16 వ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్ల , రామాయణాన్ని సంస్కృతం లోంచి తెలుగు లోకి తొలుత అనువదించి కీర్తి గడించిన విదుషీమణి. తెలుగు సాహిత్యం లో విశేష కృషి చేసిన రచయిత్రుల రచనల గురించి లోతు గా చర్చించుకునేందుకు గాను మొల్ల పేరుతో సత్కారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మొట్ట మొదట గా ఈ సత్కారానికి నిడదవోలు మాలతి గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేశాము.
నిడదవోలు మాలతి గారి రచనల మీద రచయిత్రుల ప్రసంగాలు, పురస్కార ప్రదాన కార్యక్రమం మార్చి 11 న ఉదయం పదిన్నర గంటలకు (EST) జూమ్ లో జరుగుతుంది. సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమం లో పాల్గొనవచ్చు. మాట్లాడటం కంటే, ఆమె సాహిత్య కృషి ని పరిశీలిస్తూ వ్యాసాలు రాస్తే, వాటిని ఈబుక్ గా తీసుకొచ్చే ప్రతిపాదన కు సహాయం చేసినవారవుతారు.
ఈ అవార్డులు , సత్కారాలు నగదు, పూలమాలలు, శాలువాలు, మెమెంటో లకు పరిమితం కాకుండా రచయిత్రుల సాహిత్య కృషి ని చదివి, చర్చించుకోవటం ఈ మొల్ల సత్కార కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమాన్ని వీక్షించ దల్చుకున్న వారు ఈ లింకు ద్వారా చూడవచ్చు
https://www.youtube.com/watch?v=SPKR5VzQWQM&feature=youtu.behttps://us02web.zoom.us/j/8117006366
నిడదవోలు మాలతి గారి సంక్షిప్త పరిచయం
నిడదవోలు మాలతి ప్రముఖ కథా , నవలా రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, అనువాదకురాలు, తెలుగు ఉపాధ్యాయులు (రిటైర్డ్). నిడదవోలు మాలతి ప్రముఖ తెలుగు రచయిత్రి, కథకురాలు, సాహిత్య విమర్శకురాలు, తెలుగు ఉపాధ్యాయులు (రిటైర్డ్).1950లో కథలు వ్రాయడం మొదలు పెట్టి ప్రస్తుతం బ్లాగు తెలుగు తూలిక, ఇంగ్లీషు తూలిక.నెట్ నిర్వహిస్తూ, దాదాపు వంద తెలుగు కథల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి, ఇంగ్లిష్ లో మూడు అనువాద కథా సంకలనాలు ప్రచురించేరు. తెలుగులో ఆరు కథా సంకలనాలు , చాతక పక్షులు, మార్పు – రెండు నవలలు, ఎన్నెమ్మకథలు సంకలనాలు నాలుగు,వ్యాసమాలతి సంకలనాలు నాలుగు ప్రచురించారు.
ఇంగ్లీషు పుస్తకాలు
- The Spectrum of My People ( జైకో బుక్స్). ఇది Short Stories From Andhra Pradesh అన్న శీర్షికతో పునర్ముద్రణ.
- From My Front Porch (సాహిత్య అకాడెమీ ప్రచురణ),
- Penscape: An Anthology of Telugu Short Stories (లేఖిని, హైదరాబాద్ ప్రచురణ).
- All I Wanted to Read and Other Stories, My Little Friend
- Beyond the Shores of the River Existentialism. (మునిపల్లె రాజుగారి అస్తిత్వనదం ఆవలితీరాన కథాసంకలనం అనువాదం. కేంద్ర సాహిత్య ఎకాడమీ. In print.)
ఆమె 9 సంవత్సరాల పాటు తిరుపతిలో లైబ్రేరియన్ గా 1964-1973 మధ్య పనిచేసారు. 1973 నుండి అమెరికాలో ఉంటున్నారు. ఆమె 1978-2005 మధ్య కాలంలో యు.డబ్ల్యూ-మాడిసన్ లో తెలుగు భాషను రెండవ భాషగా బోధించారు. ఆమె 2001లో ప్రారంభించిన తూలిక.నెట్ వెబ్ సైట్ ఈ అంతర్జాల వేదిక విదేశాలలో అనేక సాహితీపరులకు, రిసెర్చి స్కాలర్సుకీ ఉపయోగపడుతోంది. తమ సాహిత్యం మొత్తం పిడియఫ్ పార్మాట్ లో సంకలనాలుగా కూర్చి, తనబ్లాగు తెలుగుతూలిక లో ఉంచారు
కల్పనారెంటాల
[…] Dial by your location+1 646 876 9923 US (New York)+1 646 931 3860 US+1 301 715 8592 US (Washington DC)+1 305 224 1968 US+1 309 205 3325 US+1 312 626 6799 US (Chicago)+1 689 278 1000 US+1 719 359 4580 US+1 253 205 0468 US+1 253 215 8782 US (Tacoma)+1 346 248 7799 US (Houston)+1 360 209 5623 US+1 386 347 5053 US+1 408 638 0968 US (San Jose)+1 507 473 4847 US+1 564 217 2000 US+1 669 444 9171 US+1 669 900 6833 US (San Jose)Meeting ID: 811 700 6366Find your local number: https://us02web.zoom.us/u/kcwwOiXNOkమరిన్ని వివరాలకి సారంగ చూడండి. https://magazine.saarangabooks.com/%e0%b0%ae%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%ae%e0%b1%8a%e… […]
Will join to hear
ధన్యవాదాలు కల్పనా. బాగుంది ప్రకటన. విజయోస్తు.
సంతోషం శ్యామలగారూ. మీ అభిప్రాయాలు కూడా వీలయితే వేరే వ్యాఖ్యరూపంలో పెట్టవచ్చు. ఎదురు చూస్తాను.