వీరలక్ష్మీ దేవి వ్యాస సంపుటి ‘శతపతస్రమీక్షణం’ 19 నవలలపైచేసిన విశ్లేషణ తో పాటూ మరో
10 ఇతర వ్యాసాలుగా భాషా వైభవంతో, భావసరళత తో, సాహిత్య ప్రయోజనాన్ని సారవంతంగా చూపిస్తుంది. నన్నయ భారత ఉపాఖ్యానాలనుంచి సాగిన రచయిత్రి చేసిన విశ్లేషణ స్వరాజ్యపద్మం దాకా వికసించింది. వస్తు వైవిధ్యంతో సాగిన ఈ 29 వ్యా సాలు ఏకబిగిని చదివిస్తాయి. కారణం భాషా సరళత, స్పష్టత, మూలరచనలోని సారాంశాన్ని ఎక్కడా పొల్లుపోకుండా ( అదివందపేజీల పుస్తకమైనా,లేక అయిదు వందల పేజీల బృహత్ గ్రంథం అయినా) దాన్ని ఒక కథలాగా చెప్పే తీరులో ఉందనుకుంటాను. ఇటువంటి ఒక ప్రత్యేకమైన అభివ్యక్తికి కారణం ఏమిటా అని ఆలోచించాను.
బహుశా ఇది రచయిత్రి అధ్యయన శీలత, నిబద్ధత, హృదయంలో కి తీసుకునే తీరులోనే ఉంది అని తెలుసుకున్నా ను.
వీరివ్యాసాలలో ఆయా రచయితల మూల రచనలోని భావాలు మరింత స్పష్టపడి తళుక్కున మెరిసి నేరుగా పాఠకుని హృదయాన్ని తాకుతాయి. ఆమె స్పందించే తీరు ఎలా ఉంటుందంటే అది ఉవ్వెత్తున ఎగసిన కడలి తరంగం వంటిభావోద్వేగం. ఆ ఉద్వేగాన్ని ఒడిసి పట్టుకుని, నిలబెట్టి, పరిశీలించి, సమన్వయపరుచుకుని అక్షరబధ్ధం చేస్తారు.
ఆ అవగాహన కు తీయని తెలుగు పలుకుబడిని అద్ది ముస్తాబు చేస్తారు. ఆ వ్యాసం మూడు,నాలుగుపేజీలు అయినా,రచయిత చెప్పదలుచుకున్న ఏ సున్ని తమైన అంశాన్ని కూడా ఒదిలి పెట్టకుండా పాఠకుల దృష్టిని ఆ అంశం పై ఫోకస్ చేయించగలగడం వీరలక్ష్మి దేవి నేర్పు మాతమే కాదు, సాహిత్యం పట్లవారికి ఉండే అంకిత భావం అని చెప్పాలి.
ఘండికోట బహ్మాజీ రావు గారి రెండు నవలలను విశ్లేషిస్తారు, ‘పరుగులిడేచక్రాలతో విజయవాడ జంక్షన్ ‘ అనే
వ్యాసంలో. ఆమె ఇలా చెపుతారు:
“ కథ మహా వేగంగా విజయవాడ రైలు మార్గం వెంట నడుస్తూ మళ్ళీ డిల్లీ చేరి, అక్కడి రాజకీయం లో దూరి, స్టేషన్ కు వచ్చి , జి. టి ఎక్కి ప్రయాణిస్తుంది. ఇక అటు కేసముద్రం,ఇటు పరిగెడుతున్న జి. టి లో మధ్యలోనే కథ అంత వేగంగానూ నడిచి ఆదివారం అర్ధరాత్రి కి వేగం తగ్గి కుదుటబడి మన చేత హమ్మయ్య అనిపిస్తుంది.”
పతంజలి శాస్త్రిగారి ‘హోరు’ నవలను రచయిత్రి పతంజలి శాస్త్రి గారి సముదప్రు హోరు గా
విశ్లేషిస్తారు.
కథానాయికకి సముద్రపు హోరు ఇలా అనిపించింది. “ సముద్రం అరణ్యం లా ఉంది. వెన్నెల తాగేసి మత్తెక్కిన పులులు, సింహాలు, ఏనుగులు, పెద్దగొంతున్న ఇతర జంతువులు ముక్తకంఠంతో ఘోష పెడుతున్నట్టు ఉందిట. సుధాకర్ (కథానాయకుడు) ను సముద్రం ఏమీ స్పందింపజేయలేదు. పైగా వ్యర్ధమౌతున్న నదీజలాలు ఆయనకు గుర్తుకొచ్చాయట.
“ఈ సముద్రం , ఒంటరితనం, ముఖ్యంగా ఇద్దరూ కలిసిఉన్న ఏకాంతం అతని లో ఏ మార్పు తేకపోవడం
సుభదన్రు ఆశ్చర్యపరిచింది. అంతేగాక ఆమెదేని నుంచో విముక్తమైపోతూ స్వేఛ్ఛలోకి విచ్చుకుంటున్నట్టుగా ప్రతీ నిమిషం అనుభూతి చెందింది. అతను ఇష్టం తో ఆమెను వశపరుచుకున్నాడు అందులో పైకి కనిపించని అతని ఆధిపత్యం ఉంది. అది ఆమెను ఆమెకు మిగల్చకుండా చేసింది.”
ఇది ఎంతో సూక్ష్మమైన కీలకమైన అంశం. రచయిత (శాస్త్రిగారు) దీన్ని పసిగట్టి కథగా
మలచడానికి ఎంతో ప్రతిభ కావాలి అంటారు వీరలక్ష్మి గారు. ఇదే సద్విమర్శ లో ఉన్న గొప్పతనం. తాను చెప్పిన అంశం విమర్శకుల దృష్టిలో పడి మరింత జీవం పోసుకున్నట్టు మూల రచయిత గ్రహించడం.
దీనికిమరొక ఉదాహరణ ఇక్కడ చూడవచ్చు.
సులోచనారాణి గారి గురించి వ్యా సంలో ఇలా చెపుతారు. “పదేళ్ళక్రితం దివిసీమ ఉత్సవాల్లో సులోచనారాణికి సన్మానం చేసినపుడు ఎమెస్కో విజయ్ కుమార్ గారు ఆమె గురించి నన్ను ప్రసంగించమని కోరారు. ప్రసంగం విన్న తరవాత సులోచనారాణి ఇలా అన్నా రు. “ వీరలక్ష్మీ నాకు ఇన్నా ళ్ళూ ఎంతో గుర్తింపు ఉన్నా సాహిత్య గౌరవం లేదని బెంగగా ఉండేది. ఇవాళ ఆ బెంగను లేకుండా చేసేవు” అన్నారట.
విమర్శకులకు మూడోకన్ను ఉండాలి.
అప్పుడే రచయితకూ, పాఠకుడికీ మధ్య విమర్శ ఒక వారధి అవుతుంది. “వివినమూర్తిగారు రచించిన ‘వ్యా పారసంబంధాలు’ నవల నాకు ఎప్పటికీగుర్తుండిపోయేనవల” అంటారు. మొదటిసారిపాఠకురాలిగా చదివినప్పటి అనుభవం తర్వా త , మళ్ళీ నలభైఏళ్ళు గడచిన తరువాత తన విశ్లేషణ ను ఇలా చెప్పా రు. రచయిత దుర్గ లాంటిపాత్రను సృష్టించి ఆమెద్వారా ఏం చెప్పాలనుకున్నా రు? ఎలాంటిస్త్రీ అయినా తల్లి గా మారితే విలువలు తెలుసుకుంటుంది అనా? లేక మృదుత్వాన్ని కలిగిఉంటుంది అనా? అన్నది సందేహం. ఒకవేళ కృష్ణారావు ఆమెకు తారసపడక పోతే, ఆమె జీవితమంతా అలాగే ఉంటుందా? ఇది ఒక ప్రశ్న. ఆలోచిస్తే తెలిసింది ఏమిటంటే మానవ సంబంధాల్లో వ్యాపారం ఉన్నా కూడా త్యా గం కూడా ఉంది. దాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది.” అంటారు.
“నన్నయ్య భారతం ఉపాఖ్యా నాలు” అనేవ్యా సంలో నైమిశారణ్యంలో శౌనకుడనేమహాముని చేస్తున్న ద్వా దశ వార్షికోత్తమ సత్ర యాగానికి ఉగవ్రసుడు అనే సూతుడు వస్తాడు. అక్కడి ముని పుంగవులు అతన్ని కథలు చెప్పమని అడుగుతారు. “మీకు ఎలాంటికథలు కావాలి?” అని ఆయన అడుగుతారు. వారు తమకు ఇలాంటికథ కావాలి అని చెపుతారు.
“1. హృద్యంగా ఉండాలి
2. అపూర్వంగా ఉండాలి
3. దానిని వినడంవల్లఅప్పటిదాకా ఉన్న జ్ఞానం సమగ్రం కావాలి.
4. అఘాన్ని పోగొట్టగలగాలి.
ఈ సందర్భంగా అఘము అంటే పాపమనే కాకుండా ఒక మానసిక అలసట అనుకోవచ్చు అంటారు
నలోపాఖ్యానానికి నూటికినూరు పాళ్ళు ఈ నాలుగు లక్షణాలు సరిపోతాయంటారు రచయిత్రి.
ఈ సూత్రీకరణ ఏకకాలంలో ఏ భాషలో అయినా కథను కలవడానికి సరిపోతుందంటారు.
వీరలక్ష్మీ దేవి ‘శతపత్ర సమీక్షణం’ సాహిత్యవ్యా సాలు పాఠకులకు కూడా ఒక వంద పుస్తకాలు చదివిన అనుభవాన్ని ఇస్తాయి. ఇందుకు గానూ ఆవిడ సాధించింది ABC of literature. Authenticity,
Brevity,and clarity. విస్తృతమైన అధ్యయనం, క్లుప్తత , ఇంకా స్పష్టత అనేఈ మూడు లక్షణాలు ఈ
శతపతస్రమీక్షణం చూపిస్తుంది.
“రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు (1862-1939) వ్యా సం చదువుతున్నపుడు పిల్లలకు
ఇలాంటిమహనీయుల పరిచయం ఎందుకు చేయలేకపోతున్నాం? అని వ్యధ పడ్డాను. కథా,నవలా రచయిత చింతకిందిశ్రీనివాసరావు గారి రచనా వైదుష్యా న్ని చెప్పడానికి, అదిగో ద్వా రక, వికర్ణుడు అనే రెండు నవలలను ఎంచుకున్నా రు. “ గిరిజన జాతుల పోరాట విజయం తో ఈ నవల మంగళాంతమైంది. మహాభారతం లోని సాంబుడికథ, పురాణ మహిమలూ,మహత్యాలను కథలోకిరానివ్వకుండా ,అయినా కథను మార్చకుండా నడపడంలో కల్పనా చాతుర్యం ఒక్కటే సరిపోదు.
కల్పనను ఒప్పించగలిగేనేర్పు కూడా అవసరం.దీనినే కథాకథనం అని విమర్శకులు చెపుతారు.
ఇందులో చెప్పు కోవాల్సిందిభాష. ఎంతో ఇంపైన శిష్టవ్యవహారికమే కాకుండాబహుగ్రంధ పఠనం వలన సొంతమైన, చెవికిఇంపుగా వినబడేతెలుగు భాష లో నవల అంతా నడిచింద” అని అంటారు. ఒక గిరిజన రచయిత తన అస్తిత్వ మూలాలను వెతుక్కుంటూ ఇటువంటి నవల రాయడానికి మరో పాతికేళ్ళు పట్టవచ్చు , కానీ వారి పట్ల ఎంతో ప్రేమతో చేసిన ఈ రచన ఎన్నదగినది“అంటారు.
‘చలం సత్యా న్వేషి’ అనేసిధ్ధాంత గ్రంధాన్ని సమర్పించి బంగారు పతకాన్ని సాధించిన వీరలక్ష్మీ దేవి చలం, జీవనాన్ని , సాహిత్య సారాంశాన్ని ఇలా నాలుగు మాటల్లో చెప్పేస్తారు. “ఆయన తనలాగా ఎవరినీ ఉండమన లేదు. ప్రతీ మనిషిలోనూ ఏదో ఒక ఉన్నతమైన అంశం ఉంటుంది. దాన్ని గుర్తుపట్టుకుని అభివృద్ధిచేసుకోవడం లోనేవాళ్ళ వికాసమూ,ఆనందమూ ఉన్నా యి. దానికి అవసరమైన స్వేఛ్ఛ సంపాదించుకోవాలి అన్నదే చలంగారి సాహిత్య,జీవన సారాంశం “ అంటారు.
సహృదయ పాఠకులకే కాదు విమర్శకులకూ కూడా సంతృప్తినిస్తుంది ఈ ‘శతపతస్రమీక్షణం ‘ వ్యాస సంపుటి. పుస్తకం చదువుతూ నాలుగుమాటలు చెప్పా లనే విషయాన్ని కూడా మరిచిపోయాను. అంతటి చదివించే గుణంతో సాహిత్య సారాన్ని మనకు అందిస్తోంది.
అంతేకాదు రాబోయేతరాలకు, తెలుగు విద్యా ర్ధులకు, ఎంతో ఉపయుక్తమైన, సమాచారంతో హృదయ వికాసానికి ఈ వ్యా సాలు తోడ్పడతాయని నేను నమ్ము తున్నాను. చలంగారి కథ ‘ఆమెత్యా గం’ మీద
వీరలక్ష్మి దేవి ఆహ్వా నం పత్రికలో చేసిన సమీక్ష చదివి, ఆమెతో స్నేహ భాగ్యా న్ని పొందాను. ఈ వ్యాసాలతో ఆమెతో నా స్నేహం ఇంకా కొన్ని అడుగులు ముందుకు వెళ్లిందనిపించింది.
*








చక్కని వ్యాస సంపుటి