మన రజనీ స్మృతిలో…

కొద్దిగా ఆలస్యంగానైనా ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులతో కల్సి పదిహేడు, జూన్  సాయంత్రం ‘ఛాయా’ సంస్థ ఆధ్వర్యంలో  సంస్మరణ సభ జరిగింది.

బాలాంత్రపు రజనీకాంతరావు పాటల కొమ్మలు, సాహిత్యపు రెమ్మలు నిండుగా పరచుకొన్న ఓ  మహా వృక్షం.  ఆ వృక్షానికి ఆకాశవాణి ఆలంబనైతే, ఎన్నెన్ని పక్షులు ఆ కొమ్మల మీద, రెమ్మల మీద గొంతులు సవరించుకొన్నాయో.

నిండు నూరేళ్ళకు దగ్గరగా బతికిన ఆయన జీవితం నాలుగు చరణాల రాగమాలికతో  లాంగ్ ప్లే రికార్డ్ లాంటిది.  ఎన్నెన్ని జ్ఞాపకాలు, మాటలు, ఊసులు, ముచ్చట్లు ఆయన చుట్టూ అల్లుకున్నాయో.  వందల కొద్దీ సన్నిహితులు, వేల కొద్దీ అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకోని రోజే లేదు.

కొద్దిగా ఆలస్యంగానైనా ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులతో కల్సి పదిహేడు జూన్ 2018 సాయంత్రం ‘ఛాయా’ సంస్థ ఆధ్వర్యంలో  సంస్మరణ సభ జరిగింది.

వీడియో రూపశిల్పి: సమీరా 

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి పని చేసావు సమీరా, అందుకో మా అందరి అభినందనలు

  • సమీరమ్మా…! కేవలం ప్రోగ్రామ్ అనుకోలేం. ఒక అవసరమైన డాక్యుమెంటేషన్. థాంక్యూ బేటా

  • రజని గారి పాటలా సాగిన ఆ సాయంత్రం .. ఒక చిరుగాలి తరగ లా తాకింది. వేడుకను దృశ్యమానం చేసి అందించిన సమర్పకులు ధన్యవాదాలు. మాట్లాడుతున్న వారి పేర్లను సబ్ టైటిల్గా వేసి ఉంటె వాళ్ళు ఎవరెవరో తెలిసేది .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు