నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కారం మార్చి 11 న

16 వ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్ల , రామాయణాన్ని సంస్కృతం లోంచి తెలుగు లోకి తొలుత అనువదించి కీర్తి గడించిన విదుషీమణి. తెలుగు సాహిత్యం లో విశేష కృషి చేసిన రచయిత్రుల రచనల గురించి లోతు గా చర్చించుకునేందుకు గాను మొల్ల పేరుతో సత్కారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మొట్ట మొదట గా ఈ సత్కారానికి నిడదవోలు మాలతి గారిని ఏకగ్రీవంగా ఎంపిక చేశాము.

నిడదవోలు మాలతి గారి రచనల మీద  రచయిత్రుల ప్రసంగాలు, పురస్కార ప్రదాన కార్యక్రమం మార్చి 11 న ఉదయం పదిన్నర గంటలకు (EST) జూమ్ లో జరుగుతుంది. సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమం లో పాల్గొనవచ్చు. మాట్లాడటం కంటే, ఆమె సాహిత్య కృషి ని పరిశీలిస్తూ వ్యాసాలు రాస్తే, వాటిని ఈబుక్ గా తీసుకొచ్చే ప్రతిపాదన కు సహాయం చేసినవారవుతారు.

ఈ అవార్డులు , సత్కారాలు నగదు, పూలమాలలు, శాలువాలు, మెమెంటో లకు పరిమితం కాకుండా రచయిత్రుల సాహిత్య కృషి ని చదివి, చర్చించుకోవటం ఈ మొల్ల సత్కార కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమాన్ని వీక్షించ దల్చుకున్న వారు ఈ లింకు ద్వారా చూడవచ్చు

https://www.youtube.com/watch?v=SPKR5VzQWQM&feature=youtu.behttps://us02web.zoom.us/j/8117006366

నిడదవోలు మాలతి గారి సంక్షిప్త పరిచయం

నిడదవోలు మాలతి ప్రముఖ కథా , నవలా రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, అనువాదకురాలు, తెలుగు ఉపాధ్యాయులు (రిటైర్డ్). నిడదవోలు మాలతి ప్రముఖ తెలుగు రచయిత్రి, కథకురాలు, సాహిత్య విమర్శకురాలు, తెలుగు ఉపాధ్యాయులు (రిటైర్డ్).1950లో కథలు వ్రాయడం మొదలు పెట్టి ప్రస్తుతం బ్లాగు తెలుగు తూలిక, ఇంగ్లీషు తూలిక.నెట్ నిర్వహిస్తూ, దాదాపు వంద తెలుగు కథల్ని ఇంగ్లిష్ లోకి అనువదించి, ఇంగ్లిష్ లో మూడు అనువాద కథా సంకలనాలు ప్రచురించేరు.  తెలుగులో ఆరు కథా సంకలనాలు , చాతక పక్షులు, మార్పు – రెండు నవలలు, ఎన్నెమ్మకథలు సంకలనాలు నాలుగు,వ్యాసమాలతి సంకలనాలు నాలుగు ప్రచురించారు.

ఇంగ్లీషు పుస్తకాలు

  1. The Spectrum of My People ( జైకో బుక్స్). ఇది Short Stories From Andhra Pradesh అన్న శీర్షికతో పునర్ముద్రణ.
  2. From My Front Porch (సాహిత్య అకాడెమీ ప్రచురణ),
  3. Penscape: An Anthology of Telugu Short Stories (లేఖిని, హైదరాబాద్ ప్రచురణ).
  4. All I Wanted to Read and Other Stories, My Little Friend
  5. Beyond the Shores of the River Existentialism. (మునిపల్లె రాజుగారి అస్తిత్వనదం ఆవలితీరాన కథాసంకలనం అనువాదం. కేంద్ర సాహిత్య ఎకాడమీ. In print.)

ఆమె 9 సంవత్సరాల పాటు తిరుపతిలో లైబ్రేరియన్ గా 1964-1973 మధ్య పనిచేసారు. 1973 నుండి అమెరికాలో ఉంటున్నారు. ఆమె 1978-2005 మధ్య కాలంలో యు.డబ్ల్యూ-మాడిసన్ లో తెలుగు భాషను రెండవ భాషగా బోధించారు. ఆమె 2001లో ప్రారంభించిన తూలిక.నెట్ వెబ్ సైట్ ఈ అంతర్జాల వేదిక విదేశాలలో అనేక సాహితీపరులకు, రిసెర్చి స్కాలర్సుకీ ఉపయోగపడుతోంది. తమ సాహిత్యం మొత్తం పిడియఫ్ పార్మాట్ లో సంకలనాలుగా కూర్చి, తనబ్లాగు తెలుగుతూలిక లో ఉంచారు

కల్పనారెంటాల

 

 

కల్పనా రెంటాల

4 comments

Leave a Reply to మాలతి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు