భయం 

పదం
చిన్ననాటి నుంచి తెలిసిఉన్నా
నా పరిచయం మాత్రం
నిన్ననే అయ్యింది.
నిన్న సరదాగా
మూవీ థియేటర్లో
సినిమా చూస్తూ
నవ్వుకుంటూ ఉన్నాము.
అప్పుడు ఒక కాల్ వచ్చింది
మమ్మీ ఫోన్ కి.
మా పిన్ని కాల్ చేసింది.
అయితే నేను ఫోన్ లాక్కొని
                               కట్ చేశాను.
మళ్ళీ కొద్దిసేపటికి
చిన్న పిన్ని కాల్ చేసింది
అప్పుడు పప్పా ఎత్తి చెప్పాడు
బయట ఉన్నామని.
ఇంతకీ అక్కడ ఏమీ జరగలేదు.
కానీ
ఎవరి ఫోన్ రింగ్ అయినా
మమ్మీ ఉలిక్కిపడింది.
ఈ క్రమంలో
ఆమె కళ్ళల్లో
ఒక రకమైన
నీరు నిండిన
మెరుపును చూశాను.
ఆ క్షణం అర్థమయ్యింది
భయమంటే ఇది అని.
అక్కడ
మా అమ్మమ్మ, తాత ఊర్లో ఉంటారు.
వాళ్లకెప్పుడైనా, ఏదైనా జరగొచ్చేమో అన్న ఆ భయం కనపడింది.
అప్పుడర్థమైంది
భయమంటే
ఒక రకమైన
మానసిక వేదన అని.
ఆ క్షణం
భగవంతుణ్ణి
ఒకటే వేడుకున్నా.
నా కళ్ళల్లో
ఆ భయం
ఎప్పటికీ కనపడకూడదని.

దుక్కిడి వైష్ణవి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు