మో….స్వరంలో వినండి “ఎందుకు రాస్తున్నాను?”

జనవరి 5 మో పుట్టిన రోజు

మో- కవిత్వమే కాదు, వచనం కూడా కవిత్వమే. అనేకానేక సంఘర్షణల అంతర్మధనాల బతికిన క్షణమే! అలాంటి మో వాక్యాల్లోకి ప్రయాణించడానికి ఇదిగో ఆయనే ఇక్కడ కొన్ని తాళంచేతులు మనకిస్తున్నారు!

సౌజన్యం: మమతా వేగుంట 

 

 

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “మో ” స్వరం బాగుంది, చక్కగా వినిపించినందుకు ధన్యవాదాలు.

  • మిత్రమా అఫ్సర్,
    తాజా సారంగ సంచికలో ‘ మో ‘ స్వరం లోంచి ‘ ఎందుకు రాస్తున్నాను ? ‘ ప్రసంగాన్ని విన్నాను. మో పుట్టిన రోజు సందర్భంగా ‘ సారంగ ‘ లో దీన్ని చేర్చినందుకు ముందుగా మీకు అభినందనలు. పూర్వ కవుల గురించి తక్కువ ప్రస్తావనలు చేస్తున్న ప్రస్తుత సాహిత్య వాతావరణంలో ‘ మో ‘ ను ఇట్లా స్మరించుకోవడం మంచి సంప్రదాయం. నిజానికి, ‘ మో ‘ చేసిన ప్రసంగంలో ఎంత మంది పూర్వ కవుల్నీ , వాగ్గేయకారుల్నీ స్మరించుకున్నాడో ! అది సంస్కారం.
    ప్రసంగానికి వీడియో రూపమిచ్చిన మిత్రుడు బందా శ్రీనివాస్ కు ఫోన్ చేసి నా అభినందనలను తెలియ జేసాను.
    ఇక ‘ మో ‘ ప్రసంగం దగ్గరికొస్తాను. ఆయన దగ్గరికి రావడానికి నేను విలక్షణ పాఠకుణ్ణి అవునో కాదో నాకు తెలియదు ( పాఠకుల్ని సాధారణ పాఠకులుగా, విలక్షణ పాఠకులుగా విభాజ్యం చేశాడు ‘ మో ‘ !).
    అతి తక్కువ సమయంలో ఎన్ని విషయాల్ని ఇమిడ్చాడో ‘ మో ‘ ! అది ఆయన ప్రతిభ. ప్రతిభావంతులైన కొద్ది మంది తెలుగు కవుల్లో ‘ మో ‘ ఒకడని నా అభిప్రాయం.
    అట్లాగని, ఈ ప్రసంగంలో ‘ మో ‘ వెలిబుచ్చిన అన్ని అభిప్రాయాల్తోనూ నాకు ఏకీభావం వుందని కాదు. కొన్నిటితో అసలు లేనే లేదు. ఉదాహరణకు – ‘ మో ‘ ఇట్లా అన్నాడు – ‘ దైనందిన రాజకీయాలకీ, ఆర్థిక సూత్రాల మీద ఆధారపడే ధరల హెచ్చు తగ్గులకీ కవిత్వమెపుడూ ఉన్నతంగా వుంటుంది. ఉండాలి కూడా ‘. దీనితో నాకు ఏకీభావం లేదు. రాజకీయార్థిక పరిణామాల అవగాహన లేకుండా ఆధునిక జీవితాన్ని అర్థం చేసుకోవడం కానీ, విశ్లేషించడం కానీ సాధ్యపడదని నా అభిప్రాయం.
    ‘ సమాజానికి వీలైనంత తక్కువ హానినీ, సాధ్యమైనంత ఎక్కువ మేలునూ సాహిత్యం చేకూరుస్తుంది ‘. సమాజానికి హానిని ఏ మాత్రం చేసినా అది సాహిత్యం కాదని నా అభిప్రాయం.
    కానీ ‘ మో ‘ తన ప్రసంగంలో తెల్పిన అనేక అంశాలతో నాకు దగ్గరితనముంది. ‘ కవి సీమా సమయ బద్దుడు కాడు ‘ అన్నాడు. ‘ కవిత శాంతి దూత ‘ అన్నాడు. పాశ్చాత్య కవుల్నీ, ఎందరో తెలుగు కవుల్నీ ఉటంకిస్తూ వారి పట్ల తన గౌరవాన్ని ప్రకటించడం ‘ మో ‘ ఉన్నత సంస్కారం.
    ‘ మో ‘ ప్రసంగం విన్నాక మీకు నాల్గు మాటలు రాయాలనిపించి ఈ ఉత్తరం.
    వుంటాను.
    మీ,
    దర్భశయనం శ్రీనివాసాచార్య
    07. 01. 2023

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు