నువ్వు దూరంగా ఉంటావని…

గన్సు ప్రావిన్స్ లోని షాదన్ కంట్రీ పీపుల్స్ ఆసుపత్రిలో పనిచేసే వీ షుయన్ అనే నర్సు రాసిన కవిత ఇది. విరుచుకుపడిన కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఊహాన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. కరోనాను నివారించడానికి, కట్టడి చేయడానికి తన సహచరులతో కలిసి పోరాడుతోంది.


ప్రతి రోజు

 

మబ్సులు, సన్నగా వర్షం

ఐదు రోజులు.. తడి, నిరాశలాంటి నిశ్శబ్దం

తీవ్రమైన జలుబు, కన్నీళ్ల గాయాలు

నిస్సారమైన ఇవే చీకటి మాటలు

నిర్ణీత సమయమూ, రోజులూ నిర్ధారణకాని

ఈ గెస్ట్ హౌస్ స్వీయ నిర్బంధంలో

నువ్వు దూరంగా ఉంటావని నేనెంత నమ్మను

 

శబ్దం లేదు, గాలీ లేదు

రాసుకునే కాగితాలు, మానసిక చొరబాటు

ఒక్కో అరచేతిలో వంద భయం నిండిన హృదయాలనుంచు

వణికేవి, దిగులుపడేవి, ఏడ్చేవి, దిక్కులేనివి.

విషంతో నిండిన వాటిని అవతలికి విసిరికొట్టు

 

ఒకరికి చెందిన గదిని

కలుషితమైనదిగా, పరిశుభ్రమైనదిగా విభజించారు

చేతులు కడుక్కో, చేతులు కడుక్కో, మాస్క్ మాస్క్

చెడు అలవాటులన్నిటినీ బలవంతంగా సరిచేసుకో

ప్రస్తుతం ఈ విషానికి గబ్బిలమే కారణమని ప్రతి ఒక్కరికీ తెలుసు

 

విషాన్ని చిమ్మే ఆ నేరాన్ని తేలిగ్గా చిత్రీకరించారు

17 ఏళ్ల క్రితం నాటి విషం నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ తాజాగా ఉంది

నేడు నిన్నటికి కార్బన్ కాపీ

కానీ, ఈ విషం నిన్నటి విషం కాదు

ప్రజల నిర్లక్ష్యం దాన్ని పెంచి పోషించింది

 

ఆ నిర్లక్ష్యపు ఫలితంగా తీవ్ర అంటువ్యాధి ప్రబలింది

రాత్రి బాగా పొద్దు పోయాక నాకు అనిపిస్తుంది

ఈ గబ్బిలాలన్నింటినీ వాటి గుహల్లోనే దాక్కోనిచ్చి

ఉక్కు కవచంతో కప్పెట్టెద్దాం

దానిపై ఊహాన్ అని చెక్కుదాం,

*

దేశరాజు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు