enfer. ఇది కాదు. ఇంగ్లీష్ అనువాదంలో: A Seson in Hell అని! ఆ elsewhere అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉన్నదానిని నరకంగా మారుస్తుందా? (By the way నరకం అంటే ఏమిటి?)
A కూర్చున్న చోటనే ఒక పక్కకి ఒరిగి నిద్ర పోతున్నాడు. బరువైన బడలిక ఏదో తేలిపోయినట్టున్న తేలికతనమేదో అతని ముఖంలో. లోపలి పోయిన చెంపలని గడ్డం కప్పి వేస్తుంది. వాటిలో కూడా తెల్లని వెండ్రుకలు. సరైన పోషణ లేక అని నువ్వు అనుకుంటావు. ఏం జరిగి ఉండవచ్చు ఈ ఆరేళ్లలో ఆరోగ్యవంతమైన ఒక మనిషి సిక్ గా ill గా మారడానికి? జీవన ఉత్సాహం (who is that poet who often uses this phrase and glorifies the living process?) పోయి ఆత్మహత్యకు పాల్పడలేక చచ్చిపోయేవరకూ అలా గడిపేందుకు పరావర్తనం చెందడానికి? ఎన్నో ఏళ్ళు అలా గడిపే బహుశా గంగాధర్ ఆ చెరువు చివరకు చేరుకున్నాడు చివరికి. చెప్పులు విడిచి ఒక పక్కగా ఉంచి లోపలికి నడిచి వెళ్ళిపోయాడు. చెప్పులు వదిలి పెట్టి … did he leave a cryptic message by that gesture? నీకు ఎన్నటికీ తెలియదు. నిన్ను వదిలిపెట్టి పోయిన వాళ్లు అనేక సందర్భాలలో అనేక విధాలుగా నీకు తమని తాము విప్పి చెప్పుకుని ఉండవచ్చు: సంజ్ఞలలో. సంజ్ఞలతో. Trying to hold your hand is gesture holding your hand is a gesture … sitting beside you is a gesture … writing letters to you is a gesture … నీకు ఏమీ చెప్పలేక నిన్ను ఏమీ అనలేక (పోనీ అన్నా) నిన్ను నీకు వదిలివేయడం ఒక gesture … అరుదుగా అయినా సరే, నిన్ను నీలా ఉండనివ్వడం ఒక gesture! All you have to do is to decipher it … that gesture … ‘every gesture is a key to a room that leads to uncountable other rooms!’ అని నువ్వు రాసుకున్నావు. ‘Every gesture is a key to a lock that you can never find’ అని కూడా రాసుకుని మళ్ళీ ఎందుకో కొట్టివేసావు నీ నోట్స్ వంటి డైరీలో: డైరీ వంటి నోట్స్ లో. నీకు తారసపడే పడే ప్రతి మనిషీ తాళం లేని తాళం చెవినా? How to unlock that which has no lock?!
ఇదంతా కాదు కానీ నువ్వు ఈ అధ్యాయాన్ని నీడలతో మొదలు పెడదామని అనుకున్నావు. (ఈ అధ్యాయమా లేక మునపటిదా?) నీలో, ఇతరులలో తార్లాటలాడే నీడల గురించి చెబుదామని అనుకున్నావు. ఆ పారాగ్రాఫ్ ఎక్కడో రాసుకుని పోగొట్టుకున్నావు (your life theme). ఉన్నప్పుడు attention పే చేయకపోవడం పోయాక వెదుక్కోవడం (ఇది కూడా నీ లైఫ్ థీమ్ నే!). పోనీ ఎన్నడైనా పోయినది దొరికితే భద్రంగా ఉంచుకోక తిరిగి మళ్ళా పారవేసుకోవడం! (నీ లైఫ్ పాటర్న్ ఇది). ఇప్పుడు నీకు ఆ పేరాగ్రాఫ్ సరిగ్గా గుర్తు లేదు. Hazy గా జ్ఞాపకం ఉంది. ఆ అమ్మాయి ముఖంలాగా మసక మసకగా. ఎవరినైనా గుర్తుకు తెచ్చుకుంటే తెచ్చుకుందామనుకుంటే నీకు గుర్తుకు వచ్చేది ఏమిటి? Is it a name or a word or an image? నీకైతే ఏమీ తట్టడం లేదు. ఆ అమ్మాయి ముఖమే ఎందుకు అంటే నీకు అబ్సెషన్ అయిన గదులకీ తనకీ సంబంధం ఉంది కనుక … intertwined … కనులని కోల్పోయిన ఆ శిల్పం … ఆ మంచుశిల్పం … statue of a woman in love … ఎవరు చెక్కారు దానిని? శిల్పాన్ని చెక్కి శిల్పి రక్తం చిందిస్తే నువ్వు దానిని ఏమని పిలుస్తావు? ఇప్పటికైతే నీకు అంతగా తెలియదు కానీ ఆ పేరాగ్రాఫ్ మాత్రం నువ్వు అప్పుడు రాసుకున్నట్టు కాదు కానీ ఇప్పటికి ఇలా గుర్తుకు ఉంది:
‘చీకటిగా ఉంది. పూర్తిగా కాదు. ఎక్కడో డిమ్ గా వెలుతురు. కానీ, నువ్వు దానిని వెలుతురు అని అనలేవు. ఎలా అనగలవు గ్రహణపు అంచున కోసే కాంతిని? అది ఇలాంటిదే! చీకటి చుట్టూతా ఉందో అది నీలో ఉందో చెప్పడం చాలా కష్టం. నువ్వు ఉంది అని అనుకునే చీకటి చుట్టూతా ఉండే ఆ సన్నని మసక వెలుతురు నిజంగా ఉందో లేదో అది ఎవరో కూడా తెలియదు. నీకు నిజంగా తెలియదు. నీకు తెలిసినది ఇటువంటి గదులు. ఇటువంటి నీడలు. ఇటువంటి గోడలు. దుమ్ము పట్టి రంగు మారి వెలసిపోయిన గోడలు. గదుల నీడలు. వణికే నీడలు. రెపరెపలాడి ఆనక ఆగిపోయే నీడలు. స్తబ్దుగా ఉండే నీడలు. నీలోని గదులు. నీడలు. గోడలు. పగుళ్లు ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయో నీకు తెలియదు. ఎండకి ఎండి వానకు నాని రంగులు ఎప్పుడు ఏ క్షణాన మారాయో కూడా నీకు తెలియదు. వాటి అసలు రంగు ఏదో కూడా నీకు ఇప్పుడు గుర్తుకు లేదు. ‘ఒకప్పుడు వాటి రంగులు ఇవి‘ అని నీకు ఎవరైనా చెప్పినా చూయించినా నమ్మలేని స్థితికి చేరుకుని ‘నీడలు సర్వసం‘ అనుకునే నువ్వు. ఇదంతా ఎలా మొదలయ్యింది? పోనీ, ఇదంతా ఈ స్థితికి ఎలా చేరింది? ఏది ఏమైనా కానీ, ఇదంతా చీకటి గురించీ కాదు, ఉండీ ఉండనటువంటి మసక వెలుతురు గురించీ కాదు. నీడల గురించీ కాదు. మరి ఇదంతా దేని గురించి అంటే ఎస్తర్ గురించి. మరి ఇదంతా ఎవరి కథ అంటే ఇదంతా ఎస్తర్ కథ. అందుకని నువ్వు దానిని The Book of Esther అని పిలవదలుచుకున్నావు!’
***
From Home: The Years 1996 – 2000
Chapter II
(* These lines are from Paul Celan’s poem Your Hand Full of Hours)








Add comment