హఠాత్తుగా నువ్వొచ్చావు
సంచిలో కాస్త వెలుగును మోసుకొచ్చి
కానుక చేసావు
పాత కలలను మంత్రించి చల్లావు
మోహపరచావు
మైమరపించావుఇన్నాళ్ళూ ఏమైపోయావని
నేనడగలేదు
నేనేం చేసానని
నువ్వూ ప్రశ్నించలేదుచేజారిపోయిన జీవితాన్ని తడుముకోవడం
మళ్ళీ తుపానులలో తడిసిపోవడం
అనవసరమనుకున్నాం
అక్కర్లేదనుకున్నాంచెదలు తిన్న పుటలను పక్కకు పెట్టి
అల్లరి అలలై
ఎగసిపడ్డాం
రంగులను చల్లుకుంటూ
సీతాకోకలై ఎగిరిపడ్డాంనేటికీ
నీలో నాలో సజీవమై
అదే నది
లోలోపల నిశ్శబ్దంలోంచి
పూలు పూస్తూ
అదే హృదిబ్రతుకు చీకటిలో
మసిబారిన వాటిని
తుడిచి శుభ్రపరచి
గుండెలకు
ప్రేమగా హత్తుకుని మురిసిపోయాంచాలా రోజుల తరువాత
జ్ఞాపకాలలోకి కాసేపు అంతర్ధానమైపోయి
దుఃఖాలను ఆరబెట్టుకుంటూ
విడిపోయిన ముక్కలను అతుక్కుంటూ
నువ్వూ నేనూ*








బావుంది పద్మావతి గారు
Thank you Phani Madhavi garu
సూపర్ 👌👌👌👌👌💐💐💐💐💐💐
Thank you Sir