ఇవాళ ఒక కొత్త పద్యం చదివాను
– అఫ్సర్
*
ఇంక ఈ మంచుగోడల మధ్య
ఒక్క వెచ్చని ఊపిరీ వినిపించదనుకున్నప్పుడు
తెలియని ఏదో దిక్కు నుంచి
ఎవరిదో ఒక పద్యం పరుగుపరుగున వచ్చేస్తుంది.
అప్పుడెలా వుంటుందీ?!
ఎంత మంచుకొండైనా
చిటికెన వేలితో తుడిచేయచ్చన్న
విశ్వాస దీపం వెలిగిపోతుంది చీకటి గుండెనిండా-
అనుకుంటాం గానీ
నిజానికి ఏ గుండే మరీ అంత చీకటి గుహ కాదేమో!
అనుకుంటాం గానీ
నిజానికి ఏ గోడ అయినా మరీ అంత దుర్భేద్యం కాదేమో!
మూసుకుపోయిన తలుపుల దగ్గిర
ఎన్నాళ్ల తరవాతో వినిపించే అడుగుల సంగీతమో
వొట్టిపోయిన పదాల ఖాళీ చేతుల్లో
ఒకానొక నిండుపద్యమో
దరిదాపుల్లోనే వుంటాయి
చేతులు అసహనంతో వెనక్కి ముడుచుకుపోనంత కాలం!
आज मैं ने एक नई कविता आजमाई है!
~~
अब आगे इन बर्फीली दीवारों की दरारों में से
कवोष्ण श्वासोच्छवासों के भरने की आवाज सुनाई नहीं देनेवाली है
सोचते हो तो
किसी अनजान दिशा में से
किसी अज़नबी की कविता
सरपट दौड़ आन पड़ती है
ऐसे में कैसे लगता है?!
ऐसे में ऐसा लगता है कि
बदहवासी जितनी भी गहरा जाए
उसे बाएं हाथ से दूर पटका दिया जा सकता है !
स्याह अंधेर कलेजे में विश्वास का दिया दिपदिपा जाता है!
मान बैठते तो हैं पर,
वाकई कोई कलेजा इतना अंधेर गुफा नहीं होता
मान बैठते तो हैं पर
वाकई कोई दीवार इतनी मजबूत नहीं होती जिसे
गिराया नहीं जा सकता!
बंद दरवाजे के पास
अरसों बाद सुनाई देनेवाले पैरों की छन – छन
बिसुखे जुमलों के छूँछे हाथों में
कोई कस- गढ़ी, भरी-पूरी कविता
आसपास ही कहीं मंडराती रहती है
जब तक आप हथियार नहीं डाल देते!
*








Add comment