హఠాత్తుగా నువ్వొచ్చావు
సంచిలో కాస్త వెలుగును మోసుకొచ్చి
కానుక చేసావు
పాత కలలను మంత్రించి చల్లావు
మోహపరచావు
మైమరపించావుఇన్నాళ్ళూ ఏమైపోయావని
నేనడగలేదు
నేనేం చేసానని
నువ్వూ ప్రశ్నించలేదుచేజారిపోయిన జీవితాన్ని తడుముకోవడం
మళ్ళీ తుపానులలో తడిసిపోవడం
అనవసరమనుకున్నాం
అక్కర్లేదనుకున్నాంచెదలు తిన్న పుటలను పక్కకు పెట్టి
అల్లరి అలలై
ఎగసిపడ్డాం
రంగులను చల్లుకుంటూ
సీతాకోకలై ఎగిరిపడ్డాంనేటికీ
నీలో నాలో సజీవమై
అదే నది
లోలోపల నిశ్శబ్దంలోంచి
పూలు పూస్తూ
అదే హృదిబ్రతుకు చీకటిలో
మసిబారిన వాటిని
తుడిచి శుభ్రపరచి
గుండెలకు
ప్రేమగా హత్తుకుని మురిసిపోయాంచాలా రోజుల తరువాత
జ్ఞాపకాలలోకి కాసేపు అంతర్ధానమైపోయి
దుఃఖాలను ఆరబెట్టుకుంటూ
విడిపోయిన ముక్కలను అతుక్కుంటూ
నువ్వూ నేనూ*
4 comments
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
- కె.కె. రామయ్య on నీళ్లు…నీళ్లు..తెలంగాణ విముక్తి ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి 1960 నాటికి అన్నట్లు...
- చైతన్య పొడిపిరెడ్డి on యుద్ధ క్రీడచాలా చక్కగా వ్రాసారు.నేను చదువు వున్నప్పుడు అంతా నాకాళ్ళు ముందు జరిగినట్టు...
- సురేష్ పిళ్లె on ఇంకా చాలా వెలితి వుంది సాహిత్యంలో!‘‘రోజూ రాయడం వల్ల నీ అంతరంగం మరింత సృజనశీలంగా మారుతుంది. రోజూ...
- Dr K Rajender Reddy Kotha on నీళ్లు…నీళ్లు..ఇది మాఊరు కథ లాగే వుంది చందుగారు. మహబూబ్ నగర్ జిల్లాలో...
- హుమాయున్ సంఘీర్ on నీళ్లు…నీళ్లు..రైతుగోసను కండ్లకు కట్టిన వ్యథాభరిత, వాస్తవ కథ. చదువుతుంటే జీవితం కనిపిచ్చింది...
- m srinivasa rao on నీళ్లు…నీళ్లు..కథ బాగుంది సర్... పేదలు... నీళ్లు కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు...
- Lakkireddy Tirupalreddy on నీళ్లు…నీళ్లు..నీళ్లు లేకపోయినా నీళ్లు ఉన్న కూడా వ్యవసాయం దళారుల చేతిలోనే, రైతుకు...
- Gosukula Veeranna on నీళ్లు…నీళ్లు..ప్రస్తుత రైతుల పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు రాశారు కథ. చాలా బాగుంది....
బావుంది పద్మావతి గారు
Thank you Phani Madhavi garu
సూపర్ 👌👌👌👌👌💐💐💐💐💐💐
Thank you Sir