శ్రీ శ్రీ అనే ఒక చెర్నాకోల చప్పుడు వినండి!

ఇక నుంచి ప్రతి సంచికలో ఝాన్సీ పాపుదేశి స్వరంలో అద్భుతమైన కొన్ని తెలుగు కవితలు వినండి

చెలం చెప్పినట్టు ప్రపంచంలో ప్రతి ఒక్కరి బాధ శ్రీ శ్రీ కవిత్వానిది. వాటిన చదివిన తర్వాత ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నవారిది.

రిథంతో పాటూ ఆలోచనను, విప్లవాత్మక స్ఫూర్తిని ఆయన కవితలు ఆత్మలో నింపుతాయి.

ఎనభై యేళ్లు పూర్తికావస్తున్నా  ‘మహాప్రస్థానం’ ఇంకా వేలహృదయాలను ఉద్రేకపరుస్తూనే వుంది.  చదివిన ప్రతిసారీ సరికొత్త దారుల్ని మన ముందుపరుస్తూనే వుంది.

అస్తిత్వ ప్రశ్నలతో అశాంతితో అల్లకల్లోలమయ్యే మానవ హృదయాలను శ్రీశ్రీ తన కవితలతో మరింత అశాంతిలోకి నెడతాడు.

మూస ఆలోచనలను విధ్వంసం చేసి, నవ ప్రపంచ నిర్మాణపు కలలను కళ్లమీదకు రప్పిస్తాడు.

విశ్వాసాలను కూల్చివేసి కొత్తపునాదులు నిర్మించుకోమని చెర్నాకోల వంటి పదబంధాలతో హెచ్చరిస్తాడు.

ఒక చిన్న వైరస్ ప్రపంచపు  వాకిళ్లనే మూసేయించిన అనిశ్చిత సమయంలో కవితాపఠనంచేయాలనుకున్నప్పుడు ‘మహాకవి’ ముందు బాట వేసుకున్నాడు.

కూటికోసం, కూలికోసంపట్టణంలో బ్రతుకుదామని… అంటూ ఆయన రాసిన కవిత’బాటసారి’–

కూడు గురించి, కూలి గురించి ఆలోచించకుండా పల్లె తల్లినో, పుట్టిన మట్టినో, తన వాళ్లనో చేరుకుంటే, అదేచాలని ప్రాణాలు ఫణంగా పెట్టి ఇంటిముఖం పట్టిన నేటి బాటసారి,  వలస కూలీ.  అందుకే ‘బాటసారి’ పద్యాన్ని గుర్తు చేసుకున్నా.

A.C. Swinburne రాసిన పోయెమ్ ‘A Match’ కి చాలా దగ్గరగా వున్న కవిత ‘అద్వైతం’ ద్వైదీ భావాలతో నిత్యం సంఘర్షిస్తాం మనం. Confluence of opposites  శ్రీ శ్రీ ‘అద్వైతం’ కవితలో  మనం చూడొచ్చు.

రెండు పరస్పర వ్యతిరేఖభావాలు లేదా వ్వక్తులు లేదా ఘటనలు ఎలాంటి సంఘర్షణ లేకుండా ప్రేమగా ఐఖ్యం కావడం ఈ కవితలో చూస్తాం. శ్రీ శ్రీరాసిన కవితల్లో నాకు కాస్త భిన్నంగా, ఎగ్జిస్టెన్స్ గురించి మరింత విస్తృత స్పృహతో రాసినట్టు అనిపించించింది

శ్రీ శ్రీ నాకు అర్థమైన రీతి ఇది.

శ్రీశ్రీ కవిత్వంలోంచి రెండింటిని ఎంపిక చేసుకోవడం ఎంతకష్టం. అందుకే మేధోకొలమానాలు లేకుండా నాకు నచ్చిన రెండు కవితలు ఇవి.

~

నందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపు  టంచులు

ఆనందపు లోతులు తీస్తాం.

***
నీ కంకణ నిక్వాణం_లో,
నా జీవన నిర్వాణం_లో
నీ మదిలో డోలలు తూగీ,
నా హృదిలో జ్వాలలు రేగీ
నీ తలపున రేకులు పూస్తే,
నా వలపున బాకులు దూస్తే
మరణానికి ప్రాణం పోస్తాం,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం

***
హసనానికి రాణివి నీవై
వ్యసనానికి బానిస నేనై
విషమించిన మదీయ ఖేదం
కుసుమించిన త్వదీయ మోదం
విషవాయువులై ప్రసరిస్తే,
విరితేనియలై ప్రవహిస్తే
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం

***
వాసంత సమీరం నీవై,
హేమంత తుషారం నేనై
నీ ఎగిరిన జీవవిహంగం
నా పగిలిన మరణమృదంగం
చిగురించిన తోటలలోనో,
చితులించిన చోటులలోనో
వలయములై చలించినపుడే,
విలయములై జ్వలించినపుడే
కాలానికి కళ్ళెం వేస్తాం,
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం.

***
నీ మోవికి కావిని నేనై,
నా భావికి దేవివి నీవై
నీ కంకణ నిక్వాణంలో
నా జీవన నిర్వాణంలో

ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం

-శ్రీశ్రీ గారి మహా ప్రస్థానం కవితా సంపుటి నుండి

ఝాన్సీ పాపుదేశి

ఝాన్సీ పాపుదేశి

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • సున్నితమైన సునిశితమైన కవితా ప్రారంభం.
  మంచి కవితతో ప్రారంభించారు.
  అభినందనలు మేడంగారు.
  కవితా చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతికి,
  కవిత వి౦టున్నప్పటి అనుభూతికి మధ్య గల తేడా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది ..

 • ఝాన్సీ పాపుదేశి గారి “శ్రీ శ్రీ అనే ఒక చెర్నాకోల చప్పుడు వినండి!” వ్యాసం ద్వారా మరొక్కసారి శ్రీ శ్రీ ధ్వనులను స్పురిమ్పచేసింది. బాగుంది. వలస కూలీల బతుకు పోరాటం వాళ్ళ అస్తిత్వానికి పడుతున్న తపన చూసినప్పుడల్లా అందరి మేడల్లో మెరిసిన కవిత “ “కూటికోసం, కూలికోసంపట్టణంలో బ్రతుకుదామని… బాటసారి’ కూడు గురించి, కూలి గురించి ఆలోచించకుండా పల్లె తల్లినో, పుట్టిన మట్టినో, తన వాళ్లనో చేరుకుంటే, అదేచాలని ప్రాణాలు ఫణంగా పెట్టి ఇంటిముఖం పట్టిన నేటి బాటసారి, వలస కూలీ. అందుకే ‘బాటసారి’ పద్యాన్ని గుర్తు చేసుకున్నా.

 • బాగుందండి! మరిన్ని కవితలు వినిపించగలరు!

 • శ్రీ శ్రీ కవిత్వమే ఒక చైతన్యం.నవ యవ్వన వనం లో
  రాత్రుళ్లు రాత్రుళ్లు నేనూ నా మిత్రుడు ఒకప్పటి
  అభ్యుదయ మేధావి, రాయల సీమ ఉద్యమ నేత
  కీ.శే.: కదిరి శ్రీధర్ మహా ప్రస్థానం కవితలను చదువు తోంటే మమేకమై వింటూ నన్ను నేను మరిచిపోయి శ్రీ శ్రీ ఆర్ణవం లోకి కొట్టుకు పోయి న రోజుల్ని గుర్తు చేసి నది ఝాన్సీ మీ గాత్రం.ధన్యవాదాలు.

 • 👌👌👌💐good&toughwork…బాగా చదువుతున్నారు.. మేడం! శ్రమ పడినందుకు ఫలితం దక్కు తుంది.. లెండి.అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు