జెల్లీ

మంటో గల్పికలు ప్రతి పక్షం చదవండి!

రోజూ ఉదయం ఆరు గంటలకు తోపుడుబండిలో ఐస్ అమ్మే ఒక మనిషిని ఎవరో అతని సేవా స్థలం పక్కనే పొడిచి చంపేశారు . రోడ్డుపై పడిఉన్న అతని శరీరంపై పక్కనే వున్న తోపుడు బండిలో వున్న ఐస్ కరిగి చుక్క చుక్కలుగా కారుతోంది .

పావు తక్కువ ఏడు ప్రాంతంలో పోలీసులు అతడి శవాన్ని తీసుకుపొయారు .  ఐస్  నీ రక్తాన్నీ రోడ్డుపై అలానే వదిలేశారు .

ఓ తల్లీ పిల్లాడూ కూర్చుని వున్న జట్కా బండి వేగంగా అటువైపుగా వెళ్లింది . రోడ్డుపై గడ్డ కట్టిన రక్తాన్ని చూసి పిల్లవాడు  తల్లి జాకెట్టుని లాగుతూ
“చూడు అమ్మా జెల్లీ !” అన్నాడు .

పశుత్వం

అతి కష్టం మీద కొద్ది పాటి విలువయిన గృహోపకారాణాలతో మొగుడూ పెళ్ళాం తప్పించుకోగలిగారు . అప్పుడే యవ్వనంలో అడుగుపెడుతూన్న కూతురి జాడ ఎక్కడా కనిపించలేదు . చిన్న పిల్ల మాత్రం తల్లి స్థనాన్ని జూకుతూ ఆమె చంకలో సురక్షింతంగా వుంది .పశువుల కొట్టంలో గోధుమ రంగు ఎద్దుని అల్లరి మూకలు తోలుకుపోయినట్టువున్నారు . ఆవు మాత్రమే వుంది . దూడ జాడ లేదు .

ఆ నలుగురూ, మొగుడూ , పెళ్ళాం , చంకలో వున్న చిన్న పిల్లా , ఆవుతో సహా సురక్షింతంగా దాక్కుని వున్నారు .. అంతా చిత్త చీకటి . చంకలో వున్న పిల్ల ఏడుపు లంకించుకోగానే రాత్రి పరచుకున్న నిశ్శబ్ద చీకటిలో మారుమ్రోగుతున్న డ్రమ్ము వాద్యంలా ప్రతిద్వనిస్తోంది . అదిరిపోయిన తల్లి పిల్ల నోటిని తన చేత్తో మూసేసింది . మరింత రక్షణ కోసం మొగుడు పెళ్ళాంపై దుప్పటి కప్పేశాడు .

కొద్ది నిమిషాలు గడిచాయి . హటాత్తుగా దగ్గరలోనే దూడ అరుపు వినిపించసాగింది . అది విన్న ఆవు కూడా ప్రత్యుత్తరంగా అరవటం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ఆవుని  నిశ్శబ్దంగా వుంచడానికి ప్రయత్నించినా వారి వల్ల కాలెదు.

ఆ శబ్దాలు వీళ్లను వెతుకుతున్నవాళ్లను సచేతుల్ని చేసాయి.  తమను వాళ్ళు త్వరలో కనుక్కుంటారని అర్థమయ్యింది. కొద్ది దూరంలోనే దగ్గరవుతూన్న వాళ్ళ అడుగుల చప్పుడు  వినిపిస్తోంది. అలాగే వాళ్ళ చేతుల్లో వెలుగుతున్న టార్చి లైట్లు విరజిమ్ముతున్న వెలుగు కూడా కనిపిస్తోంది.

“ఈ పశువుని ఎందుకు మన కూడా లాక్కొచ్చావు !” అని ఆమె మొగుడిని కోపంగా అడిగింది.


పీక తెగ్గోసేయ్

రైలు ప్లాటుఫారంపై ఆగి వుంది.

తుపాకీలతో ముగ్గురు వ్యక్తులు ప్లాటుఫారం  మీదకు వచ్చి ప్రయాణీకులతో “ఎవరయినా టర్కీ వున్నాడా ?” అని అడిగారు.

“లేరు”   అని జవాబు వచ్చింది. ఒక ప్రయాణికుడు మాత్రం ఎదో చెప్పబోయి మళ్ళా మనసు మార్చుకుని మౌనంగా వుండిపోయాడు.

కొన్ని నిమిషాలు గడిచాయి. హఠాత్తుగా  కత్తులు పట్టుకున్న నలుగురు వ్యక్తులు కంపార్టుమెంటు కిటికీల్లోంచి తొంగి చూస్తూ “ఎవరయినా టర్కీ లోపల వున్నాడా ?” అని అడిగారు. ఇంతకు ముందు మౌనం వహించిన ప్రయాణికుడు  “నాకు తెలియదు. బహుశా మీరు మరుగుదొడ్లో చెక్ చెయ్యొచ్చు ” అన్నాడు.

ఆ నలుగురూ లోపలికి వచ్చి మరుగుదొడ్డి తలుపు పగలగొట్టి “టర్కీ “ని ఇవతలకు తీసుకు వచ్చారు. ఆ నలుగురిలో ఒకడు “వాడి పీక తెగ్గోసేయ్” అన్నాడు. ఇంకొకడు “మీకేమైనా పిచ్చి పట్టిందా ? ఇంతమంచి రైల్వే భోగీని అపరిశుబ్రం చెయ్యడం ఎమైనా బాగుందా ! ప్లాటుఫారం పైకి తీసుకెళ్ళి పీక తెగ్గోసేయ్ ” అన్నాడు.

*

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

3 comments

Leave a Reply to ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ . Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గల్పికపిట్టలు చిన్నవే అయినా కూతలు చాలా ఘనంగా ఉన్నాయండీ.

    • మంటో గల్పికలన్నీ అలాంటివే వంశీ గారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు