A Prayer: Stop Death Dance of a Virus

Toda’s featured poet : Arindam Roy

He is a publisher, editor, author, poet, translator, a teacher of Mass Comm and Creative Writing, has 38 years’ experience in various newsrooms. Festival Director of Kavya Kumbh, a mega International Multilingual Poetry Fest, he is the Founder and Editor-in-Chief, Different Truths. He was the Managing Editor of a reputed Gurgaon-based Citizen Journalist portal and has held senior positions in several publications. He has launched several publications, newspaper supplements and headed an event management company, Think Tank, in the mid-1980s. He handheld several journalists, young authors and poets. He participated at various seminars, symposia, poetry meets in various capacities. He has contributed 13 chapters to various publications. Of these, seven chapters were published in two Coffee Table Books, published by the Times Group. He is a co-author of a novel, Rivers Run Back, which was launched at the American Centre, New Delhi, in 2015. His writing partner is a well-known American novelist, Joyce Yarrow. He lives in Allahabad and Bangalore. 

Poem

A Prayer: Stop Death Dance of a Virus

 

An agnostic’s prayer to stop the cruel death dance of a virus

 

The death dance of a virus has begun

Do I see you, O Bhimaya, manifest yourself

In an invisible form, unicellular, half-dead,

To mutate with lightning speed in eight substrains?

 

Angry god, are you not satitated?

Corona death worldwide is 93,673, while

Total Nos affected is 1.6 million[1] and still counting.

Worldover, people are frightened, O Ugraya!

 

Am confused, denying your existance till now,

I am on my knees, praying to you, O Sarvajnaya!

Not for me and my family alone,

But for Vishwa Kutumbam, the Global Family.

 

O Mritunjaya! Pause a while, ask yourself

When your people die, do you not die a little too —

Cell by cell, microcosm by microcosm

Are you not annihilating yourself?

 

Who are you punishing, O Neelkanth!

Aren’t you the one, who swallowed the poison,

To save gods, demons, humans, the entire Universe

During the Churning of the Cosmos, the Samudra Manthan?

 

Am perturbed, perplexed, baffeled, O Sadashivaya!

Have I got my metaphor wrong?

Are you the Coronavirus or am I a Covidiot?

Are you waiting for the Universe to suffer and heal?

 

O Bhootnath! Lord of the dead and the ghosts,

Samshan, the two burning ghats of Varanasi, where

Lit up pyres burn perpetually, like your lamps on Earth,

How many more corpses should fuel your Divine Light?

 

Tell me from where shall I begin the death counts:

New Delhi, Kolkata, Mumbai, Hyderabad, Bangalore,

Wuhan, Rome, London, Paris, New York – the list is endless,

People’re dying faster than flies. Stop it, O Gangadharaya!

 

Such unprecedented lockdowns, globally,

Unheard of in human history, O Ashutosh!

Bustling megapolises have become ghost towns,

Scared people’re trapped in every home-prison, worldover.

 

Fortunatley, we have many a brave warriors,

Doctors, nurses, paramedics, nursing the sick and the dying,

The police, managing the lockdowns. Each of them

Have risked their lives. Some have died too, O Shankaraya!

 

Cities in my country are cruel, brutal for migrant labours

Without jobs, hopes and food, they walked hundreds of miles

To return to their unwelcome villages, if not dead

Weary and hungry on the way. What’s their fault, O Satvikaya!

 

Did you learn a thing or two from Goddess Kali?

In her grotesque barbaric form, she swallowed you,

Her husband, to deck up like a widow[2]? No one told me,

In my childhood, how you reemerged, O Haraya!

You are the God of gods, O Mahadevaya!

Strange might be your ways.

End this cruel death dance soon

Save us from untold suffering, disease and death.

 

Global economy is in dumps. Many have and

Millions will lose jobs. Let’s not be chocked to death,

Painfully. Let’s not be snatched from

Our people in the last days, and in death, O Shambhu!

 

Save us all before it’s too late, O Pashupatinath!

We are all pashus, animals, big and small,

At your mercy. Listen to the prayer of an agnostic

I seek delivarance for the entire humanity.

 

Shed your anger: come out of the wings

Before it’s too late. Save the suffering, I am your

Frightened child; accept my peace prayer, O Rudraya!

Om Shanti, Shanti, Shanti!

 

 

Notes: Many names of Lord Shiva (in the corresponding stanzas)

 

  1. Bhimaya: One who has Fearful Form
  2. Ugraya:     One who has Extremely Fierce Nature
  3. Sarvajnaya: One who Knows Everything
  4. Mritunjaya: One who is the Victor of Death
  5. Neelkanth: One who Drank Kaalkoot (deadly posion), the Blue Throated
  6. Sadashivaya: One who is Eternally Auspicious
  7. Bhootnath: One who is the Lord of the Nether World, the Dead and the Ghosts
  8. Gangadharaya: One who Holds the Ganga in His Hair
  9. Ashutosh: One who can be Easily Pleased
  10. Shankaraya: One who Gives Happiness and prosperity
  11. Satvikaya: One who is the Lord of Boundless Energy
  12. Haraya: One who Dissolves all Bondage and Sins
  13. Mahadevaya: One is the God of the Gods
  14. Shambhu: One who Exists in an Enlightened State of Highest Consciousness
  15. Pashupatinath: One who is the Lord of the Fauna (Animal Kingdom)
  16. Rudraya: One who Gets Sad by the Pain of the Devotees

 

అనుసృజన : సి.వి.సురేష్, అడ్వకేట్,

ప్రార్థన: ఆ వైరస్ మరణనృత్యాన్ని ఆపు!

 

ఆ వైరస్ మరణహేల మొదలైంది

నిరాకారమై, ఏకకణివై, అర్ధమృతవై

అష్ట ఉప సూక్ష క్రిములతో, మెరుపు వేగంతో మమేకమయ్యే

స్వయంభూ నిర్మితమైన ఓ శంకరా!

నిను నేను చూడగలనా?

..

కోపోద్రిక్తమైన ఓ దేవదేవా

నీవింకా త్రుప్తి చెంధలేదా?

93,673 మంది మృత్యువాతకు గురై

పదహారు లక్షల మానవులు బాధితులై

ఇంకా కొనసాగుతున్న ఉదృతిని లెక్కెడుతూ

ప్రపంచ మానవాళి మొత్తం  భయం కోరల్లో చిక్కినారు, ఓ జఠాధరా!

..

ఇప్పటివరకూ నీ మనుగడ పైనే నాకో సందేహము౦డేది

ఓ సర్వజ్ఞా !

ఇప్పుడు నా మోకాళ్ళపై వాలి ప్రార్థిస్తున్నాను.

నా కోసం, నా కుటుంబం కోసమొక్కటే కాదు

ఈ విశ్వమానవాళి కోసం…ఆ వసుదైక కుటుంబం కోసం!!

..

ఓ అజరామరా!

ఒక్క క్షణం నిల్చిపో..నిన్ను నీవే ప్రశ్నించుకో

నీ ప్రజలు చనిపోతే, నీవూ కాస్త చనిపోయినట్లు కాదా?

ఒక్కో కణం దాటి ఇంకో కణానికి,

ఒక రోగపీడిత ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వ్యాపిస్తూ

నిన్ను నీవే విద్వంసీకరించుకొన్నట్లు కాదా?

..

ఓ నీలకంటేశ్వర!

నీవెవరిని శిక్షిస్తున్నావు?

ఈ విశ్వాన్నీ, మానవాళినీ, దేవదానవుల

రక్షణకై , సాగర మధనం లో ఉద్భవించిన

గరళాన్ని మింగిన ఆ శివుడివి నీవేనా ?

..

ఓ సదాశివా!

నేను విచలితమైనాను.

కలవరపడిపోయాను.

అతలాకుతలమయ్యాను

నేనూహించిన నీ రూపాల్లో తప్పుఉందా?

నీవు కరోనావైరస్ వా? నేనేమైన కోవిడయట్ నా?

ఈ విశ్వం మొత్తం వేది౦చబడి, కోలుకోవాలని వేచి ఉన్నావా?

….

ఓ భూతనాథ!

ఈ స్మశానానికి,

ఆ దెయ్యాలకు, మృతులకు నీవు యజమానివి

చితిమంటలను రేపే

వారణాసి లోని ఆ రెండు జ్వలిత వాటికలు

ఈ భూమిపై నీయొక్క ద్వీపాలు

నీ దివ్య జ్యోతి వెలగడానికి

ఇంకా, ఎన్నిమృత దేహాల ఇందనమవసరము?

..

చెప్పు,

మరణాలను ఎక్కడి నుండి లెక్క పెట్టాలో ?

న్యూ ఢిల్లీ, కోల్కత్త, ముంబై, హైదరాబాదు, బెంగుళూరు

వుహన్, రోమ్, లండన్, పారిస్, న్యూ యార్క్ నుండా….

ఇలా అంతం లేని జాబితా ఉంది.

ఈగలకంటే వేగంగా చనిపోతున్నారు.

వీటిని ఎలాగైనా నిలిపేయ్ ఓ గంగాధరాయా!

..

ఓ అసుతోషా!

ప్రపంచ వ్యాప్తంగా,

ముందుగ ఊహించని ఈ మూసివేతలు,

మానవ చరిత్రలో ఎప్పుడూ వినలేదు

సందడిగా ఉండే జంటనగరాలు భూత గృహాలయ్యాయి

పవిత్ర పౌరులందరూ గృహనిర్బంధం లోకి పంపించబడ్డారు

..

 

ఓ శంకరయ్య !

అదృష్టం కొద్దీ మా వద్ద సాహస పోరాట యోధులు ఉన్నారు

బలహీనపడిన, మరణించబోయే వారికి సేవలందించే

డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ నిపుణులున్నారు

ప్రతి ఒక్కరు, తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు.

వారిలో కొందరు మరణించారు కూడా!

..

నా దేశం లో నగరాలు దుర్మార్గంగా ఉండొచ్చు.

వలస కూలీలపట్ల దారుణంగా ప్రవర్థించి ఉండొచ్చు

ఒకవేళ మరణించి ఉండక పోతే…..

పనుల కోసం, ఆహారం కోసం, ఆశయాల కోసం

తమను స్వాగతించని గ్రామాలకు తిరిగి చేరేందుకు

దారి పొడువునా, ఆకలితో, అలమట తో

వందల కొద్దీ మైళ్ళు నడిచి వెళ్తున్నారు.

వాళ్ళు చేసిన తప్పేమిటి? ఓ సాత్వికాయ!?

..

ఓ హరా!

కాళీమాత నుండి

నీవేమైన ఒకటీ రెండు అంశాలు నేర్చుకోన్నావా?

ఆమె విధవరాలుగా అగుపించడానికి,

ఆమె వికృత, అనాగరిక రూపం

నిన్నూ, తన భర్తనూ మింగేసింది,

నా బాల్యం లో , ఈ విషయాలు నాకెవ్వరూ చెప్పలేదు

నీవెలా పునఃప్రవేశి౦చావు?

..

ఓ మహాదేవా!

నీవు దేవదేవుడివి

నీ దారులు వింతగా ఉండొచ్చు

ఈ చావునృత్యానికొక చరమగీతం పాడు

అవ్యక్త వేదన నుండి, రోగాలనుండి, చావు నుండి

మమ్మల్ని కాపాడు.

..

ఓ శంభూ!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది..

కోట్లమంది నిరుద్యోగులవుతారు.

మమ్మల్ని మృత్యువును ఎంచుకోనివ్వకు

కూరుకుపోయిన మమ్మల్ని బాధతో బయటకు తీయాలనుకోకు

మేమంతా ఆఖరిరోజులలో ఉన్నాము.

మరణానికి దగ్గరలో ఉన్నాము.

..

ఓ పశుపతి నాధ!

ఇక సమయం దాటాక ముందే మమ్మల్ని కాపాడు

నీ దయ వల్ల మేమంతా …

చిన్నా, పెద్దా పశువులము, జంతుజాలాలము

ఈ మొత్తం మానవాళి విమోచనను కోరుతున్నాను.

..

ఓ రుద్ర !

నీ ఆగ్రహాన్ని వొదిలెయ్ ….!

ఆ బంధనాల నుండి వెలుపలికి రా

ఇంకా ఆలస్యం కాకముందే,  బాధితులను కాపాడు

నేను నీ భయకంపిత బాలుడిని.

నా శాంతి ప్రార్థనను స్వీకరించు.!

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి !

*************

 

[1] Impact of Coronavirus worldwide when I was penning the poem, on April 10 (00.10 hrs in India)

[2] A Bengali poem describes Kali, ‘Nij saami nij grash kore sajlo bidobha’, translated in this stanza.

Srinivas Vasudev/CV Suresh

20 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 106నామాలో,శివ అష్టోత్తర నామాలు,తో,కవితను రాయడం..
    కవితానువాదం, చేయడం.. great, మాకు,చాలా చాలా నచ్చింది..రోజు దేవుడు ని,ఇలాగేగా,ప్రార్థన చేస్తున్నాము..,🙏🙏🙏అందరికీ పాదాభివందనం.!

  • A powerful poem addressing Lord Shiva in his various forms. The poem aptly dilineates the current corona cridis and its fallout. Congratulations on composing a wonderful poem and it being featured in Telugu magazine.

  • మృత్యు మరణ హేల అంటూ విశ్వవ్యాప్తముగా వ్యవస్థల్ని సైతం అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ గురించి భారతీయ ఆధ్యాత్మిక పరిభాషలో లయకారుడైన శివునికి ప్రకృతి ప్రకోపాన్ని వివరిస్తూనే ఈ విలయానికి ఉపశమనాన్ని ఆ లయకారుని నుండే అర్థించడం..శివునికి ఉన్న నామ అంతరార్థాన్ని ప్రస్తావిస్తూ చేసిన అక్షర నివేదన..
    అనువాదమెంత ఆర్ద్రంగా ,ఓ నిందాస్తుతి గీతంలా ఉందొ..నిడివి ఎక్కుకే ఉన్నా ఆవేదన నింపుకున్న అక్షరాల అశ్రు నివేదనలా ధ్వనిస్తోంది…ఇంత మంచి పోఎమ్ ని తెలుగు పాఠకులకు అందించినందులకు మీకు కృతజ్ఞాతాపూర్వక నమస్సులు..

    • ప్రత్యేక ధన్యవాదాలు రాజీ…మీ ఆత్మీయ స్పందనకు

  • Interesting piece, mixing facts, prayer and aspirations.
    The Telugu version is well done.

  • అనుసృజన చాలా బాగుంది సర్ ..ఇప్పటి సందర్భానికి సరిగ్గా సరిపోయింది..

  • ఆవేదనాత్మక నివేదన. And It’s like a prayer of anguished mankind.. ఒకింత నిందాస్తుతి మాదిరిగా అనిపించింది. అనుసృజన ప్రక్రియ పట్ల మీ ప్రేమకు, పదాల అమరికలో నేర్పుకు హేట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. పొడవైన పోయెమ్ సర్ చదివేందుకే టైమ్ పట్టింది మాకు.. ఇందుకు కూడా మీకు హేట్సాఫ్. ఈ కరోనా టైమ్ లోని తీవ్రత దాని ప్రభావం మానవాళిపై ఎలా ఉంది వంటివి అంకెలతో సహా కవి రికార్డ్ చేయడం వల్ల భవిష్యత్ లో ఇది చదివితే.. ఇప్పటి పరిస్థితి దాదాపు తెలిసిపోతుంది. మానవ చరిత్రలోనే ప్రపంచమంతా.. ఊహించని మూసివేతకు గురైన దయనీయ పరిస్థితి కళ్ళముందు కనపడుతుంది. సో.. ఈ ప్రార్థనాత్మక కవిత ఈ అనుసృజన నిలబడిపోతాయి సర్. 💐💐💐💐💐 మీకు, Arindam roy గారి గురించిన సమాచారం అందించి ఆ కవిని మాకు చేరువ చేసిన శ్రీనివాస్ వాసుదేవ్ గారికి, సారంగకు ధన్యవాదాలు.

  • కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత బీభత్సాన్ని చూసి ఆవేదనా భరితంగా,ఆర్తిగా, ఆర్తిగా లయకారకుడైన పరమశివుని ప్రార్థిస్తూ వ్రాసిన కవి గారికి నమోవాక్కాలు 🙏🏻

    ‘ నీ దివ్య జ్యోతి వెలుగటానికి ఇంకెన్ని మృతదేహాల ఇంధనం అవసరమో ‘ అంటూ ఓ రకంగా వ్యంగ్యంగా ఆ శివయ్యను నిందించినట్లుగా అనిపించినా …..భక్తుల విషయంలో అది పరిపాటే కదా !

    సమస్త మానవాళి తరఫునా ‘ ఇకనైనా ఈ మృత్యుహేలను ఆపవయ్యా ‘ అంటూ శంకరుకి వేడుకోవటం మినహా చేయగలిగేది లేదని కవి గారి భావన.

    Thanks to Vasudev ji for introducing the poet n appropriate verse in present situation.

    Congrats to Suresh ji for his తెలుగు అనువాదం.

    • చాలా సంతోషం లీల జీ మీ ఆత్మీయ స్పందనకు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు