ఉప్పు నీటి స్వప్నం

కరిగిపోయిన ఓ స్వప్నం తిరిగివచ్చింది,
ముక్కలైన మనసుతో, అనేక ప్రతిబింబాలతో.
మానని గాయాలతో నింగికేసి చూస్తుంది,
మనోఫలకంపై –
మరో స్వప్నం పురుడు పోసుకుంటుంది.

****

వెన్నెముద్దల మబ్బులు వెండి రేఖలతో మెరిసె,
కుంకుమవర్ణపు సూర్యుడు, పడమటి మొయిలు కప్పుకున్నాడు.
నీలి రంగుల ఛాయల ఆకాశం,
మెల్లగా దట్టమైన మేఘాలతో చీకటి.

*****

వెన్నెలలద్దుకున్న అలలు, రాగమై తీరం చేరె,
నింగిలోని చుక్కలు నీళ్లపై తేలి ఆడే.
ఇసుకతేనెల మనసు, నీటి పాటకి ఒరుసుకుంటుంది,
కలలు కన్న రెప్పల కింద, ఉప్పు నీరు ఉబికి పారుతుంది.

బాలు వాకదాని

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు