కాఫ్కా: ది మ్యారీడ్ కపుల్
1.
నా
అస్తిత్వం
వొక పూట గడపడం
నాకో పూట గడపాలంటే మిస్టర్.
ఎన్ ను వొప్పించాలి !
కోటు గుండీల
నాజూకు తనం పై వున్న ‘మోజంతైనా దయలేని
మిస్టర్.ఎన్ నా రేపటి బ్రడ్ అండ్ బట్టర్ నిర్ణ్యేత.
అమా!
మిస్సెస్.
ఎన్ నువ్వు తల్లివి కదూ
విభునితొ నా మాట వినిపించు మాతా!
అయినా నా పిచ్చిగానీ నీకు వినబడదు కదా!
లేదా
నీ పైన ప్రభువుకి చూపు ఆనందు కదా,
2.
మిస్టర్ ఎన్ నిర్దయ కు జాలి లేదు
పోనీ మరొకరికి గాలం వేద్దామా ?
ఇక్కడ
కనిపించే
ప్రతీ మొహమూ మిస్టర్.ఎన్ రూపానికి మించిన ప్రతిరూపాలే!..
కాఫ్కా:ఫస్ట్ సారో
1.
భయమే తెలీని
అతనో
ఇంద్రజాలకుడు-
2.
రేపటి కొత్త ప్రదర్శన కోసం
రిహార్సులు చేయించాను,
మొదటిసారిగా
అతని మొహంలో విచారాన్ని చూసాను –
3.
గురూ!
రేపటి ప్రదర్శన అయినాక
ప్రేక్షకుల చప్పట్లు
ఎలాగూ మార్మోగుతాయి ,
కానీ-
ఇదే
నా అఖరి ఆట అవుతుంది కదా ?
మరి నువ్వు మాటిచ్చినట్లుగా
నా ముసలి రోగిష్టి తల్లికి
రొట్టెను నమ్మకంగా తప్పకుండా అందజేస్తావు కదూ?
4.
నుదుటిపై
అనంతానంత అనుమానాలతో
మరోలోక విచారమంత వదనంతో
నిద్రిస్తున్నాడు –
క్షయ రోగి
ముసలిదాని చివరి ఆకలి తీరిందా?
5.
గుమ్మంపైన గుమ్మరించినట్ళు
మరణిస్తోన్న ఆమె నెత్తురు –
ఆమె చివరి ఆకలి,
అతడి మొదటి విచారాన్ని
తీర్చలేని నేను,
అవును
ముమ్మాటీకీ
నేనే
ఆ ఇరువురి మరణాల హంతకుణ్ణి –
Kafka – In The Penal Colony
1.
హత్యలు పలు రకాలు
పలు రూపాలు
పలు నామాలు –
నేరానికి మరణశిక్ష,
కానీ,
అమలు చేసే
మంత్ర యంత్రానికి హత్య పాపం అంటుకోదు,
నేరగాడికి నేరమేమిటో తెలీదు
పోనీ ఏమిటో చెప్పరు –
ఇది రాచవ్రణం –
2.
నేనో పరదేశీ పరిశీలకుణ్ణి,
రేపటి ఉదయానికి శెలవు తీసుకొనేవాణ్ణి –
మిత్రమా!
నిన్ను రక్షించలేని
నా రిక్త హస్తాలకు నీ రక్తపు చుక్కలు
ఎవరికీ జవాబుజారి కాకపోయినా
ఏ సాక్షమూ చెప్పలేవు –
కాని,
హత్యోదంతాన్ని మాత్రం
అంగీకరించలేను
ఇది రాచక్రీడ అని రాసిపోతాను –
*
బావున్నాయి