వాస్తవాలన్నీ కఠినమైనవే
నిరీక్షించినవన్నీ వికృతమైన
నవ్వుతో పలకరించినపుడు..!
బతుకుచిత్రంలో
రంగు పలచబడినపుడు
గుర్తింపు కోసం తపన పడడం
తనని తాను శపించుకోవడమే !
ఒక్కోసారి అకారణ దిగులు
జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.
అన్ని వైపుల్నుంచి
ఊపిరాడని వాతావరణం
హింసాత్మక కట్టడంలా మారుతుంది.
నిజానికి కుట్ర కూడా
తెల్లగా నవ్వుతూ
ప్రేమకవితలా పలకరిస్తుంది.
విషాదాన్ని భరించడం
నేర్చుకోగలిగిన వాడికి
కళ్ళతో నవ్వడం తెలియదా ఏంటి?
మనసు దెబ్బనే కాచుకున్నప్పుడు
మనిషి కాటును ఓర్చుకోవడం
సులభమే మరి..!
*








బతుకుచిత్రంలో
రంగు పలచబడినపుడు
గుర్తింపు కోసం తపన పడడం
తనని తాను శపించుకోవడమే !
మనిషికాటు కవిత చాలా బాగుంది సార్.
నిజానికి కుట్ర కూడా
తెల్లగా నవ్వుతూ
ప్రేమకవితలా పలకరిస్తుంది.
100% True.
– కుడికాల వంశీధర్