నదిలో నీ ఛాయ

ఒక్కోసారి నది  ఎండిపోతుంది. అప్పుడు దానికి కాస్తంత మనసు తడి అవసరం – తిరిగి నదిగా మొలకెత్తడానికి. మాయా ప్రవరుడివైనా సరే రెండు కన్నీటి చుక్కలకైనా కరువేనా, అని కంటనీరు పెడుతుందేమో!!

దమూడో శతాబ్దపు సూఫీ కవుల్లో ప్రసిద్ధుడైన షుబిస్తారి, గులిస్తాన్-ఇ-రాస్ లో ఇలా అంటాడు:

“నీ బుగ్గమీది పుట్టుమచ్చకి ప్రతిబింబమే నా హృదయం

అది ఛాయే అయితే, మరెందుకలా అది ఎగెసెగిసి పడుతుంది?

దానికెందుకింత అనిశ్చిత,

దానిలో ఎందుకిన్ని తుఫానులు?

దీనిలో ఎందుకిన్ని సముద్రాలు?

నీ పుట్టుమచ్చకి ఈ యాతన లేదు కదా

ప్రేయసీ! అదృష్టమంటే నీదే”

ఈ కవితగురించి వ్యాఖ్యానిస్తూ ఇద్రిష్ షా “All of us know about remembering to remember – but that is just a reminder. The real ability is forgetting to forget (who you really are)” అంటాడు.

షుబిస్తారి యాతనంతా తానెవరో తను మరిచిపోకూడదనే. తానెవరి ప్రతిబింబమో, అది ఎప్పుడూ నిశ్చలంగా, నిర్మోహంగానే ఉంది – తానెవరో దానికి తెలుసుకాబట్టి, ఆ స్మృతినుంచీ అదెప్పుడూ జారదు కాబట్టీ!

షుబిస్తారీ కవిత్వ అనుభూతినే, దార్శనికుడైన ఒక వైదిక ఋషి మరోలా గానం చేసాడు:

“ఆకాశామల గాత్రం దైవం

తారారవిశశి నేత్రం దైవం

వ్యాపక పవన శ్వసితం దైవం

తనుషు ప్రాణాకారం దైవం

లీలానారీ వేషం దైవం”

 

ఆకాశమంటి నిర్మల శరీరం నీది

నక్షత్రాలు, సూర్య చంద్రులు నీ కనులే

సర్వ వ్యాపకపైన వాయువు నీ నిట్టూర్పే

నాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల యాతనగా నా ప్రాణాలు తోడేది నీవుగాక మరెవరు?

నాకోసమే మనోహర సౌందర్యరూపం ధరించిందీ నువ్వే కదా?

 

సూఫీ కవి కవిత్వంలో తాత్విక సత్యాన్ని ఒక ఛాయగా దాస్తాడు.

ఋషి తను దర్శించిన సత్యాన్ని వ్యక్తికరించడానికి కవిత్వాన్ని ఉపయోగించుకుంటాడు.

 

Poetry is the container for the poet-philosopher.

Poetry is a vehicle for the philosopher-poet

***

రిచిపోవడం మనస్సుకి కాలమిచ్చిన వరమే కావొచ్చు, కానీ, తానెవరో శోధించేవారికి అది శాపమే. షా అన్నట్టుగా మరపుని మరచిపోవడమే సాధన, ఆ రాపిడిలోంచి వచ్చేదే సృజన.

ఇదే వరూధినీ ప్రవరుల కథ.  ఆమెది గంధర్వలోకం – ఆ ప్రపంచంలో మునులూ, సిద్ధులూ, యక్షులూ కళాకారులూ ఉంటారు. They share the same place, but not the same space.

ప్రవరుడు మాత్రం ఆ ప్రపంచపు మనిషి కాదు, కానీ ఆ లోకం అంటే ఏదో తెలియని ఉత్సుకత. అతనికి ఆ లోకం చూడాలనే ఉత్సాహమే కానీ, ఆ లోకంలో ఉండిపోదామనే కోరికలేదు. సిద్ధుడిచ్చిన లేపనం పాదాలకి రాసుకుని అక్కడికి చేరుకుంటాడు.

ఆమె ఒక కళాకారిణి. ప్రవరాఖ్యుడులాంటి వ్యక్తిని ఆమె ఇంతకు ముందెప్పుడూ చూడలేదు – అతను ఆమె ఎరిగిన ప్రపంచపు మనిషి కాదు కదా? అందుకే అతనిలో అలౌకిక సౌందర్యాన్ని చూసింది. అతన్ని మొదటిసారి చూసినప్పుడు “ఎక్కడివాడో, యక్షుతనయేందు జయంత వసంత కంతులన్ జక్కదనమ్మునం గెలువజాలెడువాడు” అనుకుంటుంది. ఆ అలౌకిక సౌందర్యంతో పీకలోతు ప్రేమలో పడుతుంది.  తనని తను కోల్పోతుంది, తనెవరో తను మర్చిపోతుంది – అతని ప్రతిబింబమైపోతుంది. ప్రవరుడిపై మోహంతో దేవకాంతైన వరూధిని మానవకాంతగా మారిపోయిందంటాడు ముచ్చటైన పద్యంలో పెద్దన.

కానీ, ప్రవరుడు అలా కాదు – కరిగింది అతని అరికాలికి రాసుకున్న లేపనమేగానీ, అతని మనస్సు స్మృతులలోంచి జారిపోలేదు, అతనెవరో అతను మరిచిపోలేదు. మరవడాన్ని మరిచిపోయిన మనిషి కాబట్టి అతను సాక్షాత్తు హవ్యవాహనుడే – అతని లోకం వేదమే, కాని గంధర్యలోకం కాదు. (అందుకే అతని పేరు ప్రవరుడు).

వరూధినికి అతని గురించిన తదేక ధ్యానంలో, షబిస్తారి చెప్పినట్టు, అతని సౌందర్యమే తన హృదయమైపోతుంది, ఆ నిరంతర ధ్యానమే, విరహమే ఆమెని దహించి, మధించి ఒక సృజనకి వేదిక అవుతుంది. ప్రేమలో తనని తాను కోల్పోయి, వాస్తవ ప్రంపంచాన్ని వదులుకున్నది ఒకరు, తనెవరో మరిచిపోని సత్య నిష్ఠ మరొకరిది — ఈ రాపిడిలోంచే సృజన జరుగుతుంది.

కవిత్వతత్వాన్ని పక్కనపెట్టి మామూలు మాటల్లో చెప్పుకుంటే…

చాలా చిన్ననాటి సంగతి – పదేళ్ళప్పుడనుకుంటా, అక్కతో మొదటిసారి అగ్రహారం వెళ్ళాను.

ఉదయాన్నే, సూర్యోదయానికి ముందే, నదికి పోయేవాళ్ళం స్నానానికి – ఆ నది పేరు శారద.

నదుల పేర్లు ఎంత అందంగా ఉంటాయో కదా?

ఒడ్డుని ఒరుసుకుంటూ పారేది, చల్లగా, మెల్లగా, హాయిగా – అందరి దాహం తీర్చడానికి ఆత్రంగా, ఆనందంగా ఉండేది. ఒకరోజు ఉదయం ఎందుకనో ఆ నదిని అలా చూస్తూ ఉంటే, ఎప్పుడూ ఈ నదిలా ఇలా ఉండగలిగితే ఎంత బాగుండునో అనిపించింది – నిత్య నూతనంగా, నిదానంగా, ఏ అవసరమూ లేకుండా, ఎవర్నీ ఆపకుండా, ఎవరు దిగినా ఎవరి కాళ్ళలోనూ అడ్డం పడకుండా, ఎవరి దారీ చెరపకుండా….!

అదిగో అలాంటి చోటే, ఒక పెద్ద రావిచెట్టు ఒకటి ఉండేది, దాని కొమ్మలు నదిలోకి వంగి ఉండేవి, తగిలీ తగలకుండా నదిని ముద్దుపెట్టుకుంటున్నట్టు ఉండేది అది.

దాని నీడ ఎప్పుడూ ఆ నదిలోనే, ఆ నదితోనే, ఆ నదిపైనే..

ఆ నది మీద పడ్డ సూర్యకాంతి, పరావర్తనమై ఆ చెట్టు ఆకులు తళ తళ లాడుతూ ఉండేవి, ఆ నదినీడని అలా ఆ చెట్టు తనలోకి, ఒక ధ్యానంగా అనుభవిస్తూ ఉండేది.

నదిమీద చెట్టు నీడ – చెట్టుదే అయినా, పదార్థం మాత్రం చెట్టుది కాదు కదా, ఆ నదిలోని నీరేగా ఆ నీడగా మారుతుంది. ఆ చెట్టుని తన గుండెల్లో దాచుకుంటున్నట్టుగా. ఆ నీడ పడ్డ చోట నది చెట్టుగానే తోచేది. నది చెప్పే కబుర్లన్నీ ఆ చెట్టు ఆకులు హాయిగా తలలూపుతూ వింటుండేవి.

అవెప్పుడూ కలిసినట్టూ ఉండవు – నది దారి దానిది, కదలలేని చెట్టు, అక్కడే ఉండిపోయినా – దాని నీడని ఒక్క క్షణమైనా మోసిన ప్రతి నీటి బిందువు జ్ఞాపకాలలోబాటుగా అనంతంగా అది ఆ నదితో ప్రయాణం చేస్తూనే ఉండేది. ఎప్పుడూ, అవి ఒకదాన్ని మరొకటి ఏ రకంగానూ ఇబ్బంది పెట్టుకోవు. ఎప్పటికీ విడిపోలేవు కూడా.

In the same way, I carry your reflection in me, as you do mine in you అంటాడు షబిస్తారి.

You are my companion, you pervaded my existence –  that is how we are eternally, inevitably linked అన్నది వైదిక ఋషి గానం.

The Companion

 

“Once

I was dry sand on the beach

You made castles and tunnels

You reached adolescence

 

then

I was your school bag

You kept your secrets and tears

You fell in love

 

again

I morphed into your dressing mirror

You admired your beauty and blushed

You became a mother

 

At last

I was your stuffed napkin

You wiped off your guilt and gratitude

You reached menopause

 

It  was all then, a past unreachable

Now, you are but a fading epitaph

While I erupt through my limitations”

 

For the poet – poetry is the companion, the poem is a mere byproduct.

For the philosopher – constant contemplation is the companion, conclusions are the byproducts.

ప్రవరుడు కవిత్వం, వరూధిని కవి, సర్వోచి కవిత.

ప్రవరుడు ఋషి, వరూధిని తదేక ధ్యానం, సర్వోచి ఉపనిషత్తు

కానీ, ఒక సంగతి మరచిపోతుంటాం…

ఎప్పుడో ఒకసారి, నదికి దాహం వేసినప్పుడో, దానికి ఆ చెట్టు దగ్గరే ఆగిపోవాలనిపించినప్పుడో- వరదలొచ్చినప్పుడో, ఇంకెవరి దైన్యాన్నో, బాధనో, ఏ కొండ చెరియల ఉదృతిని మోసుకొచ్చినప్పుడో – బహుశా ఆ చెట్టు నదిని చూసి భయపడుతుందేమో, ఎందుకిలా నామీద దాడి చేస్తున్నావు అని కంట కన్నీరు పెడుతుందేమో – కానీ వదిలిపోలేదు, తన నీడని నదిమీద పడకుండా ఆపనూలేదు.

ఒక్కోసారి నది  ఏండిపోతుంది. అప్పుడు దానికి కాస్తంత మనసు తడి అవసరం – తిరిగి నదిగా మొలకెత్తడానికి. మాయా ప్రవరుడివైనా సరే రెండు కన్నీటి చుక్కలకైనా కరువేనా, అని కంటనీరు పెడుతుందేమో!!

“Two drops

One just left the cloud

One about to touch the ground

 

Two drops

One erupting inside the heart

One reaching out to another

 

Two drops

An ocean in them

All the oceans between them

 

Two drops

an unformed thought

and, the unthinkable

 

Two drops

One on the leaf

And, the river below”

****

Finally,

my prayer has been this: (there is nothing poetic about it)

“Forgetting to forget is the greatest sacrifice for a human being.

Do not demand that from me as the price of admission to your circle”

Painting:Stanley Hayter

పప్పు నాగరాజు

పప్పు నాగరాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీరే అంత భాగా చెప్పారు —చెప్పడానికి ఏమి ఉందని రాజు గారు

    =========================
    బుచ్చి రెడ్డి గంగుల

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు