1
సైఫ్ జీ,
మసీదులో దేవుడి ముందు మనుషులంతా సమానమే
మసీదు బయటే ,
ఒకరు అమీరు , ఒకరు గరీబూ , ఒకరు ఫకీరు అంతే.
2
సైఫ్ జీ,
మీ కోసం ఆయన
మహమ్మద్ దీపక్ గా మారి నిలబడ్డారు.
ఆయనకు అవసరమైనప్పుడు
మీరు ‘ శ్రీరామ్ సైఫ్ అలీ ‘ గా నిలబడే ధైర్యం
మీకుందా ?
అప్పుడే వసుధైక కుటుంబం సాధ్యం .
3
సైఫ్ జీ ,
ఇతర గ్రహాల మీద మనుషులున్నారని తెలిస్తే
ఈ మనుషులు మొదట వాళ్ళ ఆహార జీవన అలవాట్లో
లేక వాళ్ళ మతాలు మార్చడమో చేస్తారేమో కదా.
4
సైఫ్ జీ,
దేవుడి పేరుతో అడుక్కునే వారికి డబ్బులు ఇవ్వండి
దేవుడి పేరుతో సంపాదించుకునే వారికి కాదు.
దేవుడు మీకు బుధ్ధి ప్రసాదించుగాక.
5
సైఫ్ జీ,
మీ ముత్తాత్త ఎప్పుడో పాశ్చాత్యులకు అమ్ముడుపోయారు…
యుద్ధాల్లో కాదు…
మన మిరియాలు, లవంగాలు, యాలకులు ఇచ్చి
వారి అలవాట్లు , వస్తువులు , వారి ప్రపంచాన్ని మనం
స్వీకరించిన రోజునే.
*
Image: Rafi Haque
.








Add comment