ఈ గోడపై
ఒక వాక్యం అవుదామని
కాసింత రంగు పూసిన కుంచె తీసుకున్నా
అది నెత్తురు వాసనేస్తూన్న
వరి కంకులా మారింది
ఎప్పటిదో ఒక వార్త
కాలిపోతున్న వాసనేస్తూ
పొగ మంచులో ఆవిరవుతోంది
తెలవారి వీధంతా
పగిలిన పాదాల ముద్రలతో
ఎర్రని పండుటాకులు
ఎక్కడో మూల మోగిన
బడి గంట వైపు
జారుతున్న లాగును పైకెత్తుకుంటూ
పరుగున పోతున్న పసి బాలుడు
రేపొకసారి మరల రాత్రిని
కలగంటాను
కటకటాలు తెరచుకున్నట్లు!!
*
క్లుప్తంగా బాగా రాశారు
Thank you sir
బావుంది
Thank you sir
చాలా బాగుంది