Language

Telugu original: Vamsidhar Reddy

 

“You ask me something with love,

I reply to you something;

You don’t understand,

well, that’s because whatever I say

is meaningless too.

But what do I do, when it is a

necessity for every human to become

a language of one’s own.

When silence becomes a habit,

they say, one can forget two words

each day. Excuse me, though,

silence too bridges us, until

our tears burn our distances.

But, what do you say,

a tongue too dumb to imagine an answer

cannot ask a question?”

And I wrote thus, asked her

what she thinks about it. She said

something. I didn’t understand.

“Now, I know you understand” she said.

We smiled at each other, made

a paper boat out of the poem,

standing under a bridge,

waiting for rain.

 

మాటలు

నువ్వొకటి అడుగుతావు ప్రేమగా
నేనేదో చెప్తాను బదులు
నీకు అర్ధం కాదు పూర్తిగా
నిజమే
దానికి అర్ధం లేదు
నన్నేం చేయమంటావు
మనిషికో భాషగా మారడం అవసరమయ్యాక..
నిశ్శబ్దం అలవాటైతే
రోజుకి రెండు పదాలు మర్చిపోవచ్చట,
క్షమించాలి
మౌనం కూడా ఓ వంతెనేగా మనమధ్య
ఎప్పుడైనా కళ్ళేడ్చి కూల్చేసేవరకు,
అవునా
సమాధానాన్ని ఊహించలేని నాలుక ప్రశ్నకి పనికిరాదా..
అని రాసాకా
తనకు విన్పించి ఎలా ఉందన్నాను
తను ఏదో చెప్పింది
అర్ధం కాలేదన్నాను
“ఐతే నీకు సరిగ్గా అర్ధమైంది” అంది..
కాసేపు నవ్వుకుని
ఆ కాయితాన్ని పడవలా చేసి
వంతెనకింద నిలుచున్నాం ఇద్దరం
ఎప్పటిలా
వర్షంకోసం ఎదురుచూస్తూ..

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Nice expression about language.
    భేదమునకు పరికల్పన అక్షరము .
    మానవ ప్రపంచము (లోపల – బయట )
    ఈ పరికల్పనే – ఇదే వాంగ్మయ విస్తృతికి కార్యము – కారణము .
    అరుపులు, కేకలు, రాగాలు ,అనురాగాలు
    భాషణము, సంభాషణము, దుర్భాషణము
    చరిత్ర ,పురాణము, వేదము ,వేదాంతము
    వార్త, కధనము, కధానిక, కావ్యము
    విమర్శ ,వాదన, వితండ వాదము
    ఇంత వాన్గ్మయము సత్యమును తప్ప
    ఇంకేదైనా చెప్పకలదు ఎందుకని ?
    సహజమైన దాని ఫైన అసహజమైనది
    ఆరోపింప పడి ఉండుట వలన .

  • (System of representation)

    Let us examine knowledge and its functions as well as its capacities and dimensions. Knowledge requires a platform to operate, which called language. As a beginning, will it not be easy to explore what we speak and write? How do we acquire linguistic skills? Is not the word an abstract entity all by itself? Finally, are we using the word or used by it?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు