రెక్కతెగిన పావురం

1.
ఈ పూటకు నువ్వు నేను
భయంలేని నులి వెచ్చని ఉషోదయాన్ని
ప్రేమించాలంటాను స్వేచ్ఛ కు చిహ్నంగా..
 
2.
నులుపెక్కిన రాజ్యంలో కాంథిశీకున్ని చేసి
నాలుగ్గోడల మధ్యే నిలపాలంటాడు రాజభక్తి పాఠంగా!
సాదా సీదా తెలియని
జతచేరిన జామూన్ వెలుగులో
షరాబీ చాయ్ చప్పరిస్తుంటే,,,
నిద్ర నిషా వదిలించే తొలిఝాము పిలుపుకు
మసీదు గోడనై ఎగిరే పావురాన్ని తలపోస్తుంటాను
తలపించే విషాద చాయల్ని తుడిచేందుకే,,,
చమ్కీ చొక్కాతొ తయారవుతుంటాను!!!
ప్యాకెట్ పాలకు మోజు పడిన వాడు
పరాయి నిందమోపి దాయాది చిహ్నమంటాడేంటి??
 
3.
దిల్ లేని దీవార్ల నడిమి
రమించే హక్కు లేని పురాగా పస్తులుండే
మంచు ముక్కను చేసి
చుట్టూ అనుమానాల గోరీలు కడుతుండు
ఈ మూకహత్యల దునియాలో
ఉంటే వినోద వస్తువుగానో
లేకుంటే వీరాన్ శిధిలంగానో మిగిలి’పోమ్మం’టాడు
షాహీ షేర్వాణీ చూపించి ‌
నా పేగుల మడతలు లెక్కిస్తుంటాడు?!!
కుట్రతేలని బొమ్మల కొలువులో రహస్యం రక్తికట్టెందుకు
అనేకానేక విద్రోహ దృశ్యాలకు నా తోలుబొమ్మ తొడిగి
వాడి దేశభక్తి కొలమానంలో తూగలేదని తోలుకపోతుంటాడు???!
 
4.
అప్పుడెప్పుడో పుట్టినా
ఆద్మీ సంతానమంతా ఒక్కటనే
తెల్ల గొంగళి సీతాకోక చిలుకను
కాంచన పర్వతమంత విశ్వాసంతో చూడాలంటాను
అట్టెట్టా కుదురుద్ది?!..
అగ్రహారానికి అత్తరు వాసన పడదంటాడు
అదేమిటో
కొలగారం నిదులకు నిలువ నీడ లేదనేటోడు
కోవిదులంతా చేరిన కచేరీలో సివాలెత్తి
ఆ సుతారచిలుకను వీధుల పాలెందుకు జేసిండు???!
 
5.
దయలేని పొద్దుకు
నేనొక గడువు తీరిన గడియారాన్ని
టప టపలాడే శబ్దంలో
గడియకో రెక్క కోల్పోతు కనిపించే
తెగుతున్న స్వప్నాన్ని
తలతెగినా తలవంచని నైసర్గిక స్వరూపాన్ని
ఈ మట్టినే నమ్ముకున్న భౌగోళిక విశ్వాసాన్ని
నిషేదముండని సిపాయిల నడుమ
జీవంలేని జీవితములేని
నిత్యం విస్మరించిన వాగ్దానాన్ని!!
నిత్య యుద్ధ సామాగ్రిని!!?
జలియన్వాలాబాగు స్పృహ తప్పిన గతాన్ని!
నేనిప్పుడు రెప రెపలాడే
డెబ్బైనాలు “గో” తిరంగాలో…
రెక్కతెగిన పావురాన్ని.
*

షేక్ షకీల్ పాషా

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • Mohammed Jeelani గారు మీ ప్రేమ అభిమానానికి అనేకానేక హృదయ పూర్వక ధన్యవాదాలు.
      – షేక్ షకీల్ పాషా

  • డెబ్బైనాలు “గో” తిరంగాలో…
    రెక్కతెగిన పావురాన్ని.

    • అక్బర్ పాషా గారు మీ ప్రేమకు హృదయ పూర్వక ధన్యవాదాలు..

  • ఎక్స్ప్రెషన్ చాలా ఫ్రెష్ గా ఉంది. బాగుంది సర్. అభినందనలు

    • శ్రీ రామ్ సర్.
      మీ స్పందన వెన్ను తట్టిన అనుభూతి సార్.. హృదయ పూర్వక ధన్యవాదాలు

    • కరీం ఖాన్ భాయ్!

      ఆప్ కా ప్యార్ కో దిల్ సే షుక్రియా భాయ్..

  • ‘రెక్క తెగిన పావురం’చాలా మంచి కవిత,సమాజ వర్తమాన ముఖచిత్రాన్ని పట్టిచ్చిన కవిత.అభినందనలు షకీల్ పాషా జీ

    • కవి కరీముల్లా భాయ్!..
      మీ ఆప్యాయ పూరిత స్పందనకు హృదయ పూర్వక సలాములు, అనేక ధన్యవాదాలు.

  • ‘భయంలేని నులివెచ్చని ఉషోదయం’ ఇప్పటి పాలనలో ఇదీ ఓ కల కదా. చాలా బాగా రాశారు. రెక్క తెగిన పావురం విలవిలలాట కనిపిస్తుంది. ‘ఆద్మీ సంతానమంతా ఒక్కటనే’ ….కాంచన పర్వతమంత విశ్వాసం అందరిలో కలగందాం.

    • వైష్ణవి శ్రీ గారు!..

      హృదయ పూర్వక ధన్యవాదాలు మేడం.

  • ఫణి మాధవి గారు..
    మీ ఆప్యాయమైన స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు