అనివార్య కారణాల వలన అమ్మ ఇండియాలో వుండిపోయారు. అమ్మతోపాటే నా మనసూ నన్ను వదిలి అక్కడే వుండిపోయింది. కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో వంటమనిషి స్వచ్చందంగా పని మానేసి నా మనసు అల్లకల్లోలం చేసేసింది. అమ్మకు ముద్ద వండే మనిషి మళ్ళీ కుదిరే వరకూ నా గొంతులో ముద్ద దిగలేదు. నా తపనకు చలించిన అమ్మ “ఈ ముసలిప్రాణం కోసం ఒక వంట మనిషి, ఒక పని మనిషి, నెలనెలా రేషను, తోడుగా మరో కుటుంబం… ఇన్ని ఖర్చులు అవసరమా… నన్ను ఏదయినా వృద్దాశ్రమంలో చేర్చేయి” అన్నారు. శరీరంపై దెబ్బల దుఖాఃన్ని భరించటం సుళువే కాని మనసుపై మాటలు చేసే గాయాన్ని మోయటం కష్టం. నా వైవాహిక జీవితంలో మాటలు మనసును కోసిన సందర్భాలెన్నో. అయితే అమ్మ మాటలు అవేవీ కలిగించనంత అలజడిని రేపాయి. ముందే డెమెన్షియాతో బాధపడుతున్న అమ్మ నోటంట ఆ వాక్యాలు నన్ను నిలువునా కుదిపేశాయి. అమ్మను వృద్ధాశ్రమంలో ఊహించేకొద్దీ మనసు అతలాకుతలమై కన్నీటి ప్రవాహమై కరిగింది. నిద్ర పట్టని ఆ రాత్రి కలిగిన పిచ్చి పిచ్చి ఆలోచనలే ఈ కథ ఆవిర్భావానికి మూలం.
పడక కుర్చీలో వెనక్కి వాలి పసిపిల్ల నిద్రకు జోగుతున్నట్టుగా కునికిపాట్లు పడుతున్న మణమ్మ ఏదో గుర్తుకొచ్చినట్టు నడుం గబుక్కున నిటారుగా చేసి అప్రమత్తమయ్యింది. ఏదో విలువైన వస్తువు పోగొట్టుకున్నట్టుగా తన కాళ్ళ పక్కన రెండు వైపులా చూసింది. కలవరపాటుగా గది మొత్తం కలయచూసింది.
దిగులు వేసింది.
బ్రూనో జాడలేమీ లేవు. బ్రూనో మళ్ళీ వీధిలోకి పారిపోయి వుంటాడు.
రోజుకు ఎన్నిసార్లు పారిపోతాడో… తానెన్ని సార్లు వెతికి పట్టుకోవాలో…
రాణిని తోడు రమ్మన్నప్పుడల్లా గొడవే… అయినా సరే తనకు తప్పదు…
ఛ… మాగన్నుగా కునుకు పట్టేసింది.
వెధవ పారిపోయి ఎంతసేపయ్యిందో… వాడికి ఈపాటికి ఆకలి వేస్తుండాలి.
మణమ్మ పక్కనే నేల మీద వున్న చేతి కర్ర అందుకుని కష్టపడి లేచింది. చెప్పుల కోసం గోడవారా చూసింది.
చెప్పులు కనిపించాయి. వాటి పక్కనే చెక్కబల్ల వుంది.
ఫరవాలేదు కూర్చుని చెప్పులు వేసుకోవచ్చు. నెమ్మదిగా నాలుగడుగులు నడిచి వెళ్ళి బల్ల పైన కూర్చుంది.
చేతికర్రతో చెప్పులను కాళ్ళ ముందుకు లాక్కుంది. ముందు ఎడం కాలికి చెప్పు తొడుక్కుంది. చాలా కష్టంగా ఎక్కింది. కుడి చెప్పేమీ తీసిపోలేదు. అంతకన్నా ఎక్కువే బాధపెట్టింది మణమ్మను.
చెప్పులు ఈ మధ్య తనను చాలా కష్టపెడుతున్నాయి. తన ముసలితనాన్ని వెక్కిరిస్తున్నాయి.
తను చెప్పులు వేసుకోవటానికి కష్టపడటం, తన చాతకానితనం ఎవరూ చూడలేదు కదా. చుట్టూ పరికించి చూసింది మణమ్మ.
ఎవరూ లేరు. హమ్మయ్య తనను ఎవరూ చూడలేదు.
చేతికర్ర సాయంతో రూము దాటి బయటకు వచ్చింది.
చాలా పొడవుగా పెద్దగా వుంది హాలు. మణమ్మకు ఒక్క క్షణం అగమ్యగోచరంగా అనిపించింది. ఎక్కడ వున్నదీ అర్ధం కాలేదు. మణమ్మ తిరణాలలో తప్పిపోయిన పసిపిల్లలా బితుకు బితుకుమంటూ చుట్టూ కలయ చూసింది.
రాణి ఫర్నిచర్ మొత్తం అటు ఇటు మార్చినట్టుంది. రాణి ఇంటిని ఎప్పుడూ ఒకేలా ఉంచదు. అందుకే కామోసు ఇల్లంతా కొత్తగా అనిపిస్తోంది. అయినా కూడా సుపరిచితంగానే వుంది. కొంచం దూరంలో అటు తిరిగి కుర్చీలో కూర్చుని మొహం పుస్తకంలో దూర్చేసి రాణి ఏదో చదువుకుంటున్నట్టుంది.
“అమ్మాయ్ రాణీ, మళ్ళీ బ్రూనోగాడు పారిపోయాడే… కాస్త సాయం రామ్మా. ఆ వీధి చివర దాకా వెళ్ళి వద్దాము…”
కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న సారా ఇటు తిరిగింది.
తేరిపార మణమ్మ వంక చూసింది.
మళ్ళీ ఎడం కాలి చెప్పు కుడి కాలికి, కుడి కాలి చెప్పు ఎడం కాలికి తొడుక్కుంది మణమ్మ. సారా నిట్టూర్చింది.
ఈ వృద్దాప్యమూ, మతిమరుపు రేపు తనకూ తప్పవేమో…
“నేను రాణిని కాదoడీ… నా పేరు సారా. మీ కేర్ టేకర్ ను. ఇది మణినిలయం కాదు… వృద్ధ సేవాశ్రమం. ఇక్కడ మీ పెట్ డాగ్ బ్రూనో లేడు…” చాలా మృదువుగా స్పష్టంగా చెప్పింది సారా.
మణమ్మ అక్కడ చేరి వారం అవుతోంది.
ఈ వారంలో కనీసం యాభయ్ సార్లయినా బ్రూనో పారిపోయాడని వెతకాలని సారాకి చెప్పి వుంటుంది.
ఈ రోజు ప్రొద్దుటి నుండీ ఇది ఆరోసారి ఆమె అలా అనటం.
“ఓహ్ సారా… మరిచిపోయాను నువ్వు సారా కదూ… క్రితం ఏడాది నేను బ్రూనోని వాకింగ్ కు గాంధీ పార్కుకి తీసుకెళ్ళినప్పుడు కలిసావు కదూ. గుర్తొచ్చింది. సారా, మా బ్రూనో ఇంట్లో నుండి వెళ్ళిపోయాడమ్మా… కాస్త సాయంరా తల్లీ, నీకు పుణ్యముంటుంది…” ఎంతో దీనంగా మొహం పెట్టి అడిగింది మణమ్మ.
సారా ఆమె వంక జాలిగా చూసింది.
ఇప్పుడు ఆమె మైండ్ ను బ్రూనో నుండి డైవర్ట్ చేయాలి.
ఏమో అనుకుంది గాని నిజంగా వృద్దుల ఆలనా పాలనా చాలా stressful ఉద్యోగమే.
ఒక్క క్షణం ఆలోచించి పక్కనే వున్న కుర్చీలో ఆమెను కూర్చో పెట్టి “ఈ న్యూస్ విన్నారా… కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదు మహానగర పారిశ్రామిక అభివృద్ధి మేరకు ఒక కమిటీని నియమిస్తున్నాడట…” అంది.
సారా చెప్పే విషయం పూర్తి కాకుండానే మణమ్మ “ఎంత తెలివితక్కువ పిల్లవమ్మా నువ్వ్వు… ఏదైనా చదివేటప్పుడు కనీసం బుర్రయినా ఉపయోగించు… నీకసలు లోకజ్ఞానం బొత్తిగా లేదు… కల్వకుంట్ల ఏమిటి నందమూరి… నందమూరి తారక రామారావు… ఆ మాత్రం కూడా తెలియదా… ఈ కాలం పిల్లలకు కరంట్ affairs ఏమీ తెలియవు…”
ఓ గాడ్… మణమ్మ మైండ్ పాతికేళ్ళ వెనక్కి వెళ్ళినట్టుంది… ఆమెతో ఇప్పుడు వాగ్వివాదాలు చేసేంత ఓపిక లేదు. చర్చ అనవసరం.
“బాబోయ్ మీ పొలిటికల్ నాలెడ్జి ముందు నేను పనికి రాను కానీ, ఈ పజిల్ ఆడదామా…” అడిగింది సారా.
మణమ్మ మొహం మీద గర్వంతో కూడిన నవ్వు.
ఆమె మొహం నవ్వుతో వెలిగిపోవటం చూసిన సారాకి సంతోషమేసింది.
పజిల్ పేజీ తెరిచి పుస్తకం ఎదురుగా పెట్టింది.
మైండ్ గేమ్స్ ఆడిస్తే బ్రెయిన్ ఆక్టివ్ అయి అల్జీమర్స్ పెరుగుదల వేగం తగ్గుతుందేమోనని సారా ప్రయత్నం.
మణమ్మ హుషారుగా పెన్ను ఇమ్మంది. పెన్ను చేతిలో పట్టుకుని పజిల్ వంక చూస్తోంది. చిన్నప్పుడు ఇలాంటి మెదడుకి మేత వేసే పజిల్స్ చిటికలో చేసేది మణమ్మ. ఆమె క్షణాల్లో చెప్పే మైండ్ ప్రాబ్లెమ్స్ కి ఆమె స్నేహితులంతా విస్తుపోయేవాళ్ళు.
“నిలువు గడియల్లో ఆరు అక్షరాల పదం… ‘ఎఫ్’ తో ప్రారంభమవుతుంది ‘ఆర్’ తో ముగుస్తుంది. సువాసనలు వెదజల్లుతుంది. మధ్య రెండక్షరాలు ow…”
చెప్పమన్నట్టుగా మణమ్మ వంక చూసింది సారా.
ఒకప్పుడు పెద్దపెద్ద బిజినెస్ మీటింగ్స్ కి అధ్యక్షత వహించిన మణమ్మ దీర్ఘంగా ఆలోచిస్తోంది.
సారాకి ఆమె ఓడిపోవటం ఇష్టం లేదు.
“ఒక క్లూ ఇస్తాను… అది కొమ్మల పైన పూస్తుంది…”
మణమ్మ గడ్డం పైన చూపుడు వేలు పెట్టుకుని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ దీర్ఘమైన ఆలోచనలో పడింది.
సారా మరోసారి రెట్టించింది.
”చెట్ల పైన పూస్తుంది, సువాసనలు వేస్తుంది. ఆరక్షరాలు… f అనే అక్షరంతో మొదలౌతుంది… మధ్యన ow… ఆఖరున r వస్తుంది… కమాన్ మణమ్మా…”
“ఫ్రూట్…”
చిన్నపిల్లలా తనకు తానే మెచ్చుకోలుగా తప్పట్లు కొడుతూ అరిచింది మణమ్మ.
దీర్ఘoగా నిట్టూర్చింది సారా.
ఒక దశలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు అకస్మాత్తుగా పదాలు మరిచిపోవటం, అర్థవంతమైన పదాలు తట్టక ఒకదానికి మరొకటి పలకటం సహజమే.
“చెట్టంటే గుర్తుకొచ్చింది… కాస్త నా తులసి మొక్కకు ఓ చెంబెడు నీళ్ళు పోయమ్మా రోజూ. నా వయసయిపోయింది… నేను పోయలేకపోతున్నాను” ప్రార్దిస్తున్నట్లుగా అడిగింది మణమ్మ.
“మీరు వేరే చెప్పనవసరం లేదు. రోజు పోస్తున్నాను. మరో పజిల్ ట్రై చేద్దామా…” అడిగింది సారా.
“ఓ…” అంటూ తల అవునన్నట్టుగా ఊపింది మణమ్మ.
“నిలువు గడులలో తొమ్మిది అక్షరాలు… టి తో మొదలవుతుంది. దూరపు వస్తువులను చూడటానికి ఉపయోగిస్తారు… ఉదాహరణకి నక్షత్రాలను చూడటానికి గట్రా…”
నక్షత్రాలనే పదం విన్న వెంటనే మణమ్మకు చంద్రుడు గుర్తుకు వచ్చాడు.
ప్రశ్న ఏమిటన్న ఆలోచన లేదు.
అరక్షణం ఆలస్యం చేయకుండా “చంద్రుడు…” అoది మణమ్మ.
“కాదు… టెలీస్కోప్…”
సారా జవాబుకి చిన్నబుచ్చుకుంది మణమ్మ.
సారాకి బాధేసింది ఆమె చిన్న బుచ్చుకున్నందుకు.
అలాగే చిరాకూ వేసింది మరీ అసంబద్ధ జవాబుకు.
గేమ్ విసుగనిపించింది సారాకి.
తన పిచ్చి కాకపోతే మతిస్థిమితం లేనివారితో మైండ్ గేమ్స్ ఆడించటం ఏమిటి…
మణమ్మ పాదాలకున్న చెప్పులని తిరగేసి మార్చి లోపలికి తీసుకెళ్లింది. గోరు వెచ్చటి పాలతో ఆమెకు రెండు మాత్రలు వేసింది.
పాలు తాగుతూ మణమ్మ “చీకటి పడితే బ్రూనోగాడు ఇల్లు కనుక్కోలేడు. త్వరగా వెళ్ళి వాడిని తీసుకొచ్చేద్దాము…” అంది.
“వెలుతురుండగా అయితే వాడే వచ్చేస్తాడా…” అంటూ నవ్వుతూ ఆమెను పడుకో పెట్టింది సారా.
ఆమె ప్రశ్నకు మణమ్మ సారా వంక confused గా చూస్తూ నిద్రలోకి జారుకుంది.
* * * * * *
ఆ రాత్రి మణినిలయంలో రాణి, అమ్మ లేక బోసిపోయిన ఇంటిని ఓసారి పరికించి చూసింది. అనంతమైన అమ్మ ప్రేమను స్పర్షించని ఇల్లు ఇల్లులా లేదు… అవి వట్టి గోడలు మాత్రమే.
వెచ్చటి కన్నీరు చెంపల మీదుగా స్రవిస్తూండగా భారంగా నిట్టూర్చింది.
ఆ రోజు ఆదివారం. అమ్మను ఓల్డ్ ఏజ్ కేర్ లో వదిలి సరిగ్గా వారమయ్యింది.
అమ్మ లేని ఇల్లంతా బోసిపోయింది.
అమ్మతోనే ఇంటి కళ పోయింది.
అమ్మ నడిచేటప్పుడు నేలతో ఆమె చేతికర్ర వేసే తాళం తప్పిన ఇల్లు మౌనరాగాన్ని ఆలాపిస్తూ నిశ్శబ్దoగా రోదిస్తున్నట్లుంది.
ఇంటినేదో స్మశాననిశ్శబ్దమావహించినట్టుంది.
బ్రూనో అమ్మ ఖాళీ పడక కుర్చీ పక్కనే దిగులుగా కూర్చుని వున్నాడు. వాడి మొహంలో అమ్మ కోసం బెంగ స్పష్టంగా కనిపిస్తోంది.
ఎప్పుడూ కుర్చీలోనే కునికిపాట్లు పడే అమ్మ మొహం రాణి కళ్ళ ముందు కదలాడింది. మనసు కలుక్కుమంది. కళ్ళల్లో నీటి పొర చేరింది.
దూరంగా గుమ్మం బయట రోజూ అమ్మ నీళ్ళు పోసే తులసి మొక్క కన్నీటి పొర వెనుక మసకబారింది. తన కన్నీరే తులసిని మసకబార్చిందో లేక అమ్మ చేతి నీటి అభ్యంగనo కరువయి తులసి కన్నీరు మున్నీరై కరిగిపోయిందో… రాణి గుండె భారమైంది.
కుర్చీలోనే తల వెనుకకు వాల్చి కళ్ళు మూసుకుంది. కంటి చివర్లనుండి ధారగా కన్నీరు ప్రవహిస్తోంది. డాక్టరు సలహా మేరకే అమ్మను ఓల్డ్ ఏజ్ కేర్ లో చేర్చినప్పటికీ ఆమెను ఏదో గిల్టీ భావన నిలువునా కాల్చేస్తోంది.
అమ్మకు 24X7 పర్యవేక్షణ అవసరం. తనూ అరవైకు దగ్గరౌతోంది. మోకాలి చిప్పలు అరిగిపోయాయి. ఎక్కువగా నడిస్తే ఆయాసం. అయినా ఇటు మనుమల సంరక్షణ, ఇంటి పనుల భారం తప్పటం లేదు. అన్ని పనులతో పాటే అమ్మ పని అని సర్ది చెప్పుకున్నా ప్రాక్టికల్ గా కుదరలేదు.
బ్రూనో ఇంట్లో ఏ మూల వున్నా, అమ్మ బ్రూనో వీధిలోకి పారిపోయాడని ఎన్నిసార్లు రోడ్డు పైకి వెళ్ళిపోయిందో…
ఒకసారి చాలా పెద్ద ప్రమాదమే కొంచంలో తప్పింది.
అప్పటి నుండి తను బయటికి వెళ్ళినప్పుడల్లా అమ్మను ఇంట్లో వుంచి తాళం వేస్తుంటే ఆమెతో పెద్ద గొడవ.
ఆమెను మనిషిగా గౌరవించటం లేదని, జంతువును కటకటాలలో కట్టి పడేసినట్టు ఆమెను తన ఇంట్లోనే తనను బందీ చేసారని రభస.
అమ్మతోపాటు తనూ ఇంట్లోనే వుంటే జరగదు.
ఎల్లవేళలా అమ్మను వెంట పెట్టుకుని తిరగటం అంతకన్నా కుదరదు.
అమ్మను ఇంట్లో పెట్టి తాళం వేస్తే ఎవ్వరికీ మనశ్శాంతి వుంచదు.
ఈ పరిస్థితిలో డాక్టర్ల, శ్రేయోభిలాషుల సలహా మేరకే అమ్మను గత ఆదివారం వృద్ధ సేవాశ్రమంలో వదిలి వచ్చింది.
బాగా వాకబు చేసి ప్రేమపూర్వక సేవలందించే, స్వంత ఇంటి ఆత్మీయతానురాగాలు పంచే మంచి సేవాశ్రమం అని ప్రశస్తి గాంచిన వివేకానంద సేవాశ్రమంలో చేర్చింది.
ఆశ్రమంవాళ్ళు ఒక వారం రోజులపాటు తనని రావద్దని, అమ్మకు అలవాటు పడే అవకాశమిమ్మని అభ్యర్ధించారు. ఏమైనా అవసరమైతే వాళ్ళే కాల్ చేస్తామన్నారు.
వాళ్ళుగా ఫోన్ చేయలేదు. తను చేసినప్పుడల్లా అమ్మ బావుందని చెప్పారే కాని అమ్మతో మాట్లాడించలేదు.
రేపు పొద్దునే మనమలను స్కూల్లో దింపేసి అమ్మను చూడాలి.
అమ్మను చూసేవరకూ మనసు కుదురు వుండదు. అశాంతిగా పడుకుంది రాణి.
* * * * * *
“మణమ్మా, మీ కోసం ఎవరో విజిటర్స్ వచ్చారు…” సారా మణమ్మ గది లోపలికొస్తూ అంది. ఆమె మణమ్మ కాళ్ళకు చెప్పులు తొడిగి బయటకు తీసుకువచ్చింది.
విజిటర్స్ గేలరీలో అమ్మ కోసం ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న రాణి అమ్మను చూడగానే అమాంతం లేచి ఎదురు వెళ్ళింది.
మణమ్మ రాణి వంక అభావంగా చూసింది.
ఏమీ పట్టనట్టు ఏ సంబంధమూ లేనట్టు ఒక అపరిచితురాలిని చూస్తున్నట్టు చూసి సారా వైపు తిరిగి “సారా, బ్రూనో మళ్ళీ పారిపోయినట్టున్నాడు… కాస్త చూద్దాం వస్తావా అమ్మా…” అని అడిగింది.
రాణి మనసంతా దేవినట్టయి కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ అమ్మ వంక నిస్త్రాణంగా చూస్తూండిపోయింది.
*
తనువంతా ఒక కన్నీటి సముద్రమయి..
అల్జీమర్స్ ప్రాణాంతకమైన వ్యాధి . తనను తాను కొంచెం కొంచెం గా కోల్పోయే వ్యాధి . అల్జీమర్స్ వచ్చిన వాళ్ళ కంటే వాళ్ళను సంరక్షించే వాళ్ళది పెద్ద బాధ . ఆ బాధ మనసును స్థిరంగా ఉండనీయదు . స్థిమిత పడనీయదు . అరవై ఏళ్ళ వయసు ఉన్న ఒక స్త్రీ తన కంటే మరో ఇరవయ్యేళ్లు పెద్దదయిన , అల్జీమర్స్ బాధితురాలైన తన తల్లిని తప్పని సరి పరిస్థితిలో వృద్ధాశ్రమంలో చేర్పిస్తే , చేర్పించి వారమంతా మనసంతా , తనువంతా ఒక కన్నీటి సముద్రమయి , తల్లిని చూడాలని వస్తే అల్జీమర్స్ పేగు బంధానికి కూడా సోకిందా ?
-వంశీ కృష్ణ
కథ చాలా బాగుంది.
కొన్ని అనుభవాలు
కథ ను చాలా హాయిగా నడిపిస్తాయి..
ఇక్కడ కథాంశం చాలా బాధాకరమైనది.
ప్రసిద్ద కథకుడు నా పెద్దన్నయ్య ,కె.కె.మీనన్,ఇదే వ్యాధితో బాధ పడి,వృద్దాశ్రమానికి నెట్టివేయ బ డ్డాడు.ఈ కథ చదువుతూంటే,ఆ సన్నివేశం గుర్తుకు వచ్చి కన్నీళ్ళు వచ్చాయి.రచయిత్రి ఈ సమస్య ను మంచి కథా రూపంలో చెప్పారు.ఝాన్సీ గారికి శుభాకాంక్షలు/అభి నందనలు.
____డా.కె.ఎల్.వి.ప్రసాద్
హనంకొండ
0870 2432098*
డాక్టరు గారూ, మీ స్పందనకు ధన్యవాదాలండీ🙏🙏🙏
పేగు బంధాలు కూడా ఎంత ఈజీగా తెగిపోతాయో కదా.. కడుపులో తిప్పేసింది చివరికి..
హామీ ఇవ్వగల రచయిత ఝాన్సీ ఇప్పుడు.
మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు పద్మాకర్ గారూ…..
ముగింపు మనసును మెలిపెట్టింది
మీ స్పందనకు ధన్యవాదాలండీ…. ఆ స్థితిలో బంధాలకర్థం తెలియని పసివాళ్ళు వారు…
అల్జీమర్స్ వ్యాధితో బాధపడడం ఆవిడని ఒల్దజ్ హోమ్ లో పెట్టటం , కధను బాగా చదివించారు.
Thank you very much Sir…
హృదయాన్ని కదలించే కధ మేడం ఇది, చివరలో బ్రూనో పై ఉన్న శ్రద్ద కన్న కూతురు ఎదురుగా ఉన్నా కూడ లేనంతగా గుర్తుపట్టనంతగా వచ్చే అల్జీమర్స్ ని బాగా వివరించారు. అలాగే ఎంత పెద్దవారైనా వారు ఇంట లేనప్పుడు ఉండే లోటు ఎలాంటిదో బాగా వర్ణించారు. హృదయపూర్వక అభినందనలు జాన్సీ మేడం!!
సాగర్ రెడ్డి
చెన్నై
మీ సవివరణాత్మక విశ్లేషణకు హృదయ పూర్వక ధన్యవాదాలండీ
🙏🙏🙏,కధ రాసిన,మీకు,మనః పూర్వక అభివందనలు.మేడం!మా అనుభవాన్ని, మీరు అక్షర రూపంలో,రాసినందుకు.. నా ఆవేదనను, నేనుపైకి, చెప్ప లేక పోయాను, మీరు రాసారు .అంతే తేడా.
ధన్యవాదాలండీ పద్మగారూ, ఇది నా మీ ఆవేదన కాదు… అనివార్యమైన వృద్దాప్య వేదన…మనందరిదీనూ😔😔😔
రచయిత్రి మంచి కథాంశాన్ని ఎన్నుకొని కథను నడిపించిన తీరు చాలా బాగుంది. అభినసందనలు💐
కథ చదువుతుంటే మా తాతయ్య గారు కళ్ళముందు మెదిలారు. ఆయన కూడా అల్జీమర్స్ తో బాధపడ్డారు.టిఫిన్ పెట్టేసి చేతులు వాష్ చేసుకొని అతని దగ్గరికి వస్తే వీళ్ళు నాకు ఇప్పటి వరకు టిఫిన్ పెట్టలేదు అని మాతోనే చెప్పేవారు…కళ్ళలో నీళ్ళు వచ్చేవి.మావారిని అంటే వారి అబ్బాయిని చూసి నీవెవరు అని ప్రశ్నించినప్పుడు మా వారి ఆవేదన వర్ణనాతీతం…😢
అవును మాధవీ, వృద్దాప్యం ఒక శాపం. నాకు ఒక్కోసారి ఆ స్టేజీకి వెళ్ళకుంండా వెళ్ళిపోగలిగితే బావుండుననిపిస్తుంది…Thank you for your nice response dear
కథ చదువుతున్నప్పుడు (మా వారి నాన్న గారు )తాతయ్య గుర్తుకు వచ్చారు.టిఫిన్ తిన్నా కూడా వీళ్ళు టిఫిన్ పెట్టనే లేదు మ్మా అంటూ…మళ్లీ మాతోనే చెప్పేవారు.మావారిని చూసి మా తాతయ్య నీవెవరు అని అడిగినప్పుడు ఆయన ఆవేదన వర్ణనాతీతం😢😢😢
మంచి కథాంశాన్ని ఎన్నుకొని రచయిత్రి కథను నడిపించిన శైలి చాలా బాగుంది.జాన్సీ గారికి అభినందనలు💐
Thank you dear, నేను ఆస్ట్రేలియా రెసిడెంట్ అయ్యాక ప్రధమంగా చేసే ఒక కోర్సుకి దాదాపు తొంభై శాతం ప్రభుత్వ డిస్కౌంటు వుంటుందని కెరీర్ నిర్ణయించుకుని కోర్స్ సెలెక్ట్ చేసుకోమని అమ్మాయి అంది. నాకెందుకో mentally challenged, physically disabled, aged వారికి సేవలు చేయటం చిన్నప్పటి నుండి ఒక ప్యాషన్…నేను baby care centre or old age home లో చేస్తాను దానికి సంబంధించిన కోర్స్ చేస్తానన్నాను. తను ఒప్పుకోకపోవటమే కాకుండా ఓ ఫ్రెండ్ తో aged home కి పంపింది చూడటానికి. I was really flattened by their devotion and amazing services…I actually don’t know about India. ఇక్కడ వరకూ they provide best services and take good care…
Idi katha kaadu vyaasam…..vaalla amma gaariki Alzheimer vyaadhi vasthe vriddvriddhashramam lo cherpinchaaru. Indulo katha emundi.
ippudu andaru ade chesthunnaru kondaru intilone unchukuni
choosukuntunnaru….ee vyaadhi vachhina vaaru alaage maatlaaduthaaru….adi manaku baadhaga untundi.
Aithe ee rachayithri gaaru manchi kathalu raayagalaru…..flow baagundi.
మీ స్పందనకు ధన్యవాదాలండీ…. అయితే మా అమ్మగారిని వృద్దాశ్రమంలో చేర్పించలేదు. Anyways thank you for appreciating the flow of mu writing
కధ ని చెప్పిన తీరు హృదయానికి హత్తుకుంది. చివరికి కన్న కూతురినే గుర్తు పట్టలేక పోవడం చాలా బాధని కలిగించింది. వృద్ధాప్యం ఒక శాపం. మా నాన్న గారు గుర్తొచ్చి కన్నీరు వచ్చింది. అభినందనలు ఝాన్సీ !
ధన్యవాదాలక్కా😍😍😍….
మీరు కథ నడిపిన విధానం చాలా బావుంది అల్జీమర్స్ పెద్ద వయసు స్త్రీలలో ఎక్కువ అని విన్నాను…. వృద్ద ఆశ్రమంలో చాలా మందిని చూసినప్పుడు వాళ్ళని పలకరిస్తే…. వాళ్లకు సంబందించిన వాళ్లుగా బ్రమపడి మనపై ప్రేమను చూపే వాళ్ళు …ఎక్కువే …..అటువంటి అనుభవానికి అక్షరరూపం
బావుంది….😍
Thank you dear for your nice response to my story..
ఝాన్సీ గారూ !
కథను ఆసాంతం ఆపకుండా చదివాను..
బాదనిపించింది !!
అందుకే అంటారు …..”వృధ్ధాప్యం శాపం”…అని…..
కథా గమనం అత్యుత్తమం గా వుందండీ ….
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ
మంచి కథాంశం తో కథ చాలా బాగుంది. అభినందనలు.
Thank you Sir🙏🙏🙏
That’s why we all better purchase old homes at a place together to take care each one us .
Hahaha…..That’s great idea bro
Mee amma gaarini ani kaadandi…
Katha cheppina paatra ani naa uddeshyam.
Ika andaru edo manakenduku katha baagundi ani chebithe pothndi le ani cheppi meeku anyaayam chesthunnaru.
Unnadi unnatlugaa cheppi meeku
Manasthaapam kaligisthe kshanthavyunni.
Kathalo crisis and climax undaalani the great RK Narayana gaaru annaru. Looking forward to read a good story from you madam……
I didn’t at all receive your comment in negative. I desperately need comments to correct myself….Thank you once again
కథలో మరచి పోయింది కానీ నిజం లో కాదుగా
అలా కూడా జరుగుతుందా జరిగితే దానంత బాధ ఏదీ ఉండదేమో ఈ పరిస్థితి ఈ కథకే పరిమితం కావాలని కోరుకుంటున్నా
అమ్మో…ఊహమాత్రంగానైనా అది భరించలేను…మతిమరుపు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ so far so good dear💖💖…..
Yeah ,
Experienced and experiencing the situation with lost mother and my uncle presently suffering. I can foresee tomorrow. It’s going to be same for me too .
I can visualise. Expressed your feelings perfectly.
Thank you anna, it’s not only you.. everyone has to pass through that stage before we pass away😔😔😔
హృదయాన్ని బరువెక్కించే ఆర్ద్రత గల రచయిత మీరు…..ఈసారీ కళ్ళ తడిని గుండెలకు పూశారు మేడం….
అద్భుతమైన స్పందన జ్యోతిగారు…
Thank you💖💖
ఝాన్సీ గారు ఎప్పటికప్పుడు వేగంగా కథలను రాస్తున్నారు. ప్రతి కథ ఆలోచనాత్మకంగా, మధురమైన బంధాలను పరామర్శించినట్లుగా ఉంటున్నది.
మనఃపూర్వక శుభాకాంక్షలు. మరిన్ని కథలు, కవితలు మీ నుంచి రావాలని ఆశిస్తూ…
మీ
నస్రీన్ ఖాన్
Thank you dear for your lovely comment…
Feeling sad..
నిజం madam algemers వచ్చిన వారి కంటే వారిని కని పెట్టుకొని ఉండే వారిదే ఎక్కువ కష్టం..బాగా రాశారు.. ఏదేమైనా అందాక ఉండకుండా ,ఎవరితో చేయించుకోకుండా..వెళ్లిపోవాలి.అదే అసలు అదృష్టం..దానికి కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.
నిజం చెప్పారు కాని అల్జీమర్స్ సోకని, ఏ సేవలు చేయించుకోని సుళువైన మృత్యువు, అంందరికీ దక్కదండీ….Thank you for your comment
కథ చాలా హృదయానికి హుతుకునేల ఉందండి, జనరల్ గా మీ కథలన్నీ జీవితాన్ని చదివి అనుభవించి రాస్తారు, హాట్స్ ఆఫ్ to యూ అండి, ఇలాంటి కతలు మరెన్నో రాయాలని కోరుతూ…
Thank you Vijay Kumar garu for your lovely comment
కథ చాలా బాగా ఉందండి, జనరల్ గా మీ కథలన్నీ జీవితాన్ని చదివి అనుభవించి రాస్తారు, హాట్స్ ఆఫ్ to యూ అండి, ఇలాంటి కతలు మరెన్నో రాయాలని కోరుతూ…
Dear u r one of the amazing writer I have ever seen. The stories are really amazing.
Thanks a lot darling… loads of love to you😍😍
మనసును మూగ రోదన కు గురిచేసే కథ. ఒకవేళ కూతురు కాకుండా పెంపుడు కుక్కనే చూసింటే, దాన్ని గుర్తుపట్టకుండా కూతురు గురించి అడిగేదా? ఏమో! వస్తువు, శిల్పం – రెండూ పాఠకులను ఆకట్టుకొనే విధగా ఉన్న కథ. రచయిత్రికి అభినందనలు.
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలండీ…నాకు తెలిసి బహూశా బ్రూనో అయితే తప్పకుండా గుర్తు పడుతుందనుకుంటా…కొడుకు కోడలు వెళితే కోడలిని మాత్రమే గుర్తించి ఎవరతను అని కొడుకు గురించి ఆరా అడిగిన ఒకరిని చూసాను నేను
కధ చెప్పే మీ పద్దతి చాలా బాగుంటుంది. ఇలాంటి వస్తువుల్ని మీరు బాగా ట్రీట్ చేస్తారు. ఉద్వేగం చాలా సహజంగా పలికే వాక్యాలు మీవి. కధ చదివాక కొంతసేపు మౌనం గా ఉండిపోయాను.
ఈ వారం కధ హైలెట్ ! సారంగ కి తలమానికం. అంతే
Wow, with your lovely comment you made my day Sriram garu, thank you so much
కథ చదివి గుండె బరువై పోయింది. ఏం రాయాలో తెలియటం లా.
గుండె బరువెక్కటం కన్నా గొప్ప కమెంటేముంటుందండీ…మీకు నా ధన్యవాదాలు
నాకు ఇరవై ఏళ్ళ వయసులో అమ్మ చనిపోయింది.అమ్మ లేని …అమ్మతో లేని బాధ నాకు బాగా తెలుసు..కానీ అమ్మ ఆశ్రమం లొనే జాగ్రత్తగా సేఫ్ గా వుండగలదేమో ఆలోచించండి..
లేదండీ బాబూ, జస్ట్ ఒక ఊహను కథగా రాసానంతే….మా అమ్మకు ఆశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం వుండదు…
ఓహ్ …ok.. sorry.. బట్ మీరు దగ్గరలో లేరు..అమ్మ ఎలా వుందో ఒక్కరే వుంటారు అనే ఆలోచనతో అన్నాను..లోక్డౌన్ మొదలైనప్పటి నుంచి మీరు అమ్మ కోసం ఎంత బాధపడుతున్నారూ మీ రచనలలో తెలుస్తుంది….మీ కధ అంత బాగా హృదయాన్ని కదిలించింది..నిజమేమో అన్నంత..గ్రేట్
ఎప్పటిలా మీరు కథని నడిపించిన శైలి చాలా బావుంది. కన్న తల్లిని పసి పాపలా కళ్ళల్లో పెట్టుకుని చూస్కోవాల్సిన వయసులో అల్జీమర్స్ వ్యాధి పేరుతో అలా వృధ్ధాశ్రమంలో వదిలిపెట్టడం చాలా బాధనిపించింది.ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనే కోరుకుంటాను 🙏
Thank you షామిలీగారూ for your kind words… నిజమే పగవారికి కూడా ఆ పరిస్థితి రాకూడదు….
వృద్ధాప్యం మనిషిని మరోసారి పసితనానికి తీసుుపోతుందంటే ఇదేనేమో. చాలాఆర్థ్రంగా రాశారు. మీ శైలి బాగుంది.
Thank you Wahedji 🙏🙏🙏
గుండె మెలిపెట్టేసింది .
ధన్యవాదాలండీ🙏🙏🙏
మణెమ్మ : ఇన్నాళ్ళూ నా చుట్టూ ఉన్న మనుషులే నా ఆట వినడంలేదనుకున్నా … ఇప్పుడు నా చెప్పులు కూడా నా ఆట వినిచావడంలా!
మన ఇంటిని మించిన సేవాశ్రమం, మన ప్రేమను మించిన సేవలందించడం మరొకరికి అసాధ్యమమ్మా!
కళ్ళ నీళ్ళు కుక్కుకోవడం అలవాటులేదు … నా ప్రమేయం లేకుండా ఏకధారగా కారిపోయాయమ్మా చివర్లో!
ఈ కథలో మణెమ్మను బాగా ప్రేమించింది మాత్రం ఖచ్చితంగా బ్రూనోగాడే!ఎప్పుడూ తనని అంటిపెట్టుకుని ఉండేవాడు. మిగిలినవారివి ప్రేమలు కావు కేవలం బాధ్యతలు, అందుకే మోయలేమంటారు!
అందుకే చివర్లో మణెమ్మ బ్రూనోగాణ్ణి వెతుకుదామనడం … అక్కడ ఇంట్లో బ్రూనోగాడి మణెమ్మ పడక్కుర్చీ దగ్గరే ఆమె కోసం చూడడం … అసలుసిసలు ప్రేమ!
ఇప్పుడు చెప్పండమ్మా … ఎవరిది అసలైన ప్రేమో? రాణిదా? రచయిత్రిదా?
లేక బ్రూనోగాడిదా? ఎవరినీ గుర్తుపట్టక బ్రూనోగాణ్ణి అడిగే మణెమ్మదా?
రచయిత్రిగా నేను సిగ్గుతో చితికిపోయే నిఖార్సయిన ప్రశ్న వేశారండీ…..రచయిత్రి, రాణి, సారా అందరూ వాళ్ళ వాళ్ళ విద్యుద్దర్మాలు నిర్వర్తించటమే తప్ప నోరు లేని మూగ ప్రాణి బ్రూనోగాడిదే నిర్వివాదాంశంగా అసలుసిసలైన ప్రేమ… అల్జీమర్స్ కు గురైనా మణమ్మ మెదడు అది గ్రహించే బ్రూనోగాడి కోసం వెతుకులాట…
నిజంగా వృద్ధాప్యం ఒక శాపం
Yes dear😔😔😔
నాకు మా నాన్నతో ఒక నవల రాసేటన్ని అనుభవాలు ఉన్నాయి ఝాన్సీ గారు .. వాళ్ళను సంరక్షించుకునే వారికి చాలా ఓపిక నేర్పు వుండాలి. ప్రతి రోజు మనం ప్రస్తుతంలోకి తీసుకురావడానికి ఆహారం అందించి వైద్యం చేయించడానికి మనం ఇంచు మించు ఓ తల్లీ పాత్ర పోషించాలి. .. మంచి కథను అందించారు అభినందనలు ..
నిజం చెప్పారు ఉమగారూ, ఇప్పుడిప్పుడే అమ్మకు మొదలయిన మరుపు నన్ను వివశను చేస్తోంది. మీరు తప్పకుండా నవల రాయండి.. విలువైన సూచనలతో మంచి సందేశంతో….అవసరమైన ఎందరికో మార్గదర్శకం అవుతుంది..ఇటు వంటి విషయం చదువరుల హృదయాలను తాకుతుంది…
నో వార్డ్స్ ఝాన్సీ గారు కధను నడిపిన తీరు అత్యద్భుతం.హృదయానికి హత్తుకు పోయి కన్నీటి చుక్కలు రాల్చి వృద్ధాప్యం ఎంత శాపం మనిషికి అనిపించేంత ఆర్ద్రత పూరిత కధ .నిజంగా హృదయపూర్వక అభినందనలు మీకు.మీ రచనా శైలి చాలా గొప్పది. కధకు జీవం పోశారు.👏🎍👏🎍👏🎍👏🎍👏🎍👌🎍👌🎍👌🎍❤
Thanks a lot Valishaa, మీ అమూల్యమైన స్పందనకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు…
వృద్ధాప్యంలో ఇలాగే ఉంటుందేమో. కథ చదువుతుంటే కన్నీరాగలేదు .ఇది మనమెవ్వరం తప్పించుకోలేని సమస్య. వృద్ధాశ్రమాలు కొంతవరకూ నయమే. కానీ, ఆల్జీమర్స్ వంటి సమస్యలకు పరిష్కారమే లేదా? వాస్తవ సన్నివేశం కళ్ళ ముందు కదలాడింది ఝాన్సీ.
Thank you very much leela for your response💖💖
కొన్ని పరిస్థితులు అనివార్యంగా మనిషి జీవితాన్ని అమాంతం అల్పంగా మార్చేస్తాయి. పరిష్కారం మన చేతిలో ఉండదు. అల్జీమర్స్ ఓ శాపం. ఆత్మీయత ఓ వరం. వరప్రసాదమైన అమ్మను ఇంకొంత సౌఖ్యంగా ఉంచటానికి వృద్ధాశ్రమానికి పంపక తప్పని పరిస్థితిని బిగువైన కథనంతో నడిపించారు. తీరా ఆమె తననే గుర్తించలేకపోయిన భారమైన క్షణాల దుఃఖాగ్నిని రగిలించి, కథను ముగించారు.
అసలు వృద్ధాశ్రమాలు ఉండాలా వద్దా అనేదానిపై పెద్ద చర్చ ఉంది. దానికి సంబంధించి ఎవరికుండే సమర్థన వారికుంటుంది. నా మనసు నన్ను నిర్దేశించిన బాటలో నడిచి, మా ఊరిలో (పెదపరిమి, అమరావతి దగ్గర) ఓ వృద్ధాలయం ప్రారంభించటానికి ఓ భవనం నిర్మిస్తున్నాను. నిర్మాణం చివరిదశకు చేరుకుంది.
ఝాన్సీ గారూ, మీ కథ నా సంకల్పాన్ని మరింత దృఢం చేస్తోంది.
మంచి కథ రాసినందుకు అభినందనలు.
– ఎమ్వీ రామిరెడ్డి
మీ స్పందనకు ధన్యవాదాలండీ… ఎంతో ఉదాత్తమైన మీ సంకల్పానికి నా హృదయపూర్వక అభినందనలు…..