ముందు;
వున్నట్టుండి
రెక్కలు విరిచి
దారుల మాయ చేసి
చూడరెవ్వరు
పలుకవ్వరు
పెదవి చిట్లరు
ముఖమెరుగరు
నేలనంటుకు తిరిగే
పురుగు కల
తొక్కబడుతుంది
తర్వాత;
దేహానికెందుకో
గొడుగు పడుతాను
యిన్కెందుకో
మాట్లాడని కనుగుడ్డు
పరితపిస్తుంది
ఖాళీ
ఖాళీ
ఖాళీ….
చివరకు;
చినుకుల కుప్పల్లాగా
అంటుకునే
కలలు
సమయాలను నెత్తిన మోస్తున్నట్టే
కన్నుల చీకటి
అలల్ని అట్లా గుమ్మరించుకుంటాను
చివరికి ముందు;
తలపు దగ్గర వొక సీతాకోక
రెక్కలు వొదిలి వెళ్ళిపోతుంది
నేను యిల్లు దాటుతాను.
*
|
10 comments
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.
పాఠకుల అభిప్రాయాలు
- పల్లిపట్టు on రెక్కలు మొలవక ముందు మా కథఅన్న... కథను దృశ్యామానమ్ చేశారు...ఉగ్గబట్టి చదివించింది.గొప్ప తిరుగుబాటు. బావుంది.
- Rohini Vanjari on రెక్కలు మొలవక ముందు మా కథచీకటి కొందరికి భయం. కొందరికి అభయం. కొందరికి ఆటవిడుపు. మరికొందరికి అనుక్షణం...
- ఓలేటి శ్రీనివాసభాను on అదండీ మేస్టారూ…!!!అంటే అన్నానంటారు గానీ ఈ కృపాకరు బాబు మా సెడ్డ మంచోదండి.....
- పెమ్మరాజు గోపాలకృష్ణ, తిరుపతి on కవి నమ్మిక ఒక్క ప్రకృతిలోనేసూరపరాజు పద్మజ గారు, కవి వసీరా కవితా సంపుటి " సెల్ఫీ...
- మల్లికార్జున్ తోట on ఇంతకీ నువ్వు కనబడతావా?మనసుకి మాటొచ్చి చెప్పినట్టు ఉంది.నీ నిఘంటువులో దండన అనే మాటకు దయ...
- Vijaya Yalamarthi on ఇంతకీ నువ్వు కనబడతావా?నాకు నేనే అడ్డేమో! నేనెవరు అని అన్వేషించే మార్గంలో ప్రయాణం ఎలా...
- GORUSU on అదండీ మేస్టారూ…!!!అయ్యిబాబోయ్.. ఇరగదీసారండి బాబూ... పీడరు బాబు గోర్ని దించేసారండి. మాగొప్ప మాండలీకమండీ...
- మాలిని - స్వతంత్ర on లాటరీ బాక్స్నాకు కొంచెం త్వరగా పెళ్లయింది. ఇంట్లో అమ్మ నన్ను గారంగా చూసేది....
- Cheguevara hari on రెక్కలు మొలవక ముందు మా కథకథ చాలా బాగుంది అన్న. ఇందులో వాక్యాలన్నీ ఒకటికి మించి ఒకటి...
- x on ఇంతకీ నువ్వు కనబడతావా?అస్పష్టంగా కూడా వినపడలేని ఓ నిస్సహాయపు మందహాస శబ్దాన్ని స్పర్శించి నువ్వు...
- Vimala on ఇంతకీ నువ్వు కనబడతావా?స్వాతీ! మీ వాక్యాలు నన్ను భయపెడతాయి ఒక్కోసారి. మూసేసిన తలుపుల్ని, తలపుల్ని,...
- patnala eswararao on ఏది ఆధునికం? ఏది సనాతనం?బాగుంది మంచి చర్చే చేశారు. కాకపోతే ఇవాళ సాహిత్యం మీద కాదు....
- Giri Prasad Chelamallu on రెక్కలు మొలవక ముందు మా కథకథా వస్తువు పాతదే అయినా కర్కశంగా నడిపించిన తీరు బావుంది
- rama sundari on ఇది ఒక తరం తపనా, పోరాట చరిత్ర!కోటేశ్వరమ్మ గారు ఒక నిశ్శబ్ద విప్లవం. జరిగేదంతా చూస్తూ నిస్తేజంగా, అగమ్యగోచరంగా...
Beautiful images Vijay.
Tnq bro..! 🙂
పెదవి చిట్లరు, పురుగు కల, మాట్లాడని కనుగుడ్డు… విజయ్ నీ కవితల్లో కనిపించే కొన్ని పోలికలు 👌 మాకాలపు అబ్స్ట్రాకర్ 💝💝
నరేషు శుక్రియా.. 😊💝
అలల్ని గుమ్మరించడం బాగుంది
Tnq sir..! 🙂
This young poet Mr. Vijay has his own genre of text in the form of poetry. He is a poet of eye opened and enlightened one who is giving perception to tje reader. Here the agony struggle beauty at last the ultimate saturated point of the emptiness has been discovered by him is incredible. Neglected areas are the.Major tools and images of the structure of the poem. A good poem has given me a enough water for my thrist. Congrats vijay.
Thanks a lot sir for ur wonderful words on my poetry… 😊
Beautiful ,get going
Tnq so much guru.. 😊