అసందర్భ సందర్భంగా ఒక మాట
పొలం ఎందుకు మాట్లాడదు
ఉలిక్కిపడే ప్రతి క్షణం
మట్టి మూలుగుతున్నట్టే ఉంటుంది
విషమ ఘడియలు
వస్తుంటాయి పోతుంటాయి
అదృశ్య శక్తులూ
ఎపుడో ఒకపుడు కనిపిస్తూనే ఉంటాయి
వివక్షతల గోడు
చరిత్ర పుటలకెక్కుతూనే ఉంటాయి
రంగుల్లో తేడాలు
కంటికి దొరుకుతూనే ఉంటాయి
మట్టి కణాలు జీవధాతువులు కదా
కాలానికి విరామం ప్రకటించడమేమిటి
గిట్టుబాటు పదబంధం
పీలికలవుతున్న సాక్ష్యాలెవరికి కావాలంటావా
అనివార్యంగా మరోసారి అదే మాట
పొలం ఎందుకు మాట్లాడదు.
***
మట్టి మూలుగుతున్నట్టే వుంటుంది