
1.
నన్నొదిలి
చాలా దూరం వచ్చేసాను
యిక తిరిగెళ్ళలేను
నీ హృదయం
విశాలమని విన్నాను
విలీనమయ్యేంత
చోటియ్యవూ!

సున్నితావరణం
నీ చూపుల
సున్నితావరణంలోకి
నా కరుకు చరణాలతో
నడిచెలా రానూ
ప్రపంచానికి
ప్రేమాశీస్సుల్లాంటి చూపు
నువు కళ్లు మూసుకున్నా
యిసుమంత తరగదు
నిశ్చల సరస్సులో
అలజడి రేపలేక
చక్కని బొమ్మను
చేజేతుల చెరపలేక
సౌందర్య పవిత్రతను
మైల పరిచే మనసురాక
నిను చేరకుండానే
అటేపు చూసెళ్లిపోతాను

హృదయవర్ణం
మరకే
కనిపిస్తుంది
నిర్మలతకు
రంగెక్కడిదీ
రంగూ
రుచీ
వాసనా
మరక వాసనలే
హృదయానిది
వుత్త పచ్చినీళ్ల పద్ధతీ
*








Add comment