సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
కథలోపలి కథసంచిక: 1 నవంబర్ 2018

ఎపిఫనీ కథా విధానం

గుంటూరు లక్ష్మి నర్సయ్య

కథలో ప్రధాన పాత్రకు కలిగే అదాటు కనువిప్పుతో లేక అనుకోని జ్ఞానోదయంతో ముగించే నిర్మాణపద్దతికి సంబంధించి సొదుం జయరాం, చాసోల కథల్ని పరిశీలించాం. కథలోని పాత్రల స్వభావం  గురించీ, ప్రవర్తన గురించీ లేక సన్నివేశాలగురించీ కలిగే మెరుపు ఎరుకను నిర్మించే ఈ పద్ధతి మూలాలు James Joyce కథల్లో ఉన్నాయ్. Katherine Mansfield  మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది.

James Joyce తన కథల్లో తాను పాటించిన  ఈ టెక్నిక్ ని epiphany అని పిలిచాడు. దాన్ని గురించి తనే ఇలా చెప్పాడు. A moment of insight, discovery, or revelation by which a character’s life is greatly altered. This generally occurs near the end of the story. కథ  చివర ఇతరులెవరో మాట్లాడుకునే మాటల్ని విన్నప్పుడు ప్రధాన పాత్రకు కలిగే తటాలు కనువిప్పు, తక్షణ జ్ఞానోదయం  మొత్తం కథను తిరిగి నిర్మించటంలోనే ఈ కళా రహస్యం ఉంది. అందుకే దీన్ని A sudden spiritual manifestation in overheard fragments of conversation అని కూడా చెబుతాడు Joyce.
Joyce రాసిన కథల్లోAraby , The Dead అనే కథలు  గొప్ప కథలు. Araby లో ఒక టీనేజ్ బాలుడికి కథ  చివరిలో కలిగిన ఎరుక ఇతివృత్తం.
తన స్నేహితుడి అక్కను చూసి ఆకర్షితుడైన ఈ అబ్బాయ్ రోజూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె తనతో మాట్లాడిన ప్రతిసారీ మైమరుపుకు గురవుతాడు. ఒక రోజు ఆమె పలకరించి Araby అనే మార్కెట్ బజారు చాలా బాగుంటుందని చెబుతుంది. అతన్ని అక్కడకు వెళ్లి చూడమంటుంది. తను రాలేనని చెబుతుంది. ఇంట్లో అనుమతి పొంది ఆ అమ్మాయికి ఏదన్నా గిఫ్ట్ కొందామనే ఆలోచనతో ఈ అబ్బాయ్ araby వెళతాడు. అక్కడ ఒక షాప్ లోకి వెళతాడు. సేల్స్ గాళ్ తనను పట్టించుకోకుండా వేరే ఇద్దరు కుర్రవాళ్ళతో ఏవో కవ్వించే మాటలు మాట్లాడుతుంది .
ఆ సంభాషణ విన్న ఈ బాలుడు ఒక రకమైన ఉద్వేగానికి లోనౌతాడు. కోపం , అవమానం తో మండిపోయి ఎదో జ్ఞానోదయమైనట్లుగా వచ్చిన పని కూడా మరిచి ఇంటిదారి పడతాడు. ఆ కొత్త ఎరుకలో తాను అప్పటివరకూ ఇష్టపడుతున్న అమ్మాయి పట్ల  ఆకర్షణ కూడా మాయమౌతుంది. ఈ epiphany విధానాన్నే ‘చెదపురుగు ‘కథలో మరింత సృజనాత్మకంగా వాడాడు సొదుం జయరాం. కథ  ముగింపులో శేషమాంబ చెప్పిన మాటలు విని కథకుడు ఎంత దిగ్భ్రమ చెందుతాడో మనకు తెలిసిందే. అలాంటి దిగ్భ్రమ
పాఠకులకి కలిగించటంలోకూడా జయరాం సఫలీకృతుడయ్యాడు.
Katherine Mansfield రాసిన Miss Brill కథలో ఒక వృద్ధురాలికి కలిగిన అనుభవం ఇలాంటి దిగ్భ్రమకు చెందిందే. ఆదివారం పార్కులో జరిగే వేడుకలో పాల్గొనడానికి చక్కగా ముస్తాబై తనకున్న ఫర్కోట్ తొడుక్కుని వెళుతుంది. అక్కడి యువతీ యువకుల్నీ, సంగీతాన్నీ , దృశ్యాల్నీ  ఆనందిస్తుంది. ఆ సమయంలో తనపక్కనున్న ఇద్దరు ప్రేమికులు  తమ గోప్యతకు ఆమె అడ్డు వచ్చినట్లుగా మాట్లాడుకోవడం వింటుంది. ఆమెని, ఆమె తొడుక్కొచ్చిన కోటునీ ఏహ్యంగా చూస్తారు. ముసలిదానికంత అవసరమా అన్నట్లు మాట్లాడుకుంటారు.
Why does she come here at all– who wants her? Why doesn’t she keep her silly old mug at home ?
It’s her fur coat which is so funny,  It’s exactly like a fried whiting
Ah, be off with you
ఇలా సాగిన ప్రేమికుల సంభాషణ  వృద్ధురాలి మనఃస్తితిని పూర్తిగా మార్చుతుంది.
తనలాంటి వాళ్ళను యువత ఇలా చూస్తుందనే కొత్త స్పృహ ఆమెను అశాంతిపాలు చేస్తుంది. కలచి వేస్తుంది. ఇంటికెళ్లి మ్రాన్పడుతుంది. సరిగ్గా ఇదే స్థితిని’ వాయులీనం’
కథలో రాజ్యం ఎదుర్కొంటుంది. తనన్నా తన అభిరుచులన్నా తన భర్తకున్న చిన్న చూపు తన ఫిడేలును ఆయన అమ్మివేసినప్పుడు ఆమెకు అర్ధమౌతుంది. ఈ కథలో ముగింపు సంభాషణ ఉండదు. రాజ్యం తనలో తాను మాట్లాడుకోవడం ద్వారా తన మెరుపు ఎరుకను బయటపెడుతుంది.   చాసో గొప్ప గుప్తతతో కధను నడిపి ముగింపులో పాఠకుల మతి పోగొడతాడు.
ఇలా James Joyce  పరిచయం చేసిన ఎపిఫనీ ని మన కథకులు మరింత ప్రతిభావంతంగా వాడిన  ఉదాహరణలు చాలా వున్నాయ్.
*

గుంటూరు లక్ష్మి నర్సయ్య

View all posts
క్రాస్ రోడ్స్…
కథలో మన ప్రత్యేకత ఎక్కడ?!

2 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Padmapv says:
    February 25, 2019 at 10:44 am

    కృతజ్ఞతలు, తెలియని విషయం , గురించి, వివరణ.బాగాచెప్పారు. Sir!

    Reply
  • Padmapv says:
    March 30, 2019 at 11:28 am

    మీ, విశ్లేషణ బాగుంది, sir, వాయులీనం, నాకు బాగా నచ్చిన కధ. మిగతావి, ఇప్పుడే chadivanu. కృతజ్ఞతలు. మీకు !

    Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

ఎన్ని ఆటంకాలున్నా ఈ ప్రయాణం ఆగదు

బండ్ల మాధవరావు

పిండారస్ గ్రంథాలయం

విరించి విరివింటి

ఊరి నేపథ్యంలోనే మరి రెండు నవలలు: సిధారెడ్డి

జయప్రకాష్

పల్లె వెతల బరువుల దరువులు

కె.రామచంద్రా రెడ్డి

ఒకానొక కాలంలో…

అరిపిరాల సత్యప్రసాద్

హుండి

సంజయ్ ఖాన్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • Siddhartha on హుండిసంజయ్ అన్న.. Nice story
  • Virinchi Virivinti on పిండారస్ గ్రంథాలయంThank you Sir
  • Azeena on హుండిగల్ఫ్ దేశాలలో డబ్బు సంపాదించడం ఒక వ్యధ ఐతే.. ఆ డబ్బుని...
  • హుమాయున్ సంఘీర్ on హుండికథ చదివి కళ్ళు చెమ్మగిల్లాయి భాయ్. దుబాయ్ నుంచి ఇండియాకు డబ్బులు...
  • Swaroop on వెంకటేశ్వరోపాఖ్యానంChala bagundi karthik garu
  • Nagabhushanam Sunkara on ఎన్ని ఆటంకాలున్నా ఈ ప్రయాణం ఆగదుGreate Efforts Keep it up
  • మహమూద్ on పిండారస్ గ్రంథాలయంచాలా లోతైన ఆలోచనలు ఉన్న రచన ఇది. కథ నాకు పూర్తిగా...
  • వనజ తాతినేని on యుక్రేనియన్ యుద్ధ కవిత : అడగాలనే అనుకుంటున్నా!ఏమిటో చాలా దిగులుగా వుంది. ఈ కవిత్వం చదవటం వెలుగే! Thank...
  • కృష్ణుడు on చిన్న పత్రికల పెద్ద దిక్కు!ధన్యవాదాలు సార్
  • Pavani Reddy on హుండిHundi is a story about those who are effecting...
  • పద్మావతి రాంభక్త on షేప్ ఆఫ్ ది మ్యూజిక్What a writeup! Fell in love with the jungle...
  • పల్లిపట్టు on యుక్రేనియన్ యుద్ధ కవిత : అడగాలనే అనుకుంటున్నా!ఆన్నా అద్భుతమైన కవిత.హృదయాన్ని మెలిపెట్టిన వాక్యాలు
  • రేవా నాగానంద్ on పాడ్ థాయ్ నుండి నాంగ్ నూచ్ వరకూ… బాగుంది. Naangnooch ను మళ్ళీ చూసిన అనుభూతి కల్గింది. భారత్ లో...
  • Mani Vadlamani on షేప్ ఆఫ్ ది మ్యూజిక్Mani Vadlamani
  • Mokka Vinod Kumar on పకీరమ్మ ప్రమాణ స్వీకారంఅవును సార్…నిజ జీవితంలో కూడా అటువంటి మనుషులు చరిత్ర సృష్టించాలి…Thanks for...
  • Vinod Kumar Mokka on పకీరమ్మ ప్రమాణ స్వీకారంఅవును సార్...నిజ జీవితంలో కూడా అటువంటి మనుషులు చరిత్ర సృష్టించాలి...Thanks for...
  • hari venkata ramana on ఒకానొక కాలంలో…Baagundi..good analysis and example. Thank you.
  • Jayasree Atluri on షేప్ ఆఫ్ ది మ్యూజిక్Intoxified by music!!!
  • రాయదుర్గం విజయలక్ష్మి on దక్షిణాంధ్ర దారి దీపాల వెలుగుధన్యవాదాలు సార్..
  • చల్లా రామ ఫణి on చిన్న పత్రికల పెద్ద దిక్కు!ఆచార్యగారి ప్రేరణతో మీ ప్రత్యక్షరాన్ని ఆయుధం చేశారు సార్! ఆచార్యగారిని అపూర్వంగా...
  • Kcubevarma on ఆ తల్లి కన్నీళ్ళుఉద్యమ స్ఫూర్తినీ నిండుగా అందిస్తూ విప్లవ నాయకుడు అమరుడు కామ్రేడ్ హిడ్మాకు...
  • Kcubevarma on అడవి ఊళ్ళోకొస్తుందా?!మంచి విశ్లేషణ sir. అభినందనలు
  • Dr K. Purushotham on షేప్ ఆఫ్ ది మ్యూజిక్తేనె వల్ల రక్తం లోని షుగర్ విపరీతంగా పెరుగుతుంది.35 యేళ్లు దాటాక,...
  • గిరి ప్రసాద్ చెలమల్లు on పకీరమ్మ ప్రమాణ స్వీకారంపకీరమ్మ చరిత్ర ను తిరగ రాసింది
  • గిరి ప్రసాద్ చెలమల్లు on షేప్ ఆఫ్ ది మ్యూజిక్nice write up
  • గిరి ప్రసాద్ చెలమల్లు on నాన్నా..పులిముగింపు superb విద్యా వ్యవస్థ లోపాలను ఎండగట్టింది భావోద్వేగాలదే పైచేయి
  • Satyanarayana Devabhaktuni on నాన్నా..పులి“సన్ ఆఫ్ సత్యమూర్తి” సినిమాలోని చిన్న సన్నివేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో...
  • డా. నాగసూరి వేణుగోపాల్ on దక్షిణాంధ్ర దారి దీపాల వెలుగుసాధ్యమైనంతలో డా రాయదుర్గం విజయలక్ష్మి గారు సమగ్రంగా సమీక్షిస్తూనే సంపాదకుల ఆలోచనలతో...
  • Reddy on గోడల్ని బద్దలు కొట్టే ఫెస్టివల్ “సమూహ”Well written Best wishes -sec garu
  • chelamallu giriprasad on రాధకృష్ణ కర్రి కవితలు రెండుBaavunnaayi kavithalu rendoo Narakabadda chettu chivari veru nemmadigaa shwaasisthundi....
  • Raghu on అల్కాపురి గార్డెన్స్ లో…  ఢాంNice story sir 👏👏👏
  • Syamala Kallury on Our Year in TranslationThis is what is missing in Indian translation arena....
  • Khalil on దేవమాతBrilliant story bro.. 👏
  • వనజ తాతినేని on క్రాస్ రోడ్స్ ధన్యవాదాలు అండీ
  • పాలగిరి విశ్వప్రసాద్ on సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్సాహిత్యంలో మరో ఖాళీని కొద్దిగానైనా పూరించగల సంకలనం. మంచి ప్రయత్నం.
  • Venu on సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్Will buy and read it
  • Devi on సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్మన సమాజం క్వియర్ కమ్యూనిటీపై చూపే వివక్షను చాలా స్పష్టంగా చెప్పారు....
  • Palagiri Viswaprasad on క్రాస్ రోడ్స్ కథా వస్తువు బాగుంది. అభినందనలు వనజగారూ!
  • Prem Chand Gummadi on Writing has always been a quiet space….Excellent article.
  • Suresh on సంచులుమంచి కథ సార్ చాలా బాగుంది
  • సాయి ప్రసాద్ on దేవమాతఅద్భుతంగా రాశారు అండీ.. కళ్ళు చెమర్చాయి..
  • hari venkata ramana on ఈ మడిసి నాకు తెలీదుప్రస్తుతకాలపు ఇంటింటి కథ, బాగుందన్న. అభినందనలు.
  • Khalil on ఎర్ర సైకిల్సరిగ్గా చెప్పారు. ఆ జ్ఞాపక విలువే కథలో నాకు ముఖ్యమైనది.
  • Rohini Vanjari on రైల్లో …కొన్ని దృశ్యాలుఆకలి తో తిరిగే బొద్దింక కి మనిషికీ తేడా లేదు అండి....
  • Rohini Vanjari on రెక్కల వాకిలిరాతి కత్తి లాగా దిగబడిన చేదు కాలం.. వీడ్కోలు తర్వాత మరోక...
  • Rohini Vanjari on ఒక రాత్రంతా… ఊరికే..నిజమే... ఊరుని, వీధులను, బాల్యపు జ్ఞాపకాలను రాత్రి పూట నే చూడాలి....
  • Kcubevarma on వాక్యం నదిలా ప్రవహించాలిThank you Sir
  • Roseline kurian on Writing has always been a quiet space….The very last paragraph of the above interview,I felt...
  • పాలగిరి విశ్వప్రసాద్ on మరణశయ్యపై నుండి ప్రేమలేఖ!Thank you
  • పాలగిరి విశ్వప్రసాద్ on మరణశయ్యపై నుండి ప్రేమలేఖ!నిజమే, ఆ కథ రాసే నాటికి నా మీద చలం శైలి...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు