కధలు

నల్ల హంస

నాకు సముద్రపు ఒడ్డున ఇసుక గూళ్ళు కట్టుకోవడం ఇష్టం. వాడికి ఇసుకలో పరిగెడుతూ అలలతో ఆడుకోవడం ఇష్టం. నాకు రాత్రివేళ చుక్కలతో కబుర్లు చెప్పడం ఇష్టం. వాడికి చందమామని చూస్తూ సూర్యుడి కోసం ఎదురుచూడటం ఇష్టం. ఇష్టాలు వేరని...

డిపార్చర్స్

అతడు ఆమె వెనకాలే తిరిగాడు. రోజులతరబడి వెంటపడ్డాడు. గాఢంగా ప్రేమిస్తున్నానన్నాడు. ఆమె లేకుంటే బతకలేనన్నాడు. ఒక్క నిమిషం ఎడబాటు సహించలేనన్నాడు. నేటి అన్ లిమిటెడ్ కాల్ ప్యాకేజీలు, వీడియోఛాటింగ్స్ కాలంలో అతడామె మీద  తన...

తంతు

గరుడపురాణం మైకులోమోత ,చెప్పేవాడి కుత్తుకలో కూడా బెరుకు భయం,పెద్ద మూకుడులో కరుగుతా,కాలుతా ఎలుగుతున్న వత్తి,బొంగరాలు తిరుగుతా వాసన కక్కుతున్న సాంబ్రాణి కడ్డీలు, ఆరగా ఆరగా ఎసే సాంబ్రాణి పుగ,గులాబీ రెక్కలని చావంచి రేకులనీ...

గాయం

 సాయంత్రం స్కూల్ అవ్వగానే నిక్కీని తీసుకుని ఇండియన్ గ్రాసెరీస్ షాప్ కి వెళ్ళాను. ఈ రోజెందుకో గానీ, చాలా మంది జనాలతో వాతావరణం కోలాహలంగా వుంది. నిక్కీ కడుపులో వున్నప్పుడు నా సీమంతానికి వచ్చిన అప్పటి కొలీగ్ ప్రమోద్ షాపులో...

రంగస్థలం

“బావా! చాలా రోజులయిపోయింది కానీ సాయంత్రం కలుద్దామా?” అటునుంచి నయీం గొంతు. చాలా రోజులంటే నెలలూ సంవత్సరాలూ కాదు. అయితే గియితే వారం రోజులయ్యుంటుంది. కలవడం అంటే మాటల్ని, సమయాన్నీ, మందులో కలుపుకుని తాగడం. నిజానికి, ఒకేచోట...

కరెంటు పోయిండాది

 “ఏందిన్నా, ఏందిన్నా ఇది. మళ్ళా ఇంత అధ్వాన్నమా?” బాధలో కూడా కోపం కనపడ్తాంది మాటల్లో. “ఏమిన్నా, ఏమైంది, ఏమన్నా గొడవా?” “గొడవేముందిలే సామీ. సావింటికాడ గొడవెందుకుంటాది. ఆయమ్మ బర్తే…” “ఏం ఆయప్ప తాగొచ్చినాడా?” “తాగని...

మరో స్వేచ్ఛ

“నీక్కాబోయేవాడు ఎలా ఉండాలే?” అరకిలోమీటరు జాగ్ వల్ల కలిగిన ఆయాసంతో బరువుగా ఊపిరి పీలుస్తూ అడిగింది సుజాత. మూడు కిలోమీటర్ల దూరాన్నిసునాయాసంగా పరిగెత్తి, సుజాత అలసట వల్ల ఆగిన స్వేచ్ఛ, దానికి బదులిస్తూ, “నావి చాలా చిన్న...

సూర్యుడి నీడలు

చాటింగ్ లిస్టులో అప్పటి వరకు ఎక్కడో చివరున్న వ్యక్తి వైకుంఠపాళీ నిచ్చెనెక్కినట్టు ఒక్క మెసేజ్ తో పైకొచ్చాడు. గొంతులోకి వెచ్చగా పాలు మిరియాలే కాదు చెవుల్లోకి రామ్ మిర్యాల కూడా ఘాటుగా తాకుతున్న ఫీలింగ్ ని ఆస్వాదిస్తుంటే...

వెన్నెలనంటిన చీకటి  

“సర్ర్… ర్ర్… ర్ర్…’మంటూ పక్క నుంచి కారు దూసుకు పోవడంతో చేతిలో మునకాలకర్ర తుప్పల్లో పడిపోయింది. గతుక్కుమన్నాడు గుంపన్న పడాల్. తూలి పడబోయేడు ముందుకు. “ఒరే! నీ…” ఒక బూతు వదిలి నిలబడేలోగ కారు...

జాయిజాదులు

     లచ్చువమ్మ కాళ్ళకింద తౌడు రేగుతున్నది. సుడిగాలి తీర్గ పొద్దటిసంది గింత ఇరాము లేకుండ ఒకటే తిరుగుతున్నది. సీకట్లనే కోడినీ, ఇంక జరున్నంక సూర్యుడ్నీ నిద్ర లేపింది, అటెనక ఊరు నిద్ర లేసింది. న్యాల మీదికెల్లి లేసి, పక్క...

వెలుగు రేక!        

       ఎఫ్ ఎమ్ లో సునీత మంద్ర స్వరం..” ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావో…”  ఈ పాట విన్నపుడల్లా ఏదో ముసురు పట్టినట్టు తీయటి జ్ఞాపకాలు మెదులుతాయి. గుండె పాదులో మొలిచిన ఆ తొలి ప్రేమ గురుతుల్ని తట్టి లేపుతుంది ఆ పాట. ఎలా...

రాకాసి బోధ

నిన్నటి దాక ‘ఇళ్ల మధ్య సారాదుకాణం ఉంది మొర్రో..’ అంటే ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడేమో అక్కడ ఉన్నట్టుండి గొడవ రేగుతోంది.  నాకేం అర్థం కాలేదు. నేను ఆ పేటలో విలేకరిని కాబట్టి ఏ సమస్య అయినా ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ...

మూడు ఏభైలు

ఆ చలికాలపు ఉదయాన్న, నులివెచ్చని చిరియెండలో అడుగులో అడుగువేసుంటూ, దారిలో స్నేహితుల్ని పోగుచేసుకుంటూ, ఇద్దులాడుకుంటూ స్కూలు చేరుకొనేసరికి – చాలామంది ప్రక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రి వైపుగా వెళుతున్నారని గమనించాను. అక్కడ...

నిశ్చయ

రాత్రంత, పొద్దున్నుంచి మల్ల మల్ల ఆ మాటే యాదికొస్తున్నది యాదమ్మకు- ‘‘నువ్వు నాకు ఉండు యాదమ్మా.. నీకు ఏ ఇబ్బంది లేకుంట సూసుకుంట. పిల్లల సదువుల కర్సు గుడ నాదే!’’ పెద్ద మేస్త్రీ ఎవరు లేంది సూషి అడిగిండు మెల్లగ. ఏమనాల్నో...

రాళ్ళు – మనుషులు

ఎంతకీ అతను రావడం లేదు. వస్తాడనుకుని ఎదురుచూస్తోంది. నాలుగింటికల్లా వచ్చి బైటికి తీసుకెడతానన్నాడు. మాటిమాటికి గదిలోంచి బైటికి చూస్తోంది మేరి. ముందుగదిలో అత్తగారు , తోటికోడళ్ళ గొంతులు వినిపిస్తున్నాయి. ఆడపడుచులిద్దరూ...

 భార్యామణి నవ్వు  

రాత్రి తొమ్మిదిగంటల సమయం.   మయూరి బార్ అండ్ రెస్తారెంట్లో కూర్చొని ఉన్నాడు మహేష్ తన స్నేహితులతో. మందంగా వెలుగుతున్న లైట్లూ, మంద్రంగా వినిపిస్తున్న పాశ్చాత్యసంగీతం, చల్లటి వాతావరణం. నగరంలో అత్యంత ఖరీదైన బార్లలో ఒకటేమో...