మంటో మెరుపు కథలు

హెచ్చరిక

ఎంతో పెనుగులాట జరిగిన తరువాత, ఆ యింటి యజమానిని బయటకు లాక్కొచ్చి భూమి మీద కుదేశారు. 

కానీ అతడు వెంటనే లేచి నిలబడి తన బట్టలకు అంటుకున్న దుమ్ము దులుపుకుంటూ, యెంతో ఆత్మ గౌరవంతో తనపై దాడి చేసిన దుండగులను ఉద్దేశిస్తూ 

“మీరు నన్ను చంపవచ్చు , కానీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను,

నా డబ్బులు ముట్టుకునే సాహసం మాత్రం చెయ్యొద్దు సుమా” అన్నాడు. 

 

ధృఢనిశ్చయం

“ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సిక్కు మతంలోకి మారడానికి తయారుగా లేను. నా రేజర్ నాకు వెనక్కిచ్చేయండి.

 

మి….ష్…టే…క్

కత్తి అతడి పొట్టను శుభ్రంగా చీలుస్తూ తిన్నగా కింది భాగంలోకి చేరింది. ఆ చర్యలో అతడి నడుం భాగాన్ని పట్టివున్న పైజామా ముడి కూడా రెండు భాగాలయ్యింది.

 

విశ్రాంతి సమయం

 

“అతడు చనిపోలేదు, యింకా అతనిలో ప్రాణం మిగిలి వుంది”

“నా వల్ల కాదు, నేను నిజంగా అలిసిపోయాను.”

కత్తి చేత్తో పట్టుకున్న వ్యక్తి ఒక సారి చూశాక పశ్చాత్తాప పడుతూ “ఓహో ! మి…ష్…టే..క్ జరిగిపోయింది” అన్నాడు.

*

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు