సైఫ్ జీ, అసలు మీకు దేశభక్తి ఉందా?

సైఫ్ జీ, అసలు మీకు దేశభక్తి ఉందా?
జర్మన్ షెపర్డ్, చైనా (పగ్ – Pug) ,
స్కాట్లాండ్ ,గోల్డెన్ రిట్రీవర్,
లాబ్రడార్ రిట్రీవర్ ,
ఇంగ్లాండ్ (బీగల్) గర్వంగా పెంచుకుంటూ,
మీ తాతల కాలం నుంచి
ఈ ఊరిలో పుట్టి , డొక్కలు ఎండిపోతున్నా కానీ
విదేశాలకు పరిగెత్తని
కుక్కల గురించి
మున్సిపాలిటీలకు కంప్లైంట్ ఇస్తారా?
ఇదేం న్యాయం సార్?

 

సైఫ్ జీ, అక్కడక్కడ పిచ్చికుక్కలు కొంతమంది
మనుషుల్ని కరుస్తున్నాయని
కుక్కజాతినే విమర్శిస్తూ
కుక్కల్ని ఇళ్ళల్లో ప్రేమగా పెంచుకోవడం
మానేస్తున్నారా?
అన్నిటికి అందరినీ జనరలైజ్ చేయకండి సార్.

సైఫ్ జీ, కుక్కలు విశ్వాసానికి మారు పేరు అని
కుక్కల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ
అదే కుక్క పేరుని కృతజ్ఞత లేని
ఎదుటివారిని కించపరిచే ఉద్దేశంతో
“ఆరే కుక్క అని” ఒక తిట్టుగా వాడే
Double Standards Hypocrisy గోప్ప మనుషుల
మధ్య మనం ,కుక్కలు బతుకుతున్నాం సార్. ఏం చేస్తాం?!

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

సైఫ్ అలీ సయ్యద్ గోరే

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.