సారంగ దరియ……….

కొత్త శీర్షిక ప్రారంభం!

“నాదెళ్ళ కాలం”  మొదలుపెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.

కానీ ఈ అమెరికా జీవనంలో అభిరుచులకి సమయం అనేది అత్యంత అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అమెరికా అందులోనూ  న్యూయార్క్ నగరానికి దగ్గర్లో జీవనం నిరంతర పరిశ్రమే. గడియారం ముల్లుతో పోటిపడాల్సిందే లేదంటే అసలు ఇక్కడి వరకు రాకూడదు. ఇప్పుడు కాదు రేపు అన్న పదం, ఇది చేయను అన్న మాట, అబ్బా ఎపుడూ పనేనా, అబ్బా ఎపుడూ చదువుకోవాలా అన్న భావనలు ఉంటే అసలు అమెరికా వైపు రాకూడదు అనేది నా నిశ్చిత అభిప్రాయం.

ఇక రాతల్లోకి వస్తే, అప్పట్లో బ్లాగులు చాలా ప్రాచుర్యం పొందాయి. ఎన్నో ఏళ్ళు కూడా అవలేదు అవి వచ్చి వెళ్ళిపోవటానికి. కాని ఇపుడు అన్ని త్వరత్వరగా మారిపోతున్నాయి. మారుతున్న వాటితో మనమూ మారాలి లేదంటే స్థిరమైన నీరులో మురికి చేరినట్లు, జీవితం కూడా ఏదోలా అయిపోతుంది. ఇక బ్లాగునుంచి ఫేస్బుక్ రాతల్లోకి దిగాను 2017లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్నదో పెద్దదో ఒక పోస్ట్ పెట్టి అందరిని పలకరించటం అలవాటు అయింది. మొదట్లో కాస్త సమయం వృధా చేసుకున్నా, తరువాత ఈ మీడియాని పద్దతిగా వాడుకునే పట్టు వచ్చేసింది.

ఇండియాలో ఉండగా శ్రీ రమణ గారి పుస్తకం ‘శ్రీ చానెల్ ‘ అని ఒకటి చదివాను. ఇది చాలా హాస్యంతోను, వ్యంగ్యంగా , ఎవరినీ నొప్పించకుండా, జీవన సరళి,  సామాజిక అంశాలని ఎంచుకుని రాసిన వ్యాస ప్రసంగాలు. చదువుతుంటే చాలా హాయిగా ఉంటాయి. అది చదివినప్పటి నుంచి అలాంటిది ఒకటి రాయాలని అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు సారంగ ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.

నాకు  అనేక విధాలైన ఆసక్తులున్నాయి, భారత, అమెరికా సంయుక్త రాష్ట్రాల పైన అమిత మైన ఉమ్మడి ప్రేమ, జీవన వైవిధ్యం పైన ఇష్టం, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యాల పైన అవగాహన, అభిలాష చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కార్పోరేట్ రంగం, టెక్నాలజీ, ప్రకృతి, ఆరోగ్యం, సైకాలజీ మీద కూడా ఆసక్తి ఉంది. ఈ వ్యాసంగాలు మీ అందరికి నన్ను మరింత దగ్గర చేస్తాయి అనుకుంటున్నాను. మీకు మానసికోల్లాసం, మానసికవికాసం రెండూ ఇచ్చేవిధంగా రాయాలని అనుకుంటున్నాను. మరీ నెల నెలా నా కాలం అదే ‘నాదెళ్ల కాలం’ చదవటానికి సారంగకి వచ్చేయండి.

ఇక ఇది రాయకుండ ముగించలేను. సారంగ అనే పదానికి ఎన్ని అర్థాలున్నాయో. మనకి సారంగపాణి అని తెలుసు. అంటే సారంగి అనే బాణాన్ని చేతిలో ధరించినవాడు అంటే శివుడు అని. ఇక వేరే అర్థాలు, రాజ హంస, నెమలి, జింక, తుమ్మెద, చాతక పక్షి (వాన కోయిల), రాగ సారంగ,  ఇవే కాక ఇంకా అనేక రకాల అర్థాలున్నాయి. అది మరి ఈ సారి సారంగ దరియ. అంటే సారంగి ని ధరించిన అమ్మాయి అని.

మళ్ళీ కలుసుకునేదాక సెలవు !

*

విజయ నాదెళ్ళ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇక ఇది రాయకుండ ముగించలేను. సారంగ అనే పదానికి ఎన్ని అర్థాలున్నాయో. మనకి సారంగపాణి అని తెలుసు. అంటే సారంగి అనే బాణాన్ని చేతిలో ధరించినవాడు అంటే శివుడు అని. ఇక వేరే అర్థాలు, రాజ హంస, నెమలి, జింక, తుమ్మెద, చాతక పక్షి (వాన కోయిల), రాగ సారంగ, ఇవే కాక ఇంకా అనేక రకాల అర్థాలున్నాయి. అది మరి ఈ సారి సారంగ దరియ. అంటే సారంగి ని ధరించిన అమ్మాయి అని.

    మళ్ళీ కలుసుకునేదాక సెలవు !

    ఇక ముందు రాసే వాటి గురించి ఎదురుచూస్తుంటాను

    • ధన్యవాదాలు. తప్పక మంచి వ్యాసాలతో మీ ముందుకు వస్తాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు