1
బెంగాలీ కండ్లు~రాత్రి ప్రయాణాలు
2
కశ్మీర్…ఎ పెయింటింగ్
1.
నీ స్థనాల్లోకి దూకి నీ పాలల్లో ఈదాలని వుంది
తల్లీ…నీ కోసం ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన వాడ్ని కదా
నీ పాలల్లో నా గొంతును కాస్త తడుపుకుంటాను
అని ఇలా అడిగానో లేదో రెప్పపాటు కాలంలోనే
మళ్ళీ ఇంకో రెండు స్థనాలు తెగిపడ్డాయి
నల్లటి చనుమొలలు ఎరుపు కాంతితో ఉబ్బిన సూర్యుడిలాగా
ఏ మూలనో మూగగా ఓ పాట పాడుతూ వుంటాయి.
అవును నా గొంతుకింకా పాలు తాకనేలేదు
నెత్తుటి సముద్రంలో మాత్రం ఆ పాటింకా నాకు వినిపిస్తూనే వుంది
పగిలి పెచ్చెలుగా పడివున్న నా గుండెను ఏరుకుంటూ
చిందరవందరగా పడివున్న నీ శరీరంలో
ఏ భాగాన్ని ముందుగా ఏరుకోవాలో అని గాడంగా ఆలోచిస్తున్న
ఎక్కడ పల్లవి వినిపిస్తే అటుదిక్కే నా చూపు వెళ్తుంది.
ఎవరో అంటున్నారిక్కడ ఇదంతా ఒక పెయింటింగ్ అని
పోరు పాటలో ఉన్నదంతా
మొదటిసారి కూలిపోయిన నీ శరీరానికి
బొడ్డులోకి ఇంకిపోయేలా నువ్వు రాసి పోసిన కవిత్వమేనట..!!
2.
ప్రేమగా ఏరుకుంటే నీ గర్భంలో ఉన్న పిండాన్నే ఏరుకోమని
అది పిండం కాదని, అదొక వీరుడి బతుకు మాంసం అని
ఇక్కడ ఎవరో ఒక కోకిల వేషంలో పదే పదే చెబుతూనే వున్నారు
నా చూపు నీ కనుగుడ్డు వైపు మళ్లింది.
నేను confuse అయిపోయా
నా చూపు నీ గుండె వైపు మళ్లింది
నేను ఇంకా confuse అయిపోయా
అంతలోనే నీ పిండం వైపు నుండి ఓ పాట వినబడింది.
నేను నీ స్థనాల్లోకి దూకుతానని అన్నప్పుడు
అచ్చం నీ చనుమొలలు పాడిన పాటలాగే వుంది
వెంటనే నీ పిండాన్ని ముద్దు పెట్టుకున్నాను
నిజమే..ప్రపంచంలోనే నువొక అందమైన పెయింటింగ్వి
అందుకే అనుకుంటా పూటకొకరికి నిన్ను అమ్మేస్తూ వుంటారు.
నువ్ వెళ్లిన ప్రతీ చోట నాలాంటి వాడు ఒస్తూనే వుంటాడు
పొరుగీతాన్ని కొనసాగించడానికి
నీ పసిబిడ్డల పిండాన్ని ఏరుకోటానికి..!!
ప్రేమా పోరూ రెండు కళ్ళు!
ఎప్పుడైనా నిశ్శబ్దపు రాగం విన్నారా? ఆ సందర్భంలో ఏ శబ్దం పలికినా శృతి తప్పుతుంది. అది ఒక సంపూర్ణ రాగం. చెరువులో తన కంటి ప్రతిబింబంలో ఆమె నక్షత్రాల్లా తిరిగి తన కళ్ళలో చూడటం.
చాలా కొత్తగా ఫ్రెష్ నెస్ నిండిన అభివ్యక్తితో మనసును తాకే పదబంధం. అభినందనలు.
కుర్రాడు కొంచెం సాధన, బాగా చదవడం చేస్తే మంచి కవి అవుతాడు. ఓ పచ్చి గాలి వాసన పీల్చి నట్టుంది. బ్రివిటీ కూడా ముఖ్యం. A good attempt.
Baavunnaayi
Parinathi kanpisthundi
చాలా బాగున్నాయి కవితలు బెంగాలి కండ్లు ….నుంచి.చూపుతిప్పంకోలెకపోతున్నాను.అభినందనలు.
రెండూ బాగున్నాయి, కొత్తగా…
రెండు కవితలు యవ్వనంగా మెరిసిపోయాయి… కవితలు రెండూ అప్పుడే పైట వేసిన అందమైన అమ్మాయి నవ్వులా..ఆమె అందమైన తడబాటు లా చాలా అందంగా కనిపించాయి…
చరణ్ వర్తమాన కవిత్వాన్ని చూస్తే…మంచి కవి గా మిగిలిపోతాడన్నది నా జోస్యం!!
అభినందనలు చరణ్!!
ఒక కొత్త వాగ్దానం చేస్తున్నట్టుంది చరణ్ కవిత్వం. అతడు ఎంచుకున్న దారి లో పాదముద్రాలు మాట్లాడుతున్న తీరు బాగుంది.
బాగా రాసే పద్దతి ఉంది
తెలంగణానికో డిలాన్ ధామస్. ఇది కాళోజీ, అఫ్సర్ ల కవిత్వపు నేల. ప్రేమరాగంలో పోరు వాయులీనంలా వినిపిస్తూనే వుంటుంది.kudos Charan.
కవిత్వం మౌలికంగా ప్రపంచాన్ని చూసే చూపులో ఉంటుంది… లోపలి
ప్రపంచమైనా, బాహ్యప్రపంచమైనా. అభివ్యక్తికేముంది… రాయగా రాయగా అదే వస్తుంది. మీకు కవితాత్మకమైన మంచి చూపు ఉంది. అనుభూతులను సాంద్రీకరించుకుని సాధన చెయ్యండి. కవిత్వం బయటికి వచ్చినా రాకున్నా ఆ కవిత్వానుభూతిని మించిన ఆనందం మరొకటి ఉండదు. హృదయపూర్వక అభినందనలు దొంతం చరణ్ గారూ.
యువ కవిగా, మంచిరచయిత గా,పేరు తెచ్చుకునే అవకాశం ఉంది,అందుకే అక్షర ఒడిలోఆక్షరాలు దిద్దారు. జయహో..keepitup..!💐👌
బాగుంది చరణ్. ఉద్వేగం ఏ అవయవానిదో సంశయంలో పడేశారు. మీలో ఒక ఆకర్షణ ఉంది. దానికి హృదయపూర్వక పూల గుచ్చము.
💕
శీర్షిక చాలా వినూత్నంగా ఉంది. ఎడిటర్ గారికి అభినందనలు
‘ఇక్కడ ఎవరో ఒక కోకిల వేషంలో పదే పదే చెబుతూనే వున్నారు’ – సమూలంగా కదిలిచిన పదాలు.. తనకే స్వంతమైన భావాల పొందిక, పేర్పు! ఎందరెందరి దుఃఖాలనో రోజూ చూస్తూ వింటూ అలవాటు చేసేసుకున్న వాళ్లందరికీ కొత్తగా తగిలే పదును పదాలివి! అభినందనలు – ఆశీస్సులు కూడా!
తనచూపులో సముద్రముంది. , ఈ కన్నెవయసు అక్షరాల పువ్వు నా గుండెలపై వాలింది .చరణ్ నీకు అభినందనలు
మీకు మంచి future ఉంది. please have a look on Mohan Babu గారి comments. heartly congrats చరణ్.
కొత్త అభివ్యక్తి , కొత్త శైలి.
అభినందనలు .💐💐💐💐
అద్భుతమైన కవితలు తమ్మీ..మాది చింతపల్లి పక్కన మాడ్గుల మండలం.
కొత్తదైన అభివ్యక్తి…. రాపిడి పెడితే మరింత నిగ్గుతేలే కవి.. he has bright future as a poet….
కాశ్మీరు కవిత ఒక జోల్ట్ లా బాగుంది