ఆడా మగా సగం సగమే కానీ చెరిసగాలన్నీ ఒక సంపూర్ణం కానే కావు
ఒక్కోసారి రాత్రి పొడుగ్గా ఆమె. చాలాసార్లు పట్ట పగలే కురచగా నేను…
ముక్కలవుతున్న అద్దంలాంటి రేపవళ్ళలో మా ఇద్దరి ప్రతిబింబాలన్నీ రోజూ సగం సగమే అతుక్కుంటున్నట్టు కనిపిస్తాయి.
పుస్తకాల సంచీతో బడి దగ్గరో, బర్రెలు గాస్తూనో దేవుడిచే పాడుబడ్డ గుడి దగ్గరో, ఆవిడే పిల్లల్నాడిస్తోంటేనో పెదవుల్తో, చూపుల్తో, మురికి చేతివేళ్ళతో ఎప్పుడూ ఏదో ఒక సాకుతో తాకుతో దీపప్పురుగు చుట్టూ రాత్రి రెక్కలు కాల్చుకుంటోంటే ఆమె అంతరార్ధం లోపలా బయటా నాలో సగం, కాలుగాలిన పిల్లిలా తచ్చాడుతుంది.
ఒక సగం వినా ఇంకో సగమేదన్నా అసత్యమే గానీ ఇన్నాళ్ళూ నేనే వృత్తాన్ని పూర్తిచేయ గలననుకున్నాను ఇప్పుడిక నాడీకణ దేహపు అంచుల చివర ఒకర్నొకరం అరహస్యంగా మళ్ళీ కౌగిలించుకోవాలి
బావిలో కప్పల్లాంటి మోహాల్ని, జన్మాంతర వియోగాల్ని వెంటేసుకుని, ఉండజుట్టుకుని, ఎక్కడివాణ్ణో ఒక ఆకలి తప్ప వేరే రుచేమీ తెలీకుండా కేవలం శరీరం మాగన్నులోని చీకటిలా ఒత్తిగిలి వుంటే ఎంగిలి నవ్వుల్ని శుభ్రంగా తోమి ఒలికిన సమ్యోగ కలల స్కలనాల్ని ఉతికారేసి వంటగదుల్నీ, పడకపాన్పుల్నీ అలసిపోకుండా కీకారణ్యంలోకి పిట్టల్ని చేసి స్వేచ్చగా ఎగరేస్తుంది.
అసలు ఆమె సగమే నా భయద రెక్కలు విప్పార్చే జ్ఞాన విముక్త నేత్రం * |
Excellent. Sagam sagam okkataithe?!
Gnaana vimuktha netram prayogam bavundi.
Baavilo kappalanti mohaala?!
Sir totally appreciable
దేవుడి చే పాడుబడ్డ గుడి…. కఠినంగా ఉంది అందుకోవడం… అంతరార్ధమో, నిబిడీకృతమైన భావమో… మిగిలినదంతా అత్యంత ప్రమాణికమైన సత్యాలకు అతి సుందర పదబంధాలు… వావ్..!
చాలా బాగా రాశారు….👌
చెరి సగాలన్ని సంపూర్ణం కావు అన్న మాట చాలా లోతైన భావన
మళ్లీ శ్రీరామ్ గారు కొత్త పదం వాడారు గమనించారా
అరహస్యం
చాలా బాగుంది
Excellent