టీవీ లైవ్ షో డిబేట్ లో పాల్గొన్న వ్యక్తిని పోలీస్ అధికారి ఇంటరాగేట్ చేస్తున్నాడు.
“మీ పేరు?”
“ధర్మవీర్.”
“అది అసలు పేరేనా?”
“కాదు దేశం కోసం ధర్మం కోసం అసలు పేరు వదిలేసుకున్నాను.”
“మీరేం చేస్తారు?”
“మత పరిరక్షణ.”
“ఉద్యోగం అదీ ఏంచేస్తారు?”
“అదే నా వుద్యోగం.”
“నిన్న డిబేట్ లో అవతలి వ్యక్తి మీద దాడి ..”
“దాడి కాదు; బుద్ధిచెప్పాను.”
“అంత పెద్దాయన్ని చెప్పుతో కొట్టడం తప్పుకాదా?”
“కుక్క కాటుకి చెప్పు దెబ్బ. పెద్దా చిన్నా లేదు అతిగా మాట్టాడితే మళ్ళీ కొడతాను. నాలుక చీరేస్తాను. తలకాయి తీసేస్తాను.”
“కానీ ఆయన కూడా మీ మతం వాడేగా? పైగా అతను కూడా మీలా యేదో ధర్మ పరిరక్షణ సంస్థ నడుపుతున్నాడు ..,”
“వాడో వెస్ట్ ఫెలో. చేతకాని చవట. మతం ముసుగేసుకున్న లిబరల్ డిమోక్రటిక్. ఉదార ప్రజాస్వామ్య పదాలు మాకు నడవ్వు.”
“దేవుడి పేరుతో రాజకీయాలు చేయొద్దని అంటున్నాడు?”
“అంటే .. వాడు అర్బన్ నక్సలైట్.”
“మీ మతం హింసనీ ద్వేషాన్నీ బోధించదని కూడా అతను పవిత్ర గ్రంథాల నుంచి శ్లోకాలు చెబుతున్నాడు?”
“మాది హింస కాదు; ధర్మ హింస.”
“ఓహ్, మీరు కూడా మాలానే అన్నమాట.”
ఫైల్ మూసి కరచాలనం చేసి స్టేషన్ గేటు వరకూ వచ్చి ధర్మవీర్ ని కారెక్కించాడు పోలీస్ అధికారి.
2.
ఆకాశంలో చందమామ కావాలని రామ్ లల్లా యేడుస్తున్నాడు. ఎంత వూరడించినా వూరుకోడం లేదు.
అద్దంలో చందమామని చూపిద్దామని ఆలోచించిన కౌసల్యకి యెంత వెదికినా అద్దం దొరకలేదు.
అంతఃపురంలో దొంగలే అద్దం యెత్తుకు పోయారని తెలిసి బాలక్ రామ్ గుక్కపట్టాడు.
*








రాముడి గుడిలో హుండీ దోపిడైంది!
ధర్మం పేరుతో హింస బుల్లి తెర పై నాట్యమాడింది
రెండు గల్పికలు బాగున్నాయి