నిశ్చలం

నేనే శాశ్వతం

నా పయనం అనంతం

నా గమనం నిర్ధిష్టం

నా గుణం నిశ్చలం

నా లక్షణం సలక్షణం

నువు ఏ పేరుపెట్టిన నాలో కలిగే మార్పు శూన్యం

 

ఎన్ని జాతులను చూడలేదు నేను?

ఎన్ని యాతనలను కనలేదు

అవాంతరాలు ఆపదలు నీవే నేమో

కష్టాలు కడగండ్లు నీకే నేమో!

 

ఉపద్రవాలు ఉత్పాతనాలు నాకేమి కొత్తగాదు

 

నేడు నేను “ప్లవ” రేపు ఇంకొకటి

మరొకనాడు”విప్లవ”

 

నామాలెన్ని మారిస్తే ఏం?

నా మూలం ఒక్కటే నామార్గం ఒక్కటే

అవంతరాలను దాటడం

నిశ్చలానందాన్ని అవిచ్చన్నంగా నింపటం

కల్లేదుట కలిగే పరిణామాలను

నా గర్భంలో

నిక్షిప్తం చేస్తున్నా.

 

ఎప్పుడైన నిన్ను నీవు వెదుక్కొనే క్రమంలో

నీవు తప్పిపోతే

నీజాడ మర్చిపోతే

నా జ్ఞాపకాల పొరలకు స్వాగతం

*

జయదేవ్ మెట్టుపల్లి

3 comments

Leave a Reply to Giri Prasad Chelamallu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు