Again

Telugu original: Chandra Kanneganti

The evening was spread out against the cloudy skies as the shadows were getting longer. Both of them were walking next to each other on the road with a thick icy wall of air separating them. The background music stopped sometime ago with no one noticing. The empty movie hall is emptier with memories of previous shows with testimonies of soda cups and popcorn bags.  All the moments of excitement and colorful freshness disappeared into thin air.

Somebody came up and asked them “Do you know if there is a bookshop nearby?” hesitantly. He shook his head vaguely without bothering to focus on the question. She started answering with detailed directions “go forward and take a left until …” . She offered a few more helpful landmarks, to the puzzled face, with a pleasant smile. He got lost in that increasingly rare smile, recalling the first encounter when he was that puzzled face. She was always pleasant to strangers. 

After that person was gone, he said aloud, half to himself, “I wish I became a stranger again. You would have had a pleasant smile for me”.

Turning her head towards him, she said “But, you are becoming a stranger day by day”. He was going to retort quickly, but stopped trying to decode her voice in those words. 

 

మరోసారి

రచన: చంద్ర కన్నెగంటి

ఒక వైపు నీడలు సాగుతూన్న, మరొక వైపు మబ్బులు మూసుకురాబోతూన్న సాయంత్రం. బజార్లో పక్కపక్కనే నడుస్తూ అతనూ, ఆమే. మధ్యలో కనపడని మంచుగోడగా గడ్డకడుతూ గాలి. నేపథ్య సంగీతమెప్పుడు ఆగిపోయిందో తెలియదు. తొందరగా ముగిసిపోయిన ఒక ఆట. ఉద్విగ్నక్షణాలూ విరబూసిన రంగులూ జారిపోయిన, కరిగిపోయిన అనంతరం ఖాళీగా మిగిలిన సినిమా హాల్లా. ఇష్టంగా తినీ, తాగీ అక్కడక్కడా ఇప్పుడు చెత్తగా ఒదిలేసిన కొన్ని పట్టించుకోని జ్ఞాపకాలూ.

ఎవరో ఎదురొచ్చి “ఇక్కడో గ్రీటింగ్ కార్డ్స్ షాపుండాలి, ఎక్కడుందో మీకు తెలుసా?” అంటూ ఆపారు. ఆలోచన అటు పోక, ఏం చెప్పబుద్ధీ కాక అడ్డంగా తలూపాడు. ఆమె “ఇక్కడిది మూసేశారు…” అంటూ ఎటు వెళ్లాలో చెప్తూంది. ఆపై మరికొన్ని ప్రశ్నలకూ. అక్కరగా, ఓపిగ్గా. ఈమధ్య అరుదుగా కనపడుతున్న నవ్వు మొహాన్ని వెలిగిస్తూ. వినడం ఆపి ఆమెనే చూస్తూండిపోయాడు. మొదటిసారి ఆమెను కలిసింది ఇలానే ఏదో దారి వెతుకుతున్నప్పుడు. అపరిచితులకెప్పుడూ ఆశాభంగం కలగనివ్వదు.

వాళ్లు వెళ్లిపోయాక నడుస్తూ అన్నాడు ఆమె వంక చూడకుండానే. “మళ్లీ నీకు అపరిచితుణ్ణయి ఉంటే బావుండుననిపిస్తుంది. అప్పుడు ఇంత హాయిగా మాట్లాడేదానివి కదా!”

అతని వంక చూసి తలతిప్పుకుంటూ అంది. “నువు రోజురోజుకూ అపరిచితుడివవుతూనే ఉన్నావు!” వెంటనే బదులివ్వబోయి ఆగాడు, ఆమె గొంతులో ధ్వనించిన భావాలను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తూ.

(ఈమాట)

రామారావు కన్నెగంటి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు