1
ఫైన్ ఫైన్ ఫైన్
అమ్మ బుగ్గలు చిట్టిచేతుల్లో అందుకొని పాప:
ఒక ఊళ్లో ఒక పాప ఒక అమ్మా ఉన్నాల్ట
ఊహూ, ఇంకెవల్లే. అప్పులూ…’
పొరలు పొరలుగా దిగులల్లుకుంటూ
పాపలోంచి ఎక్కడికో చూస్తూ అమ్మ
అమ్మను చుట్టేస్తూ , ముద్దులు పెట్టేస్తూ పాప:
డోంట్ వరీమామీ, ఎవ్లీతింగ్ విల్బీ జస్ ఫైన్ ఫైన్ ఫైన్
పాపను ఎత్తి పైకెగరేసిపట్టుకుని గుండెకు హత్తుకుని అమ్మ:
ఒక ఊర్లోఒక పాప అమ్మా ఉన్నారటా
ఉహూ, ఇంకెవరూ లేరు
అప్పుడూ
చా..లా.. రోజుల తరువాత
వాళ్లదగ్గరికో బుజ్జి పిచ్చుక వచ్చిందటా
అప్పుడూ, బుజ్జి పిచ్చుక పాపకు ‘ఐ లవ్యూ’ చెప్పిందట
మురిసిపోయి అమ్మ
పిచ్చుకకు ‘బోలెడంత ఐ లవ్యూ’ చెప్పిందటా
అప్పుడూ
పాపకేమో ఓ చిన్ని గూడు, ఓ చిట్టిపాట
అమ్మకేమో ఓ రంగు ఈకా, ఇన్ని నవ్వుల పూలూ,
ఇంత బురదా ఇచ్చేసి
బుజ్జి పిచ్చుక ఎగ్గిరిపోయిందిట, ఎక్కడికో
అప్పుడూ
ఒక ఊర్లోఒక పాప ఒక అమ్మ ఉన్నారట…
అమ్మను చుట్టేస్తూ ముద్దులు పెట్టేస్తూ పాప:
వి విల్బీ ఫైన్ ఫైన్ ఫైన్!
2
ఇక్తొమి*
అడవిలో ఒక్కొక్క అడుగేదారిచేసుకుంటూ
వెళుతూ ఉంటావు
దారిపక్కన సున్నితంగా తాకిన సన్నని తీవెను
మురిపెంగా ముట్టుకుంటావు
ఆ మాతం్రదగ్గరికితీసుకున్నందుకే
నిన్ను నిలువెల్లా అల్లుకుపోతుంది
అప్పటిదాకా దాచిన ముళ్లతో రక్కుతూ
నీ లోలోపలి పొరల్లోకిచొచ్చుకుపోతుందిఅందమైన ఆ తీవె
పతిఘటించకుండా ్ర ఉండిపోతే
నిన్ను అపురూపంగా చూసుకుంటానని మభ్య పెడుతుంది.
ఉండిపోవడమంటేనిన్ను నువ్వు పోగొట్టుకోవడమే
అని ఎప్పటికో అయితేనేం తెలుసుకుంటావు
నడిచి వచ్చిన దారీమసకైపోతుంది. ఊపిరాడదు
ఇక ఒక్కొక్క పొరనూ చీల్చుకుని
బయటపడడం తప్ప. మరో గత్యంతరం ఉండదు.
గుక్క తిప్పుకోలేక లుంగలు చుట్టుకు పోతున్నప్పుడు
గొంతు ఇంకొంచెం నులిమినిన్ను మరికొంచెం పరీక్షించేవి ఎన్నో తీవెలు
ఆ తీవెలను తెగనరకడానికినీ చేతుల్లోకిఇంత శక్తిని ధారపోసేది ఇక్తొమి.
నీ లోకాన్ని అతలాకుతలం చేసైనా సరే, నిన్ను నీకు అప్పగించే ఇక్తొమి
ఎప్పుడూ నీ పక్కనేనీ నీడలా పొంచి ఉంటుంది
ఒక్కోసారిఇంకెవరో నీ ఇక్తొమి
చాలాసార్లు నువ్వే ఆ ఇక్తొమి
(*ఇక్తొమి – అమెరికన్ ఆదివాసీతెగల్లో ఒకటైన లకోట తెగ గాథల్లో సాలీడు. ముప్పుతిప్పలు పెట్టినూరారు చెరువుల నీళ్లు తాగించి పాఠాలు నేర్పిస్తూ చివరికిమంచి జరిగేట్టు చూసేపాత్ర)








Add comment