రాత్రి లోపలికి !!

చ్చేసరికి,

గదినిండా  ఏవేవో శబ్దాలు

నిన్నటివి

రేపటివి

పైనా

కిందా

లోపలా

చిందరవందరగా…

 

కిటికీ పక్కన కూర్చొని టీ తాగుతూ కొన్ని శబ్దాల్ని బయటకు పంపాను

యూట్యూబ్ లో పాటలు వింటూ కొన్నిటిని మార్చేశాను

కిచెన్ లో వంట చేస్తూ కొన్నిటిని కాల్చేశాను

అన్నంతో కలిపి కొన్ని శబ్దాల్ని కడుపులోపల దాచుకొని

కొన్నిటిని యెంగిలి పళ్ళెంలోకి విదిలించి సింక్ లో కడిగేశాను

కసువుతోపాటే కొన్నిటిని ఊడ్చి పడేశాను

 

మిగిలిన వాటి మీద ముతక బొంతనొకదాన్ని పరచుకుని

యిక,

రాత్రిలోపలి లోకం పిలుపు కోసం ఆశగా ఎదురుచూశాను

ఒంటరిగా

నిశ్శబ్దంగా..

*
చిత్రం: సృజన్ రాజ్ 

నవీన్ కుమార్

1 comment

Leave a Reply to గిరి ప్రసాద్ చెలమల్లు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాత్రి లోపలి లోకం పిలుపు కోసం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు