నీడ రాజీనామా ఇచ్చింది…

ర్ధరాత్రి ఫ్రిడ్జ్ డోర్ తెరిచాను
లోపల విస్కీ బాటిళ్లు మీటింగ్
              పెట్టుకుంటున్నాయి.
నా రూములో
సీలింగ్ ఫ్యాను వారం రోజుల
 నుంచి తిరగటం లేదు.
ఇప్పుడా ఫ్యాను దుప్పటి కప్పుకొని పడుకొంది.
నేను చెమటలు కక్కుకొంటున్నాను.
 నా నీడ నాకు
ఈరోజు రాజీనామా ఇచ్చింది.
రోజూ నా వెనుక నడవడం
దానికి బోర్ కొట్టిందేమో!
స్పర్శ 
ఏమీ జరగలేదు
అయినా గుండె బరువెక్కింది
ఏమీ పోలేదు
అయినా ఏదో ఖాళీగావుంది.
అందరూ వెళ్లిపోయారు
మాటలు, నవ్వులు
వాగ్దానాలు
మిగిలింది నిట్టూర్పు.
ఆ నిట్టూర్పులో
పాత రోజుల వాసన
మిగిలిపోయిన వేదన
రేపటి భయం
పాడైన కల శబ్దం
ఎవరిని నిందించాలి
విధినా,
మనుషుల్నా
నన్నా
తెలిసిందల్లా నొప్పి
మాత్రమే!
*

ఏటూరి నాగేంద్రరావు

నాకంటూ సాహిత్యరంగంలో గురువులెవరూ లేరు. చిన్నప్పటినుంచీ ఎక్కువగా పుస్తకాలు చదవడం, సమాజాన్ని నిశితంగా పరిశీలించడం అలవాటై రచనలను చేయడానికి ఉపక్రమించాను. అలా కాలేజీ మేగజైన్ లలో నా కవితలు ప్రచురించబడ్డాయి. ఆ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా రాయడం మొదలెట్టాను.
ఈ క్రమంలో రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో
ఉద్యోగంలో చేరి ఉద్యోగ భాద్యతలు పాటు
సాహిత్యంలో కూడా నా బాధ్యతగా కవితలు
రాయటం మొదలెట్టాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.