కాళ్ళాడని దేవుళ్ళారా
కానలేని దేవతలారా
నిత్యారతి భోజకులారా
సర్వ సేవాలంకరణల పూజ్యులారా
మేఘ పాన్పుపై చేరి ఊయలలూగుతుంటివి కదయా
కునుకు మాని పుసుకు తీసి సిగ్గు పూని
స్పృహ కల్గి భయంకూడి వేదన తోని
ఒళ్ళిరిచి కదలిరా…కళ్ళనూడ్చి ఇటు చూడగరా
చెరచిన చింకిగుడ్డ, ముళ్ళ గంపపై మూగప్రాణం
కందిన పసికందు దేహం, నా చిట్టి తల్లిపై పాశవికం
మాసిన లేతకనులలోకి చూసి నింగి ఉరిపోసుకోదా
జారిన కన్నీటికి మరిగి మరిగి నేల బూడిదకాదా
ఏల పవలింతువయా, చలనములేక లజ్జ లేక
ఏల దరింతురయా ఆ పట్టు పసిడిపోతలు
ఏల తింటివయా ఆ భోగ నైవేద్యాలు
ఏల లేకుంటివయా నీవు…ఎందులకుంటివి?
ఇక నా ఆఖరి కోర్కెకు ముడుపు
ఆ నిర్మల నిష్కల నిర్జీవ రూపము
నా హ్రుదాంతరాళంలోని క్రోదాగ్ని బగ బగ ఎగబాకి
నను దహించి, చాలక ఉవ్వెత్తున ఎగసి ఎగసి
మరిగి మరిగి పచ్చి నెత్తురోలె మెరుస్తూ వెరసి
లోకమ్ములు సమస్త సూన్యమ్ములను కబళించి
ఈ కుళ్ళిన గాలులను జలాలను నేలనూ ఆవహించి
హరులు నరులు గిరులు తరులు క్రృశించి నశించి
ఆ ప్రలయాగ్నుల హారతిలో నా తల్లిని కైమోడ్చి
మీ ఆక్రందన హాహాకార జోలలలో కడచేర్చెదను
ఇక నిట్టూర్చి…నిదురించక నేనేంతవాడిని
సిగ్గులేక దారి తోచక తీరు మారక
నిశ్చల లోకాన పనికిమాలిన బీరాలు
కుళ్లులో తోవతప్పిన చేతకాని కోపాలు.
*








Add comment